Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

శోభన్‌బాబు లక్కీ హ్యాండు… ఈ జూదగాడు సూపర్ హిట్టు కొట్టేశాడు…

November 9, 2024 by M S R

.

క్రైం+ సస్పెన్స్+ అన్నాచెల్లెళ్ల సెంటిమెంట్+ అన్నాదమ్ముల సెంటిమెంట్ = జూదగాడు …

ఆగస్టు 15 , 1979 న రిలీజయి అయిదు కేంద్రాలలో వంద రోజులు ఆడిన ఈ సినిమాకు దర్శకుడు వి మధుసూధనరావు . ఆయన రీమేకులను మాత్రమే తీయగలడు అనే విమర్శకు మినహాయింపు ఈ జూదగాడు సినిమా . నిర్మాత ఛటర్జీనే కధను కూడా నేశారని టైటిల్సులో వేసారు . కాబట్టి రీమేక్ కాదు .

Ads

1979 వ సంవత్సరం శోభన్ బాబుకు జాక్ పాట్ . ఆరు సినిమాలు రిలీజయితే అయిదు సినిమాలు హిట్ , సూపర్ హిట్ , బ్లాక్ బస్టర్ . ఈ సినిమాలో కీలకమైన పాత్ర శోభన్ బాబు తమ్ముడి పాత్ర . ఈ పాత్రను నిర్మాత ఛఠర్జీ కుమారుడు మాస్టర్ క్రాంతికుమార్ నటించాడు . బాగా నటించాడు .

శోభన్ బాబు గేంబ్లరుగా , లవరుగా , ఫైటరుగా , డాన్సరుగా , అన్నగా ఎనర్జిటిక్ గా , హుషారుగా , అందంగా నటించారు . జోడీగా జయసుధ గ్లామర్ పాత్రలో చలాకీగా నటించింది . తన నటనను చూపే అవకాశం ఉన్న పాత్ర కాదు . అలవోకగా చేసిపారేసింది… మరో ప్రధాన పాత్ర జగ్గయ్యది . పోలీసు ఆఫీసరుగా , విలనుగా బాగా నటించారు . ఆయన ఇలాంటి పాత్రలను పుర్ర చేత్తో చేసేయగలరు .

సినిమాలో ట్విస్ట్ ఏమిటంటే క్లైమాక్సులో జగ్గయ్య మాస్కుని తీసేయటం , నూతన్ ప్రసాద్ ప్రత్యక్షం అవ్వటం . టైటిల్సులో నూతన్ ప్రసాద్ పేరు కూడా వేయకుండా దర్శకుడు సస్పెన్స్ బాగానే మెయింటైన్ చేసారు .

ఇతర పాత్రల్లో శ్రీధర్ , ఇంద్రాణి , గుమ్మడి , అంజలీదేవి , గిరిబాబు , ప్రభాకరరెడ్డి , సి హెచ్ కృష్ణమూర్తి , త్యాగరాజు , జయమాలిని , నిర్మలమ్మ , తదితరులు నటించారు .

శోభన్ బాబు చెల్లెలుగా ఇంద్రాణి అనే నటి నటించింది . తర్వాత మరలా ఏ సినిమాలోనూ కనిపించలేదు .. ఆమె గురించి గూగుల్ చేసినా సమాచారం లభించలేదు . (ఇది గాకుండా ఆరేడు సినిమాల్లో అప్రధాన పాత్రల్ని చేసినట్టు గుర్తుందని ఓ మిత్రుడి సమాచారం…)

ఈ సినిమాకు డైలాగులను ముళ్ళపూడి వెంకట రమణ పదునుగా వ్రాసారు . సినిమా సక్సెసులో ప్రధాన పాత్ర చక్రవర్తి సంగీతం . పాటలన్నీ శ్రావ్యంగా ఉంటాయి . కొన్ని పాటలు హిట్టయ్యాయి . ఆత్రేయ వ్రాసిన మల్లెల వేళ అల్లరి వేళ పాట సుశీలమ్మ , ఆనందులు చాలా బాగా పాడారు .

శ్రీధర్ , ఇంద్రాణిల మీద చిత్రీకరించబడింది . తప్పక చూడవలసిన వీడియో . అల్లారుముద్దుగా పెరిగింది మా లక్ష్మి అత్తవారింటికి తరలింది మా చెల్లి పాట బాగుంటుంది . చిత్రీకరణ కూడా బాగుంటుంది . ఫేమిలీ సెంటిమెంట్ పాట . ఆరుద్ర వ్రాసారు .

మిగిలిన పాటలు గరం మసాలా పాటలు . శోభన్ బాబు , జయసుధల మీద మూడు డ్యూయెట్లు ఉన్నాయి . కాశీకి పోయినా గంగలోన దూకినా , కారు కింద కోడి కారు పైన లేడీ , రయికంతా రంగేమిటి చిన్నదానా పాటల్ని హుషారుగా తీసారు . క్లైమాక్సులో గ్రూప్ డాన్స్ కూడా బాగుంటుంది .

జయమాలిని , శోభన్ బాబుల క్లబ్ డాన్స్ పాట కన్నెపిల్లల హీరో అని జయమాలిని పొగిడితే , జయమాలిని పేరు పాటలో వచ్చేలా శోభన్ బాబు పొగుడుతాడు . ఈ డాన్స్ పాటలో ఇద్దరూ ఇరగతీసారు . వీటూరి వ్రాసారు . వేటూరి కూడా కొన్ని పాటల్ని వ్రాసారు .

ఈ సినిమాలో ప్రత్యేకంగా మెచ్చుకోవలసింది సుభద్రార్జునీయం నాటకం . దర్శకుడు మధుసూధనరావు చాలా అందంగా చిత్రీకరించారు . తప్పక చూడవలసిందే . హైదరాబాద్ , విశాఖపట్నం , మఛిలీపట్నం , కాకినాడ , విజయవాడలలో వంద రోజులు ఆడిన ఈ సినిమా యూట్యూబులో ఉంది .

సందేశాలు , సూక్తులు , ప్రబోధాలు గట్రా ఏమీ ఉండవు . 100% entertaining , musical , gambler’s movie . Undoubtedly watchable and can be enjoyed . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు   ….   (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • == యుద్ధము, వ్యాపారం, స్టాక్ మార్కెట్లపై ప్రభావం ==
  • నూకల అత్తెసరు..! ఈ తరానికి తెలియని సూపర్ రెసిపీ… విత్ పచ్చిపులుసు…!!
  • ఎస్.జైశంకర్..! నాన్- పొలిటికల్ మంత్రిగా ఓ విశిష్ట ఎంపికే..! చదవండి..!
  • అటు పాకిస్థాన్‌తో యుద్ధం… సేమ్ టైమ్, విదేశీ కక్కుర్తి మీడియాతోనూ…
  • విస్తరి లేదు, అరిటాకు లేదు… నేల మీదే భోజనం… మహాప్రసాదం..!!
  • వయస్సు ఓ దశ దాటాక ఎలా బతకాలి..? గానుగెద్దు జీవితం వదిలేదెలా..?
  • గూఢచారి జ్యోతి… ఎన్ఐఏ‌ను ఏడాది క్రితమే అలర్ట్ చేసిన ట్వీట్…
  • అందరూ సమానమే, కానీ కొందరు ఎక్కువ సమానం… అసలు ఏమిటీ 23…
  • పాకిస్థానీ క్యాంపెయిన్ టీమ్‌లో ఈ ఇద్దరూ… వారి చుట్టూ ఓ ప్రేమకథ…
  • ‘‘ఛలో, ఇండియా ప్రచారాన్ని మనమూ కౌంటర్ చేద్దాం, టాంటాం చేద్దాం…’’

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions