Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

గెలిచినవాడే తోపు..! ఇదే బాబు మార్క్ ‘పడిలేచే కెరటం’ ఫిలాసఫీ…!

September 1, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …….. పలుమార్లు పడిలేచిన కెరటం . అక్షర సత్యం . పొలిటికల్ సైన్స్ విభాగంలో Ph.D చేయతగ్గ జీవితం . అందరికీ తెలిసిందే ఆయన రాజకీయ జీవిత ప్రయాణం , ప్రస్థానం . కాంగ్రెసులో MLA అయి , అవసరం వస్తే మామ మీదే పోటీ చేస్తానని ప్రకటించి , ఒక సంవత్సరం లోనే అదే మామ పార్టీలో చేరిపోయిన చాలా ఫ్లెక్సిబుల్ లీడర్ .

చెన్నారెడ్డి అంతటి స్ట్రాంగ్ లీడరుకు వ్యతిరేకంగా రాజకీయం చేయకలిగిన యువ నాయకుడు . చెన్నారెడ్డిని మించిన టాల్ పర్సనాలిటీ , తెలుగు జన నాయకుడు యన్టీఆర్ దగ్గర నుండి పార్టీని లాక్కొని నిలదొక్కుకున్న మేధావి . మరోసారి పడి లేచిన కెరటం .

Ads

బాబ్రీ మసీదు కూల్చివేత తర్వాత భాజపాకు దూరం జరిగి అదే భాజపాతో కలిసి 1999 లో పోటీ చేసి రాజకీయ అధికారం చేజారకుండా మరోసారి పడిలేచిన కెరటం . వైయస్సార్ దూకుడు రాజకీయంతో 2004 లో అధికారం కోల్పోయి , పదేళ్లు ప్రతిపక్షంలో ఉండి , 2014 లో మరోసారి పడిలేచిన కెరటం .

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనికే రానీయనని ప్రకటించి , అదే మోడీతో పొత్తుకు ఒప్పించి మరోసారి పడిలేచిన నేర్పరి . వైయస్సార్ కుమారుడు జగన్ వీర దూకుడు రాజకీయంతో ఉక్కిరిబిక్కిరి అయి భాజపా నుండి విడిపోయి వాజపేయికి భిన్నమైన మోడీ చేతిలో దెబ్బ తిని కెరటం పడిపోయింది .

అందరూ ఆయన పని అయిపోయిందని అనుకున్నారు . పార్టీ కనుమరుగు అవుతుందని అన్నారు . ఎప్పుడూ సేఫ్ జోన్ , కంఫర్ట్ జోన్ పాలిటిక్స్ చేసే కేర్ఫుల్ చంద్రబాబు 52 రోజులు జైలులో గడపవలసి వచ్చింది . అలా ఘోరంగా పడిపోయిన కెరటం సహనంతో మోడీ చేతనే పొత్తుకు ఒప్పించి , జగనుకి రాజకీయంగా చుక్కలు చూపించిన పడిలేచిన కెరటం .

ఏ మోడీ అయితే son’s rise అని లోకేషుని విమర్శించాడో అదే లోకేషుని ప్రత్యేక ఆహ్వానం మీద మోడీ పిలిపించుకునేలా చేసిన కెరటం . ఇలా ఎన్నిసార్లు పడిందో , అన్ని సార్లూ లేచింది ఈ కెరటం . సాధారణమైన విషయం కాదు .

ఈ గెలుపులకు కారణం : నో సిద్దాంతమ్స్, నో రాద్దాంతమ్స్. ఎప్పటికెయ్యది ప్రస్తుతమో అదే సిద్ధాంతం. అంతే. అవకాశాలను రప్పించుకోవటం , వచ్చిన వాటిని మొహమాటపడకుండా వినియోగించుకోవటం . అందరూ అవకాశవాది అన్నా ఖాతరు చేయకుండా తన అజెండాతో ముందుకు సాగిపోవటం . గెలిచిన వాడే వీరుడు . అదే ఆయన ఫిలాసఫీ . జో జీతా వోహి సికందర్ … దట్సాల్… 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • యాక్షన్ లేదు, ఆధార్ బ్లాకూ లేదు… ఈ వివాదం పూర్వపరాలు ఇవీ…
  • మిస్టర్ కీరవాణీ… ఈ వారణాసి లవ్ సాంగ్ వీడియో నువ్వైనా చూశావా..?
  • బాగా మగ్గిన అరటి పండు కేన్సర్‌ కణాల్ని చంపేస్తుందా..? నిజమేంటి..?
  • ఈ తెలంగాణ ద్వేషి అస్సలు మారడు… మళ్లీ అదే విద్వేష ప్రదర్శన..!!
  • బిగ్‌బాస్..! బహుశా ఫైనల్స్‌లో తనూజ, ఇమ్మూ, పడాల, భరణి, రీతూ..!!
  • వ్యక్తిపూజ- ఫ్యానిజం… ఆంధ్రా కింగ్ తాలూకా… కాదు, ఓ హీరో ఫ్యాన్ తాలూకా…
  • హనుమాన్ చాలీసా టాప్ రికార్డు… ఇవీ ఇండియాలో టాప్ 10 వీడియోలు..!
  • బురద… బూడిద..! ఆలు లేదు, చూలు లేదు… అప్పుడే వేల కోట్ల స్కాములట..!!
  • ముగ్గురు కొడుకులు… కాదు, కాదు… ఒక తండ్రి, ఇద్దరు కొడుకులు, ఒక బిడ్డ…
  • 26/11 …. మరిచిపోలేని ఒక నిజ భారత రత్నం… కొన్ని బొగ్గు కేరక్టర్లు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions