.
నిన్న ‘ముచ్చట’లో చెప్పుకున్నదే… ఎవరో సినిమా నిర్మాత, ఎవరో సినిమా హీరో తన లాభం కోసం, తన వినోద వ్యాపారం కోసం… తన సినిమా హైప్ కోసం ఓ మార్కెటింగ్ టెక్నిక్‌గా ప్రిరిలీజ్ ఫంక్షన్ పెడితే ప్రభుత్వం అంగీకరించాలా..?
పోలీసు బందోబస్తు, ట్రాఫిక్ డైవర్షన్లు, జనం అవస్థలు, ఫ్యాన్స్ వీరావేశాలు… తీరా వాళ్లకేమైనా కృతజ్ఞత ఉంటుందా..? జీరో… సొసైటీ పట్ల, ప్రభుత్వం పట్ల..!
Ads
అదే జరిగింది… వాళ్లలో వాళ్లు పొగుడుకున్నారు… భుజకీర్తులు తొడుక్కున్నారు… చిన్న చిన్న సమావేశాలకూ వోట్ ఆఫ్ థాంక్స్ సెషన్ ఉంటుంది చివరలో… ఇక్కడ అదీ లేదు…
ప్రి రిలీజ్ ఫంక్షన్ల పట్ల తన ధోరణి మార్చుకుని రేవంత్ రెడ్డి ఉదారంగా దీనికి గ్రీన్‌సిగ్నల్ ఇస్తే… కనీసం వేదికపై థాాంక్స్ చెప్పాలనే సోయి కనిపించలేదు… సినిమా వాళ్లంతే… తెలుగు సినిమా వాళ్లు మరీనూ… చంద్రబాబు, పవన్ కల్యాణ్ తప్ప ఇంకెవరూ వాళ్లకు కనిపించరు… బన్నీకి ఓ చేదు అనుభవం ఎదురైనా సరే వాళ్లు మారలేదు…
జగన్, కేసీయార్, రేవంత్‌రెడ్డి ఎవరున్నా సరే… వాళ్లు డోన్ట్ కేర్… ఈ ఫంక్షన్‌లో జూనియర్ ఎన్టీయార్ తాత ఎన్టీయార్ దగ్గర నుంచి తల్లిదండ్రులు, భార్యాపిల్లలు, ఫ్యాన్స్ అందరినీ ప్రస్తావించాడు… ఫ్యాన్స్‌తో 25 ఏళ్ల అనుబంధం అన్నాడు… ఏవేవో చెప్పాడు, తెలంగాణ ప్రభుత్వాన్ని, పోలీసులను మరిచిపోయాడు…
https://www.facebook.com/reel/1898176517696965
అంతా అయిపోయాక ఎవరో గుర్తుచేసినట్టుంది… దాంతో నాలుక కర్చుకుని, తెలంగాణ సర్కారుతో అనవసరంగా గోక్కోవడం ఎందుకని అనిపించినట్టుంది… ఓ వీడియో రిలీజ్ చేశాడు సోషల్ మీడియాలో… అందులో తెలంగాణ ప్రభుత్వానికి, పోలీసులకు, సీఎంకు, డిప్యూటీ సీఎంకు థాంక్స్ చెబుతూ, వేదిక మీద మరిచిపోయినందుకు క్షమాపణ కూడా చెప్పాడు… వోకే, తప్పో పొరపాటో సరిదిద్దబడింది…
ఇక్కడ మరో ప్రశ్న… ఈ నిర్వాహకులు ఎవరు..? వాళ్లు కదా ఈ క్షమాపణలు చెప్పాల్సింది… జూనియర్ ఎన్టీయార్ దానికి నిర్మాత కాదు, సమర్పకుడు కాదు, అందులో హృతిక్ రోషన్‌తోపాటు నటించిన మరో హీరో… తనెందుకు క్షమాపణలు చెప్పడం..? పైగా వేదిక మీద థాంక్స్ చెప్పడం ఇష్టం లేక ఇలా ఓ ప్రైవేట్ వీడియో వదిలాడా..?
సరే, చివరగా… పదే పదే వేదిక మీద ఇది హిందీ సినిమా డబ్బింగ్ వెర్షన్ కాదనీ, తెలుగు సినిమాయేననీ చెబుతూ వచ్చారు… ఎందుకు..? తెలుగులో వసూళ్ల కోసం… జూనియర్ ఎన్టీయార్ కోసం… హిందీ డబ్బింగ్ సినిమా కదాని జనం చూడకుండా వదిలేస్తారేమోనని సందేహం…
కానీ నిజం ఏమిటి..? ఒక్క జూనియర్ ఎన్టీయార్ తప్ప… నిర్మాతలు, దర్శకుడు, కో-లీడ్ రోల్, హీరోయిన్, 24 క్రాఫ్ట్స్, చివరకు అతిథి నటులు కూడా హిందీ వాళ్లే… మరిందులో ఏం తెలుగుతనం వెతుక్కోవాలి..? హేమిటో ఇదంతా…!!
Share this Article