Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అందరమూ సావిత్రులమే… ప్రాణాపాయంలోనూ సీసాలు వదలం… పదిలం…

April 27, 2026 by M S R

.

మహానటి సినిమా… సావిత్రి పాత్రలో ఉన్న కీర్తి సురేష్… చుట్టూ మంటలు… ఆమె గదిలో నుంచి ఓ మద్యం సీసా పట్టుకొచ్చి, దాన్ని పడిపోకుండా, పదిలంగా పట్టుకుంటుంది… మంటలు ప్రమాదకరంగా చుట్టుముడుతున్నా సరే ఆ సీసాను మాత్రం వదలదు… ఆ సినిమాలో బాగా పేలిన సీన్లలో ఇదీ ఒకటి… ఆమె మద్యపాన వ్యసనం తీవ్రత అది… ప్రాణంకన్నా ఎక్కువ… ఇది ఎందుకు గుర్తు వచ్చిందంటే…

ఒక వార్త చదువుతుంటే, కొన్ని వాక్యాల దగ్గర కళ్లు ఆగిపోయాయి… వాషింగ్టన్ హిల్‌టన్ హోటల్‌లో జరిగిన ‘వైట్ హౌస్ కరస్పాండెంట్స్ డిన్నర్’ (WHCA) జరిగినప్పుడు ఓ ఆగంతకుడు కాల్పులకు తెగబడ్డాడు కదా… అంతా గందరగోెళం… ట్రంపు దంపతులు, ఉపాధ్యక్షుడు సహా ప్రభుత్వ ముఖ్యులను అప్పటికప్పుడు సీక్రెట్ సర్వీస్ గన్‌మెన్ చుట్టుముట్టి, అక్కడి నుంచి జాగ్రత్తగా సీక్రెట్ ప్లేసులోకి తరలిస్తుంటారు… సెక్యూరిటీ అలర్ట్…

Ads

ఎవరెక్కడి నుంచి కాల్పులు జరుపుతున్నారో అర్థం కాని వాతావరణం… భద్రతా వైఫల్యం… ప్యానిక్… కొందరు టేబుళ్ల కింద నక్కారు… సరే, ఓ అనుమానితుడిని సీక్రెట్ సర్వీస్ స్టాఫ్ పట్టుకున్నారు… ఇదంతా ఒకెత్తు… ఈ వాతావరణంలో కూడా కొందరు జర్నలిస్టులు (వాళ్ల కోసమే ఈ విందు) తాపీగా టేబుళ్లపై ఉన్న మద్యం గ్లాసుల్ని ఖాళీ చేసి, అక్కడే ఓపెన్ చేయకుండా ఉన్న ఫుల్ బాటిల్స్‌ను కూడా పొదివి పట్టుకుని, వెళ్లిపోతున్న దృశ్యాలు కనిపించాయి… దిగువన ఓ ట్వీట్ వీడియో బిట్ ఉంది చూడండి…



So, there you have press members STEALING wine bottles: this is who the press is!
Repugnant! pic.twitter.com/IlLlmdciXV

— TeslaBoomerPapa (@TeslaBoomerPapa) April 26, 2026



సో, క్లియర్… జర్నలిస్టులు ఎక్కడైనా అలాగే ఉంటారు… అలా ఉంటేనే జర్నలిస్టులుగా రాణిస్తారన్నమాట… మా ఆముదాలవలస, అంబాజీపేట, అంబర్‌పేటలో అంతే, అక్కడ ఆ అమెరికాలోనైనా అంతే… ఇక్కడ మా లోకల్ ప్రెస్‌క్లబ్ కవర్ చేసే రిపోర్టర్లయినా అంతే… ఆ వైట్ హౌజ్ కరెస్పాండెంట్లయినా అంతే… అనుకోవడానికి కటువుగా, స్వీయనిందలాగా ఉన్నా సరే.,. నిజంగా అక్కడున్న వాతావరణం ఏమిటి..? ప్రాణాలు దక్కించుకోవడానికి ఎక్కడో నక్కడమో, బయటికి పరుగు తీయడమో కనిపించాలి కదా… ఈ బాటిల్స్ వ్యవహారం ఏమిటి..?

