ఎంత అగ్రనటుడైనా సరే… ఎంత గొప్పగా రంజింపచేయగల సామర్థ్యం ఉన్నా సరే… అది సరిగ్గా జనాన్ని రీచ్ కావాలంటే సరైన ప్లాట్‌ఫామ్ అవసరం… లేకపోతే ఆ పాపులారిటీ వేస్టు, ఆ ప్రయత్నమూ వేస్టు అనిపిస్తుంది… జూనియర్ ఎన్టీయార్ హోస్ట్ చేస్తున్న ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ షో ప్రాథమిక ఫలితాలు చూస్తే అది నిజమే అనిపిస్తుంది… తాజాగా విడుదలైన బార్క్ రేటింగుల్లో ఈ షో 10 రేటింగ్స్ సొంతం చేసుకుంది… అది ఆదివారం లాంచింగ్ రోజున… అంతే ఇక… తరువాత వీక్ డేస్‌లో చాలా వీక్ అయిపోయింది… 5, 6 రేటింగ్స్… నిజానికి హైదరాబాద్ రేటింగ్స్‌కు పరిమితమై చూస్తే లాంచింగ్ 7.87, వీక్ డేస్‌లో మూడున్నర నాలుగున్నర మధ్యలో కొట్టుకుంది… నిజానికి జూనియర్ హోస్టింగ్ స్కిల్స్, తన పాపులారిటీ రీత్యా చూసినా, ఆ షో పాపులారిటీ బట్టి చూసినా ఇది నిరాశ కలిగించేదే… రీచ్ పడిపోయి, మరీ నాలుగో స్థానంలో ఉండీలేనట్టు కొట్టుమిట్టాడుతున్న ఆ జెమిని టీవీ గాకుండా వేరే ఏ వినోద చానెల్‌లో ఈ షో వచ్చినా కనీసం సగం మేరకు ఎక్కువ రేటింగ్స్ వచ్చి ఉండేవి…
జూనియర్ స్పాంటేనిటీ బాగుంటుంది… కంటెస్టెంట్ల ప్రశ్నలకు రియాక్టయ్యే తీరు, జవాబులు ఇచ్చే తీరు బాగుంటయ్… కానీ ఏం లాభం..? కాస్త స్తుతి మోతాదు ఎక్కువైంది… అదెలా ఉన్నా టీవీ తక్కువ రీచ్ ఈ షోకు బాగా మైనస్ అయిపోయింది… సరైన ప్రమోషన్ కూడా లేదు… రాబోయే రోజుల్లో ఎలా ఉంటుందో చూడాలిక… ఇదే టీవీలో జాతిరత్నాలు సినిమాకు వచ్చిన రేటింగ్స్ కూడా నిరాశాజనకమే… నిజానికి సినిమాకు మంచి టాక్ వచ్చింది… హ్యూమర్ పండింది… లాజిక్కులు, తొక్కాతోలూ పట్టించుకోకుండా చూస్తే సినిమా ఆద్యంతమూ నవ్వించింది… ఈ నేపథ్యంలో చూస్తే టీవీలో కూడా మంచి రేటింగ్స్ వచ్చి ఉండాలి… కానీ జస్ట్ 8 దాకా వచ్చి ఆగిపోయింది, హైదరాబాద్ మార్కెట్ బార్క్‌లో ఆరున్నర… సినిమాకు వచ్చిన టాక్ కోణంలో చూస్తే ఒకరకంగా ఇదీ నిరాశాజనకమే… ఏవేవో పిచ్చి సీరియళ్లు రేటింగులను దున్నేస్తున్న రోజుల్లో ఈ రేటింగులు నిరుత్సాహపూరితమే అనుకోవాలి…
Ads
మొన్న మనం చెప్పుకున్నాం కదా, అత్యంత భారీ ఖర్చుతో నిర్మించి, ప్రసారం చేస్తున్న మాస్టర్ చెఫ్‌లో మైనస్ పాయింట్లేమిటో… దాని లాంచింగే పెద్ద ఇంప్రెసివ్‌గా లేదు… చాలా చాలా కృతకంగా సాగుతోంది షో… ఒక వంటను ప్రేక్షకుడికి పరిచయం చేస్తేనే అది వాడికి ఎక్కుతుంది… హడావుడిగా, వేగంగా, తడబడుతూ, చెమటలు కక్కుతూ… అసలు ఏం వండుతున్నారో, అందులో ఏమేం వేస్తున్నారో కూడా అర్థం కాకపోతే దాన్ని మింగేది ఎలా..? జీర్ణమయ్యేది ఎలా..? విచిత్రం ఏమిటంటే… కంటెస్టెంట్లు చేసేది మెయిన్ కోర్సా, స్నాక్సా, స్వీటా, హాటా కూడా సమజ్ కాకపోతే ఇక ఆ షో దేనికి..? హైదరాబాద్ బార్క్ రేటింగ్స్ జస్ట్, నాలుగున్నర… చాలా పూర్… ముగ్గురు జడ్జిలు, తమన్నా ప్లస్ బెంగుళూరులో భారీ సెట్టింగ్, కంటెస్టెంట్ల రాకపోకలు, వసతి ఖర్చు తడిసిమోపెడు… కానీ రిజల్ట్ ఇదీ…
Share this Article