Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రక్తికడుతున్న జుబ్లీహిల్స్ పోటీ… రేవంత్‌రెడ్డి ఎత్తులు ఇంట్రస్టింగ్..!

October 9, 2025 by M S R

.

బీఆర్ఎస్ తాను బలంగా ఉన్నానని భావిస్తున్న జుబ్లీ హిల్స్ ఉపఎన్నిక ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా మారుతోంది… కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, జనసేన, మజ్లిస్ ప్రయోగిస్తున్న భేదోపాయాల్లో బీఆర్ఎస్ చిక్కుకుంది…

ఇంకాస్త వివరాల్లోకి వెళ్తే… ఫస్ట్, అభ్యర్థి ఎంపికలో రేవంత్ రెడ్డి గెలిచి, ఇల్లు అలికాడు, పండుగ బాకీ ఉంది… ఎందుకంటే, ఈ సీటు కోసం చాలామంది పోటీపడ్డారు కాంగ్రెస్‌లో… కాంగ్రెస్ కదా, అది సహజం… సీనియర్ల ఢిల్లీ లాబీయింగుల ప్రభావం నుంచి కూడా తప్పించి, తను అనుకున్నట్టే నవీన్ యాదవ్‌కు టికెట్టు ఇప్పించగలిగాడు రేవంత్ రెడ్డి…

Ads

అభ్యర్థి ఎంపిక… అయిపోయింది, రేవంత్ రెడ్డి పని అయిపోయింది, రాహుల్ దగ్గరకు రానివ్వడం లేదు అంటూ బీఆర్ఎస్ ఏదో ప్రచారం చేస్తూనే ఉంటుంది… ఉపరాష్ట్రపతి అభ్యర్థి నుంచి ప్రతి సందర్భంలోనూ రేవంత్ రెడ్డి సైలెంటుగా పావులు కదిపి, అందరికీ చెక్ పెడుతూనే ఉన్నాడు… తాజా సందర్భం నవీన్ యాదవ్ ఎన్నిక… స్టంట్ వేసుకున్న ఖర్గేను పరామర్శించడానికి వెళ్లి, పనిలోపనిగా ఈ పనీ పూర్తిచేసుకొచ్చాడు సీఎం… అంటే ఆమోదముద్ర… రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అంతర్గత రాజకీయాల కోణంలో ఈ ఉపఎన్నిక ప్రతిష్టాత్మకం మరి..!

ఓటర్లు కార్డుల పంపిణీ, తన కుటుంబీకుల నుంచి ఏవో వేధింపుల ఆరోపణలు వంటివి నవీన్ యాదవ్ అభ్యర్థిత్వంపై ప్రయోగించాలని చూసినా అవేవీ సక్సెస్ కాలేదు… నవీన్ యాదవ్ ప్లస్ పాయింట్లు ఏమిటంటే..?

  • తను స్వతహాగా మొదట మజ్లిస్ నాయకుడు… అప్పుడుప్పుడూ మజ్లిస్ సెక్యులర్ ముద్ర కోసం ఇలా హిందువులను కూడా నిలబెడుతుంది, సరే, మజ్లిస్ నేతగా క్లిక్ కాలేదు, తరువాత ఇండిపెండెంట్, రెండుసార్లు ఓటమి… తన తండ్రి గతంలో బంజారా హిల్స్ కార్పొరేటర్… సో, ఎంతోకాలంగా ఆ నియోజకవర్గంతో నవీన్ యాదవ్ కుటుంబానికి బంధాలున్నాయి…

 

బీఆర్ఎస్ ముఖ్యనేత శ్రీనివాస్ యాదవ్ సోదరుడి అల్లుడు ఈ నవీన్ యాదవ్… మొదటి నుంచి శ్రీనివాస్ యాదవ్ నవీన్‌కు రాజకీయంగా మద్దతుగా ఉంటున్నాడు… ఇప్పుడు బీఆర్ఎస్‌కు అధికారికంగా శ్రీనివాస్ యాదవ్ సహాయ నిరాకరణ చేయకపోవచ్చు గానీ… అక్కడ యాదవులు, బీసీల వోట్లు ఎక్కువ… నవీన్‌కు ప్లస్ పాయింట్ అది…