ప్రాణాలకన్నా మద్యం సీసాలు ముఖ్యం… అందరమూ సావిత్రులమే… గతంలో కాస్త నయం, తరచూ నాయకులో, కంపెనీలో జర్నలిస్టులకు వెట్ పార్టీలు ఇచ్చేవాళ్లు… ఇప్పుడంటే పిలిచినా, పిలవకపోయినా పార్టీ అని తెలిస్తే చాలు వందలాదిగా మెయిన్ స్ట్రీమ్, ప్రింట్, యూట్యూబ్, టీవీ, కేబుల్, వెబ్, డిజిటల్, వర్కింగ్, నాన్‌వర్కింగ్… రాసేవాళ్లు, తీసేవాళ్లు, కూసేవాళ్లు ఎట్సెట్రా జర్నలిస్టులు వాలిపోతుంటారు… వెళ్లేప్పుడు ఫుల్ బాటిల్స్ కూడా తీసుకుపోవడం కూడా కామనే…

అఫ్‌కోర్స్, ఆ వైట్ హౌజ్ కరెస్పాండెంట్స్ విందుకు కూడా వందలాదిగా హాజరయ్యారట… అంతటి ప్రాణాపాయ స్థితిలో కూడా మద్యం సీసాలను పట్టుకుని జర్నలిస్టులు వెళ్లడంపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ నడుస్తున్నాయి… ‘మా మీడియా యవ్వారం చూడండి’ అంటూ అంతర్జాతీయ జర్నలిస్టులు కూడా ఈ ఫోటోలు, వీడియోలను బాగా సర్క్యులేట్ చేస్తున్నారు… “ప్రాణం పోయినా పర్లేదు కానీ, మందు సీసా మాత్రం పోకూడదు” అన్నట్టుగా కొందరు జర్నలిస్టుల ప్రవర్తన ఉందంటూ విమర్శలు వస్తున్నాయి…

అన్నట్టు మరొకటీ గుర్తొచ్చింది… ఆమధ్య ఎక్కడో బీర్లను తీసుకుపోయే వ్యాన్ బోల్తాపడింది… దగ్గరలో ఉన్నవాళ్లంతా పరుగుపరుగున వచ్చి, అందినకాడికి బీర్ల సీసాలు, కార్టన్లను ఎత్తుకుపోయారు… ఆ వ్యాన్ డ్రైవర్, క్లీనర్‌ ఎలా ఉన్నారో, పాపం, ఏమైపోయారో కూడా పట్టించుకోలేదు… ఫ్రీ మందు మరి… అదంతే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • పెదవి కొరికే పెదవి కొరకే… వేటూరి సుఖాలాపనలు బోలెడు…
  • అప‘జయం’ రవి..! ప్రేమ, పెళ్లి ఓ బూటకం… మనుషుల నాటకం..!!
  • సీఎం జోసెఫ్ విజయ్ టర్కీ టవల్ కథ..! కాస్త థిక్ స్కిన్ అవసరం బాసూ..!!
  • డ్రామా @ బీజింగ్… తిరుగు ప్రయాణంలో చైనా వస్తువులన్నీ చెత్తబుట్టలోకి!
  • పాపం కేటీయార్… తను కూడా ఇలా తయారయ్యాడేంటి..?
  • అన్నా, బండి సంజయ్… ఎక్కడెక్కడ తప్పు జరిగిందీ అంటే..?!
  • రక్తికడుతున్న చివరి మ్యాచులు… కోల్‘కథ’ ముగియలేదు…
  • రాధన్ పండిట్… అబ్బో, కేఏ పాల్ గారికే పెద్దన్నలా ఉన్నాడు…
  • కేటీయార్ హేపీ… 2034 తరువాతనైనా సీఎం చాన్స్ దొరకొచ్చు…
  • మస్క్ పక్కన సమస్థాయిలో ఆమె… ఓ నమ్మశక్యం కాని గ్రాండ్ సక్సెస్ స్టోరీ…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions