Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కొరటాల మార్క్ మూస మాస్… ఫార్ములా కమర్షియల్ లెక్కల్లో దేవర వోకే… కానీ…?

September 27, 2024 by M S R

యండమూరి పాత నవల… బహుశా ఆనందో బ్రహ్మ కావచ్చు… ఓ ప్రఖ్యాత రచయిత తన కొత్త పుస్తకం కంప్యూటర్ ముందు పెడతాడు… 20 శాతం ఎమోషన్, 30 శాతం ప్రేమ, 25 శాతం డ్రామా… ఇలా కొన్ని శాతాలు చెప్పి, పర్‌ఫెక్ట్ ఫార్ములా అని తేల్చేస్తుంది కంప్యూటర్… తీరా చూస్తే ఆ పుస్తకం సేల్స్ పెద్దగా ఉండవు… పాఠకులు పెదవి విరుస్తారు…

కారణం, కొత్తదనం లేకపోవడం… క్రియేటివిటీ లోపించడం… ఫార్ములా లెక్కలు తప్ప మరేమీ లేనితనం… ఆ రచయిత మథనంలో పడిపోతాడు… కానీ మన తెలుగు సినిమా ఇండస్ట్రీ పెద్ద తలకాయలకు ఈ మథనం ఇప్పటికీ స్టార్ట్ కావడం లేదు… కాదు… అన్నీ బడ్జెట్ లెక్కలు… కోట్ల పారితోషికాలు… ఫ్యాన్స్… ఓటీటీ రైట్స్, శాటిలైట్ టీవీ రైట్స్, ఓవర్సీస్ రైట్స్… ఇతర భాషల్లోకి డబ్బింగ్, పాన్ ఇండియా లెక్కలు… వందల కోట్లు…

రిస్క్… సాహసాలు వద్దు… ఏదో ఓ మూస కథ… యాక్షన్ ఉండాలి… అదిరిపోవాలి… భీకరంగా బీజీఎం… ఫుల్లు హీరోయిజం ఎలివేషన్… తప్పదు కదా ఓ హీరోయిన్ ఉండాలి… క్రేజున్న హీరోయిన్… ఇతర భాషల నుంచి ఒకరిద్దరు నటులు, మరి పాన్ ఇండియాా లుక్ కావాలి కదా… ఇదే ఫార్ములా… జూనియర్ ఎన్టీయార్ నటించిన దేవర చూస్తుంటే అదే గుర్తొస్తుంది…

Ads

నిజానికి మనకు మంచి నటులున్నారు… కానీ వాళ్లు జస్ట్, హీరోలుగా మాత్రమే ఉన్నారు… జూనియర్ ఎన్టీయార్‌లోని రియల్ నటుడిని ఆవిష్కరించతగిన పాత్ర ఈరోజుకూ తనకు రాలేదు… ఈ కమర్షియల్ ఫార్ములాల రోజుల్లో ఇక రాకపోవచ్చు కూడా… ఏడేళ్లయింది కదా తన సోలో సినిమా రిలీజై… సుదీర్ఘమైన గ్యాప్… ఆర్ఆర్ఆర్‌లో కూడా అంత గొప్ప పాత్రేమీ కాదు… రౌద్రం, రుధిరం బాపతు ఎలివేషనే…

తను ఎమోషన్స్ చక్కగా పలికించగలడు… కామెడీ టైమింగ్ కూడా… అదుర్స్ చూశాం కదా… పాత్రలోకి అచ్చంగా పరకాయప్రవేశం చేయగలడు… పాత రాజకీయ వాసనల్ని వదిలించుకుని, చంద్రబాబు వంటి నేతల నిజనైజాలు తెలుసుకుని, దూరం జరిగి, అచ్చంగా ఓ నటుడిగానే సాగుతున్న ఎన్టీయార్ తన పాత్రల విషయంలో పునరాలోచించుకోవాలి… ఎందుకంటే..?

చూస్తున్నాం కదా… అంతటి చిరంజీవి కూడా ఆచార్య, భోళాశంకర్ వంటి పాత్రలు చేసి ఎలా చేతులు కాల్చుకున్నాడో… తనకు నష్టం లేకపోవచ్చుగాక, కానీ అంతిమంగా తన ఇమేజీకి డ్యామేజీయే… చివరకు చిరంజీవి సినిమా అంటే ఇక ఇలాంటి పాత్రలే, తను మారడు, మారలేడు అనిపించుకుంటున్నాడు…

పోతినేని రామ్ డబుల్ ఇస్మార్ట్ ఏ రేంజ్ డిజాస్టరో చూశాం… మరో మంచి నటుడు రవితేజకు వరుస ఫ్లాపులు… మిస్టర్ బచ్చన్ ఘోర పరాజయం తాజాదే కదా… ఇలా బోలెడు ఉదాహరణలు… మితిమీరిన హీరోయిజం, ఫార్ములా, బిల్డప్పులను జనం అంతగా ఆదరించడం లేదు… ఇప్పుడు దేవర… అయ్యో దేవరా అనేట్టుగా లేదు గానీ… మరీ ఆచార్య సెకండ్ వెర్షన్ అన్నట్టుగా కూడా లేదు… కాస్త బెటరే… కానీ..?

చాలామంది ప్రేక్షకుల్లో నిరాశ… అసంతృప్తి… ఇది జూనియర్ స్టామినాకు తగిన కథ కాదు, పాత్ర కాదు అని… యూఎస్ ప్రీమియర్ షోల ఔట్ కమ్ అదే… ఎస్, జూనియర్ ఇరగతీశాడు, నిజమే… కానీ సినిమా ఆశించినంతగా థ్రిల్ కల్పించలేకపోయింది… ఫ్లాట్ కథనం… మరీ ముఖ్యంగా గొప్పగా చెప్పుకున్న జాన్వి పిల్లది మరీ తక్కువ స్క్రీన్ స్పేస్…

అందగత్తె, అతిలోక సుందరి అన్నట్టు ఏవో చూపించే ప్రయత్నం చేశారు గానీ, తనలో ఓ నటి ఉందాలేదాని చూపించగల పాత్ర మాత్రం అస్సలు కాదు… సైఫ్ అలీ ఖాన్‌ను తెచ్చిపెట్టుకున్నారు గానీ విలన్ కేరక్టరైజేషన్ బాగా వీక్… ఒక్క పాట మాత్రం బెటర్… అనిరుధ్ బీజీఎం పర్లేదు… ఆయుధపూజ వంటి ఒకటీరెండు సీన్లు బాగా వచ్చాయి… ఎస్, కమర్షియల్ లెక్కల్లో సినిమా పాస్ అవుతుందేమో… వందల కోట్ల వసూళ్ల లెక్కల వార్తలు ఇబ్బడిముబ్బడిగా కనిపిస్తాయేమో… కానీ జూనియర్‌లోని రియల్ నటుడిని మళ్లీ చూడాలని కోరుకునే అభిమాన ప్రేక్షకులకు మాత్రం ‘‘ఇది ఓ సగటు తెలుగు స్టార్ హీరో సినిమా’’ అనిపిస్తుంది… అంతే…

అయ్యో దేవరా… ద్యావరా… మరో ఆచార్య… మురిపించని దేవేరి… కొరటాలతో జెరపైలం… యూఎస్ మిత్రులు చెబుతున్న ఏక వాక్య సమీక్షలు… పైగా జూనియర్ అభిమానులే వాళ్లు… ప్రిరిలీజ్ వేళ విధ్వంసం చూశాం, పదుల కోట్ల నష్టం… రాబోయే రోజుల్లో హైదరాబాదులో ప్రిరిలీజులకు పర్మిషన్లు ఇవ్వాలో లేదో ఇక ప్రభుత్వం ఓ విధాననిర్ణయం తీసుకోవాల్సిన సిట్యుయేషన్… ఏదో థియేటర్‌లో టికెట్లు లేని ప్రేక్షకులు అనేకమంది జొరబడటంతో గొడవ అట, కొట్లాట, షో రద్దు అట…

అడ్డగోలు టికెట్ రేట్లు, ఎడాపెడా అధిక షోలు… వేల థియేటర్లు… పంపిణీ గొడవలు… అర్జెంటుగా జూనియర్ పాపులారిటీని సొమ్ము చేసుకునే తాపత్రయాలు… ఈ స్థితిలోనూ జూనియర్‌ను తొక్కాలని చూసేవాళ్లకూ కొదువ లేదు ఇండస్ట్రీలో, తన క్లాన్‌లో… కానీ తొక్కేకొద్దీ లేస్తాడు తను… ఆ స్టామినా ఉంది తనలో…! కాకపోతే ఈ మూస దేవర కాదు, మరో మంచి దేవర పాత్ర పడాలి తనకు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అంతటి ప్రమాదకరమైన ఫ్యాక్టరీపై ఏమిటింత నిశ్చేష్టత..!?
  • ఆ సైంటిస్టులందరూ ఎక్కడెక్కడ ఉన్నారో గానీ ఆనందిస్తూనే ఉంటారు…
  • నిజమే… ఆడ వారసులు ఐతేనేం… కేసీయార్‌కు అస్సలు నచ్చదా..?!
  • డ్రోన్ల యుద్ధమే కాదు… భీకరమైన సైబర్ యుద్ధానికీ దిగిన పాకిస్థాన్…
  • ఆట నుంచి క్రమేపీ దూరమవుతూ… ఆధ్యాత్మిక అంశాలకు దగ్గరగా…
  • ఓ చిన్న గుడి… కృష్ణా నదిలో ఓ ద్వీపంలో… పూర్తిగా చదవండి ఓసారి…
  • ఔరా అక్కినేనీ… నాసిరకం ఉత్పత్తుల్లో నువ్వూ తక్కువేమీ కాదు….
  • పాక్ పీచమణిచిన S-400 కాదు… దాని తాత S-500 కూడా వస్తుంది…
  • ఇది నిజంగా బాపు తీసిన పాటేనా..?! ఆమె అసలు ఆ జయప్రదేనా..?!
  • వేలాడదలుచుకోలేదు… క్లియర్ ప్లానింగ్… జస్ట్, అలా వదిలేశాడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions