.
T న్యూస్ యాంకర్, స్పెషల్ కరస్పాండెంట్ స్వేచ్ఛ బలవంతంగా ప్రాణం తీసుకుంది! వైవాహిక జీవితంలో పోరాటం చేస్తూ వెళ్ళిపోయింది!
గాంధీనగర్ పక్కనే జవహర్ నగర్ లో పెంట్ హౌస్ లో ఉంటున్న స్వేచ్ఛ ఇంట్లో చున్నీ తో ఉ*రి వేసుకుని కనుమూసింది! పోలీసులకు సమాచారం తెలిసి వెంటనే ఆమె భౌతిక కాయాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆమె తలిదండ్రులు శ్రీదేవి, తెలంగాణ శంకర్ దగ్గరలో రామ్ నగర్ లో నివాసం వుంటున్నారు. సంధ్య కమల్ కుమార్తె వుంది. స్వేచ్ఛ వయసు 40.
Ads
మొదటి వివాహం విడాకులకు దారి తీసింది! రెండవ వివాహం సరిగా కుదురుకోని పరిస్థితి! స్వేచ్ఛ ధైర్యవంతురాలు! పోరాటం చేస్తూనే వుంది! మంచి కవయిత్రి కూడా!
ఆమె రచించిన కవితా సంపుటిని రెండేళ్ల క్రితం విడుదల చేసింది! ప్రకృతిని ఎంతో ఇష్టపడే స్వేచ్ఛ అన్యాయాన్ని అంతే సూటిగా ప్రశ్నిస్తుంది! తెలంగాణ ఉద్యమంలో మహిళా పాత్రికేయురాలిగా తన వంతు కీలక పాత్ర పోషించింది! తను పని చేస్తున్న ఛానెల్ ను ప్రభుత్వం అన్యాయంగా మూసేయించినప్పుడు ఢిల్లీ వెళ్లి పోరుబాట చేసింది స్వేచ్ఛ!
జర్నలిజం అంటే స్వేచ్ఛకు ఎంతో ఇష్టం! తొలుత మహా న్యూస్ లో చేరింది! ఆ తరువాత hm tv, అక్కడ నుంచి 12 ఏళ్లు tv9 లో చేసి మంచి యాంకర్ గా, హోస్ట్ గా, ఇంటర్వ్యూయర్ గా, న్యూస్ ప్రజెంటర్ గా గుర్తింపు పొందింది!
కొన్నాళ్ళు మళ్ళీ V6, hm tv లో చేసి గత మూడేళ్లుగా T న్యూస్ లో చేస్తోంది! నమస్తే తెలంగాణ పత్రిక ఎడిట్ పేజీ లో వ్యాసాలు రాస్తూ తన ప్రత్యేకతను చాటుకుంటూ వుంది! ఇటీవలే జరిగిన జూబ్లీహిల్స్ జర్నలిస్ట్ హొసింగ్ సొసైటీ ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా గెలిచింది.
మరి అంత కష్టం ఏమొచ్చిందో ఏమో మంచం బెడ్ ఫై నుంచి నిలబడి ఫ్యాన్ కు ఉ*రి వేసుకుంది! ఒక మంచి ఉద్యమ జర్నలిస్ట్ ను, మంచి రచయిత్రిని చిన్న వయసులోనే కోల్పోయాం. అశ్రు నివాళి.
నీ కౌగిలి
పట్టు విడిచిన మరుక్షణం
పోతుంది ప్రాణం
చుక్కల్లో చెల్లా చెదురై
మళ్ళీ నిన్ను చుట్టేయనా
చందమామ
—- ఇది స్వేచ్ఛ రాసిన కవిత!
వెన్నెలని కప్పుకున్న రాళ్ళు
చలిని ముద్దాడుతున్నాయి
వెన్నెల గీసిన సరిహద్దుల్లో
తమను తాము దాచుకున్నాయి
ఎటు నుంచి చూసినా
వెన్నెల లేనిదెక్కడ?
ప్రేమలేని
రాయి దేహమెక్కడ?
నేనొచ్చే దారి నిండా
వెన్నెల కుప్పలు పరచి చూడు
ఓ చందమామా…
కరిగిన వెన్నెలనై
భుజంఫై తల వాల్చి
చీకటికెప్పుడూ దొరకని
నిదురనై పోతాను
ఓ చందమామా…
– ఇది స్వేచ్ఛ కవిత
కవిత రాయగానే కూతవేటు దూరంలోనే వుండే నాకు పంపించి ఎలా ఉందని అడిగే స్వేచ్ఛ, ఎందుకని ఇంత కష్టం వచ్చినప్పుడు నాకెందుకు చెప్పాలనిపించలేదు? నాకు ఇష్టమైన న్యూస్ ప్రజెంటర్ స్వేచ్ఛ కు అశ్రు నివాళి….. – డా.మహ్మద్ రఫీ
Share this Article