.
జూనియర్ ఎన్టీఆర్… ఈ పేరే ప్రాచుర్యంలో ఉంది, తారక్ అని పిలిపించుకున్నా సరే… జూనియర్ అంటేనే జనానికి కనెక్టయ్యే పేరు… ఇప్పుడు మళ్లీ విస్తృత ప్రచారంలోకి వస్తోంది తన పేరు… ఈనెల 18న తన రాజకీయ రంగప్రవేశానికి సంబంధించి ఏదో అడుగు వేయబోతున్నాడు అనేది వినిపిస్తున్న ప్రచారం… ఎలా..?
కాస్త వివరంగా తెలుసుకోవాలి… ఎన్టీఆర్ రూపురేఖలు, నటనను వారసత్వంగా పొందిన మనమడు… తనను తాను ప్రూవ్ చేసుకున్నాడు… పొలిటికల్ యాంబిషన్స్ ఉన్నాయి… బాగా మాట్లాడగలడు, బ్యాలెన్స్‌డ్‌గా… 2009లోనే తెలుగుదేశం పార్టీకి ప్రచారం నిర్వహించిన అనుభవం కూడా ఉంది… ఓ బలమైన సామాజికవర్గం… పాత ఎన్టీయార్ తాలూకు లెగసీ… వెరసి జూనియర్!
Ads
అన్నింటికీ మించి పాన్- ఇండియా హీరోగా తనకు ఉన్న పాపులారిటీ! 2009లో ప్రచారం చేయించుకుని చంద్రబాబు తనను ఎందుకు వదిలేశాడు..? (వాడుకుని వదిలేయడం అలవాటే కదా అనకండి)… తన రాజకీయ వారసుడు లోకేష్ మాత్రమే… జూనియర్‌ను కేవలం వాడుకోవడమే తన ఉద్దేశం… పైగా జూనియర్‌ను ఎలా ప్రమోట్ చేసినా బాలకృష్ణకు నచ్చదు…
ఇవన్నీ అర్థమై తరువాత జూనియర్ రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు… తనకు తమ సామాజికవర్గపు తెలుగుదేశంలో ఏమాత్రం చాన్స్ లేదనే క్లారిటీ ఉంది తనకు… అంతెందుకు, సొంత సోదరి హైదరాబాదులో నిలబడినా ప్రచారం చేయలేదు, మద్దతు ప్రకటించలేదు… అంత దూరంగా ఉన్నాడు… ఆమధ్య అమిత్ షాతో భేటీ… ఐనా బయటపడలేదు… సరైన టైమ్ వచ్చేదాకా మౌనమే మంచిదనే భావన…
ఎప్పుడైతే తమిళనాడులో విజయ్ అనూహ్యంగా విజయం సాధించి సీఎం అయ్యాడో… ఇక జూనియర్ క్యాంపు కూడా యాక్టివ్ అయిపోయింది… ఇదే సరైన సమయం అనుకుంది… కొన్నాళ్లుగా ఇవే సమాలోచనలు… ఎందుకంటే..? ఏపీలో స్పేస్ ఉంది… చంద్రబాబు (లోకేష్), జగన్… వీళ్లేనా..? మూడో నాయకుడు లేడు… చంచలమైన తత్వమున్న పవన్ కల్యాణ్‌ను బీజేపీ ఎన్నాళ్లో మోయదు… కమ్మ, రెడ్డి, కాపు ఈక్వేషన్లే ఏపీలో…
జూనియర్‌కు ప్లస్ పాయింట్ ఏమిటంటే..? ఎన్టీయార్ నెత్తుటి వారసుల్లో జూనియర్‌తో పోటీపడగలవాళ్లు ఎవరూ లేరు… లోకేష్‌ను, చంద్రబాబును కాదని బాలయ్య అడుగు కూడా వేయలేడు… అలా బంధించేశాడు చంద్రబాబు… ఎలాగూ జూనియర్ కార్యస్థలం ఏపీయే… తెలంగాణలో తనకు చాన్స్ ఏమీ ఉండదు, యాక్సెప్టెన్స్ అసాధ్యం…
అమిత్ షా కూడా జూనియర్‌ను ప్రమోట్ చేయాలనుకున్నా సరే, ప్రయత్నాలు చేసినా సరే, సొంతంగానే విజయ్ తరహాలో (ఎవరి పెత్తనాలూ లేకుండా) వెళ్లాలని జూనియర్ ఆలోచన అట… అందుకే నేరుగా రాజకీయాల్లోకి గాకుండా, విజయ్ తరహాలోనే ముందు సామాజిక కార్యక్రమాలు స్టార్ట్ చేయాలని..!
తన అభిమాన సంఘాల్నీ ఆర్గనైజ్ చేయడం, సోషల్ సర్వీసుతో జనంలోకి వెళ్లడం, ఏడాదిపాటు కేవలం ఇదే పని… ఆ తరువాత పాలిటిక్స్… ఇదే మార్గం ఎంచుకున్నట్టు చెబుతున్నారు… జూలై 18న ఏం చెప్పనున్నాడు..? ఇదీ ఇప్పుడు ప్రశ్న…
తనకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా సన్నిహితుడే… గతంలో జూనియర్ ప్రచారం, ప్రసంగాలు, రాజకీయ ప్రయత్నాలకు రేవంత్ రెడ్డి మార్గదర్శి అంటారు మరి! తమిళనాడు సీఎం విజయ్ కూడా జూనియర్‌కు సన్నిహితుడే… జగన్ మోహన్ రెడ్డి గ్రాఫ్ పెరగడం లేదు… తన పాలన ఘనత మరి! చంద్రబాబు ప్రభుత్వం మీద పాజిటివ్ కూడా పెరగడం లేదు… మొన్నటి ఎన్నికల్లోనూ జగన్ వ్యతిరేక వోటు తప్ప చంద్రబాబు సాధించింది తన పాజిటివ్ వోటు కాదు…
సో, ఇదే సరైన సమయమని జూనియర్‌లో ఆలోచన స్థిరపడిందంటున్నారు… ఏపీలో ప్రస్తుతం రాజకీయ శూన్యత మాత్రం ఉంది… పవన్ కల్యాణ్ బలం పరిమితం… తను ఆల్టర్నేట్ కాడు… అవసరమైతే జూనియర్‌కు పెద్దన్నలాగా అమిత్ షా కూడా సపోర్ట్ చేస్తాడు… ఎలాగూ ఏపీ బీజేపీలో ఓ మోస్తరు నాయకుడు కూడా లేరు అందిపుచ్చుకోవడానికి!
లోకేష్ యాక్టింగ్ సీఎం ఇప్పుడు… పార్టీపరంగా, ప్రభుత్వపరంగా తనే సారథి… ఇది ఆ పార్టీలోని చాలామంది సీనియర్లకు రుచించడం లేదట… ప్రత్యేకించి లోకేష్ కుడి, ఎడమ భుజాలు రెండు లోకేష్‌ను శాసిస్తున్నారు… మరోవైపు జగన్ మీద వైసీపీలోనే నమ్మకాలు సడలిపోయాయి… చాలా ఏరియాల్లో కొత్త మొహం కోసం నాయకులు, కేడర్, జనం చూస్తున్నారు… సో, ఆల్ ది బెస్ట్ జూనియర్!!
Share this Article