మరోవైపు… మాగంటి గోపీనాథ్ భార్య సునీతను బీఆర్ఎస్ బరిలో దింపింది… ఆమె ఆల్రెడీ తన కూతుళ్లతోపాటు ప్రచారంలో దిగింది… కేటీయార్ కూడా ప్రజామద్దతుపై కసరత్తు చేస్తున్నాడు… ఐతే సిటీ వోట్ల పోలింగే తక్కువ… పైగా సిటీ వోటర్లకు పెద్దగా సానుభూతి పట్టదు… అందుకని మాగంటి గోపీనాథ్ మరణం తాలూకు సానుభూతి ఏమేరకు వర్కవుట్ అవుతుందనేది సందేహమే…

నిజానికి హైదరాబాద్ సిటీలో గత ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ తను పట్టు నిరూపించుకుంది… కాంగ్రెస్ పనితీరు బాగాలేదు… కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక పలువురు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి చేరడంతో బీఆర్ఎస్ వీకైపోయింది… మిగిలినవాళ్లు కూడా ఉత్సాహంగా లేరు…

ఇంకోవైపు మజ్లిస్ పోటీచేయకపోవడం కూడా కాంగ్రెస్ పార్టీకి అనుకూలం… ముస్లిం వోట్లు ఇక్కడ ఎక్కువే… ఖబరిస్తాన్‌కు భూమి కేటాయింపు, 100 కోట్ల దాకా నియోజకవర్గ అభివృద్ధికి నిధులతో కాంగ్రెస్ కూడా ప్రచారాన్ని స్టార్ట్ చేసినట్టే…

ఇక్కడ సెటిలర్ల వోట్లు కూడా ఎక్కువే కానీ… ఈసారి అవి చీలిపోతాయి… ఎందుకంటే… టీడీపీ, జనసేన పైకి ఏం చెబుతున్నా సరే, ఎవరికీ మద్దతు ఉండదని చెబుతున్నా సరే… ఓ కూటమిగా బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వకతప్పదు… ఇవ్వకపోతేనే అది మిత్రద్రోహం అవుతుంది… పైగా బీఆర్ఎస్ అంటే టీడీపీకి ఆగర్భశతృత్వం ఉండనే ఉంది… బీజేపీ గెలిచేంత సీన్ ఇక్కడ లేకపోయినా సరే, బీఆర్ఎస్ ఓటమే లక్ష్యంగా (మాగంటి కమ్మ అయినా సరే) టీడీపీ ప్రయత్నించకతప్పదు…

(ఐతే రాష్ట్రంలో టీటీడీపీ పటిష్టీకరణ, బీజేపీతో పొత్తు వంటివి బీజేపీకి ఇంకా ఇంకా ఎలా ఆత్మహత్యా సదృశమో తరువాత చెప్పుకుందాం, అది స్థూలంగా వేరే కథ)…

సో, కమ్మ, కాపు వోట్లు గణనీయంగా చీలిపోతాయి… అవి బీజేపికి ఎన్ని పడితే ఆమేరకు బీఆర్ఎస్‌ను నష్టం, కాంగ్రెస్‌కు లాభం… కమ్మ వర్సెస్ రెడ్డి కోణంలో సెటిలర్ రెడ్లు ఎటువైపు మొగ్గుతారో చూడాలి… ఒక్కసారి ఓ పాత కథ చెప్పుకుందాం…



  • అవకాశాన్ని బట్టి బీఆర్ఎస్ ఎంత వేగంగా ప్లేట్లు ఫిరాయించగలదో చెప్పే కథ… అది 2016… ఖమ్మం జిల్లా, పాలేరు కాంగ్రెస్ ఎమ్మెల్యే రాంరెడ్డి వెంకటరెడ్డి అనారోగ్యం కారణంగా మరణించాడు… గతంలో ఉమ్మడి ఏపీలోనూ ఓ ఆనవాయితీ ఉండేది…
  • ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ప్రధాన పార్టీలు తమ అభ్యర్థులను ఉపఎన్నిక బరిలో ఉంచేవి కావు… ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ వెంకటరెడ్డి భార్య సుచరితను తన అభ్యర్థిగా ప్రకటించింది… కానీ ఆ సానుభూతి స్ఫూర్తిని తుంగలో తొక్కిన బీఆర్ఎస్ తన అభ్యర్థిగా తుమ్మల నాగేశ్వరరావును దింపింది…

    ఖమ్మంలో పార్టీ బలంగా అడుగుపెట్టలేని స్థితిలో… తుమ్మలను కూడా అకామిడేట్ చేయాలనే భావనతో ఆ పాత సంప్రదాయాన్ని బీఆర్ఎస్ కొట్టిపడేసింది… కుటుంబసభ్యులకు టికెట్లేమిటి అనే ధోరణి నుంచి అవకాశాన్ని, సందర్భాన్ని బట్టి బీఆర్ఎస్ తనే ప్లేటు ఫిరాయిస్తుంది… ఎలాగంటే..?

    ఇదే బీఆర్ఎస్ దుబ్బాక రామలింగారెడ్డి 2020లో మరణిస్తే ఆయన భార్య సోలిపేట సుజాతకు టికెట్ ఇచ్చింది… ఎలాగూ ‘సానుభూతి స్పూర్తి’ని బీఆర్ఎస్ పాలేరులో వదిలేసింది కదా… అందుకని ఇక్కడ బీజేపీ రఘునందన్‌రావును బరిలో దింపింది… బీఆర్ఎస్ ఎన్నిరకాల ఎత్తుగడలు వేసినా… సానుభూతిని దాటేసి మరీ బీజేపీ గెలిచింది… సో, ఎప్పుడూ సానుభూతి పనిచేయాలనేమీ లేదు… పాలేరు, దుబ్బాక ఉదాహరణలు..!!



     

    Share this Article



    Advertisement

    Search On Site

    Latest Articles

    • స్టార్ హీరో ఇమేజ్, డాన్సులు, ఫైట్లు, ఎలివేషన్లు ఉండగానే సరిపోదు..!!
    • కాంగ్రెస్‌తోపాటు బీజేపీ కూడా..! తెలంగాణకు కేసీయార్ జలద్రోహం- నిజాలు..!!
    • ‘ట్రంపరితనం’… ప్రపంచానికే వినాశకరం… ఏదో ముంచుకొస్తోంది…
    • వ్యాపిస్తున్న దుర్గంధం… తిట్ల పర్వంలో జాతీయ నేతలనూ వదలడం లేదు…
    • ఒకటి బాసట…! మరొకటి కబళింపు..! ఇదే అమెరికాకూ ఇండియాకూ తేడా..!!
    • శివశంకర ప్రసాద్ గారు… మీ ‘గెస్చర్’ మనసుని గెలుచుకుంది..!
    • సంక్రాంతి ఎప్పుడు..? ఎందుకు మీమాంస..? మళ్లీ సందిగ్ధత..!!
    • వాటిని గజల్స్ అంటారా..? నీ సారస్వత సేవ ఏమిటి శ్రీనివాసులూ…?
    • వెనెజులా..! ట్రంపుదే కాదు… మన చమురూ ఉంది అక్కడ… తవ్వాలి..!!
    • అవునూ, ఇంతకీ ఈ ‘తెలుగు గజల్ శ్రీనివాస్’ పాత కేసు ఏమైనట్టు..?!

    Archives

    Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions