జూనియర్ ఎన్టీయార్ సినిమా ఎప్పుడొస్తుంది..? కొరటాల శివ దర్శకత్వంలోని సినిమా బహుశా వచ్చే నెలలో షూటింగ్ స్టార్ట్ చేసుకుంటుంది… అది పూర్తయ్యేదాకా మరే సినిమా లేదు… అది వచ్చే సంవత్సరంలోనే రిలీజ్ అవుతుందా…? ఏమో, కావచ్చు… సంక్రాంతి బరిలో నిలవవచ్చు… మరి అప్పటిదాకా..? నిల్…! ఎన్టీయార్ వంటి ఖలేజా ఉన్న హీరోలు ఒక్కో సినిమాకు ఇంత ఆలస్యం చేయడం కరెక్టు కాదంటారు కొందరు… అది వేరే సంగతి…
మొన్నమొన్నటిదాకా ఆర్ఆర్ఆర్ కోసం మూడేళ్లు కష్టపడి, వేరే సినిమాలు చేయకుండా తమాయించుకున్నాడు కదా… చేస్తే రాజమౌళి ఊరుకోడు కదా… రాజమౌళి సినిమా ఇచ్చే కిక్కు కోసం మూడేళ్లూ కేటాయించడం పెద్ద లాస్ ఏమీ కాదు… కానీ రిస్క్ ఫ్యాక్టర్స్ లెక్కేసుకుంటే ఒక్కో సినిమాకు రెండేళ్లు మూడేళ్లు కేటాయించడం ఓ పాపులర్ హీరోకు కరెక్టు కాదు… ఫాయిదా ఉండదు… గిరాకీ ఉన్నప్పుడే మనీ గనులు తవ్వుకోవాలి కదా…
ఇప్పుడు పౌరాణికాలు, ఆ పాత్రల ఫిక్షన్లు గట్రా ట్రెండ్ కదా… ఎన్టీయార్ వారసుడిగా ఏదైనా మంచి పౌరాణిక పాత్ర ధరిస్తే ఎలా ఉంటుందనే ఆలోచన జూనియర్‌లో స్టార్టయిందంటున్నారు… ఎందుకోగానీ ఎన్టీయార్ నిజవారసుడిగా బాలయ్య పెద్దగా పౌరాణిక పాత్రల్ని వేసింది లేదు, శ్రీరామరాజ్యం వంటి క్లిక్కూ కాలేదు… ఇప్పుడు ఆ పాత్రలకు మళ్లీ గిరాకీ వచ్చింది కాబట్టి, అదే అదునుగా ఓ పాన్ ఇండియా సినిమా తీయాలని జూనియర్ ఆలోచన…
Ads
సో, త్రివిక్రమ్ శ్రీనివాస్ తో ఒక సినిమా చేయాలనేది ప్లాన్… త్రివిక్రమ్ కూడా పౌరాణికాలేమీ టచ్ చేయలేదు… దానవీరశూరకర్ణ తరహాలో త్రిపాత్రాభినయం ఉండాలట… ఆల్‌రెడీ జైలవకుశ సినిమాలో జూనియర్‌కు మూడు పాత్రలు పోషించిన అనుభవం కూడా ఉంది… తను చేయగలడు కూడా… అయితే కథ ఇప్పటి తరం ఆలోచనలకు అనుగుణంగా, పాత మూస ధోరణులకు భిన్నంగా ఉండాలని జూనియర్ త్రివిక్రమ్‌కు సూచించాడట… దీన్ని సితార ఎంటర్‌టెయిన్‌మెంట్ నిర్మాణ సంస్థ రూపొందించే అవకాశం ఉంది…
మరి కేజీఎఫ్ దర్శకుడు కేజీఎఫ్‌తో తీసే సినిమా పరిస్థితేమిటి..? ప్రస్తుతం ప్రశాంత్ నీల్ ప్రభాస్‌తో సాలార్ సినిమాను కంప్లీట్ చేయడంలో బిజీగా ఉన్నాడు… అదైపోయాక జూనియర్ సినిమా స్టార్ట్ కాబోతోంది… అంతేకాదు, దానికి సీక్వెల్ కూడా తీస్తారట… దీనికోసం రెండుమూడేళ్ల జూనియర్ డేట్లు ప్రశాంత్ బ్లాక్ చేసేశాడని సమాచారం… సో, ఈలెక్కన కేజీఎఫ్-3 ఇంకా ఆలస్యం కాబోతుందన్నమాట… (ఎలాగూ యశ్ డేట్లు రెండేళ్ల దాకా ఖాళీ లేవు… తన సొంత సినిమాలు చేసుకుంటున్నాడు…) జూనియర్ ఆర్ఆర్ఆర్ సినిమాకు ఇచ్చినట్టుగా తన డేట్లన్నీ బల్క్‌గా ఇచ్చినట్టు చెబుతున్నారు…
2024 చివరలో గానీ జూనియర్, ప్రశాంత్ సినిమా రిలీజ్ కాదు… ఆ వెంటనే సీక్వెల్ స్టార్ట్ చేస్తారట… అంటే మరో ఏడాది, ఏడాదిన్నర… మరి ఈమధ్యలో త్రివిక్రమ్‌తో పౌరాణిక సినిమా ఉంటుందా…? చెప్పలేం… కానీ ఈ మధ్యలో కొరటాల సినిమా ఒక్కటి మాత్రం రిలీజ్ కాబోతోంది… ప్రశాంత్ తీయబోయే ఈ రెండు భాగాల సినిమాలో విలన్ పాత్రకు విక్రమ్‌ను అడుగుతున్నారు… వావ్… తను కాదంటే మాత్రం సైఫ్ అలీ ఖాన్ లేదా విజయ్ సేతుపతిని అడుగుతారట…
Share this Article