దీన్ని అడల్ట్ కామెడీ అంటారా..? బూతు కామెడీ అంటారా..? జబర్దస్త్ తరహా అశ్లీల కామెడీ అంటారా..? డార్క్ కామెడీ అంటారా..? ఏమో, ఆ జానర్ పేరేమిటో తెలియదు గానీ… అశ్లీలం కురిపించే ఇంటిమేట్, వెగటు సీన్లు లేవు గానీ… డైలాగ్స్, కంటెంట్ మొత్తం అదే…
ఇలాంటి సినిమాల్లో, ఇలాంటి కంటెంటు ఉన్నప్పుడు కాస్త డబుల్ మీనింగ్ అర్థమయ్యీ కానట్టుగా నర్మగర్భంగా డైలాగులు ఉంటాయి, కథాగమనం ఉంటుంది… కానీ పచ్చిపాల అభిషేకుడు హీరోగా నటించిన జస్ట్ ఎ మినట్ సినిమా మొత్తం స్ట్రెయిట్ డైలాగులే… కుర్చీ మడతపెట్టే భాషే…
అఫ్‌కోర్స్, తను ఎంచుకున్న కథే అలాంటిది… గతంలో ఏడుచేపల కథ అనే సినిమా తీసినట్టున్నాడు… అదీ ఇలాంటి కంటెంటే… ఆశ్చర్యం కలిగించింది ఏమిటంటే… ఈ సినిమాకు ఐఎండీబీ 8.9 ర్యాంకింగ్ ఇవ్వడం..! నిజంగా ఈ సినిమాలో ఏముంది..? అంత సూపర్ ర్యాంకింగ్ ఇవ్వడానికి, అసలు ఈ ర్యాంకింగులకు ప్రామాణికం, పద్ధతి ఏమిటి..?
Ads
కనీసం మ్యాగీ నూడుల్స్ వండటానికైనా రెండు నిమిషాలు కావాలి అనేది ఓ మహిళ డైలాగ్… అంటే అంతకన్నా తక్కువ వ్యవధిలోనే సదరు మగమనిషి పని ముగించేశాడనీ, అదీ ఆ మహిళ అసంతృప్తి అని మనం అర్థం చేసుకోవాలి… మరోచోట ఒకామె అంటుంది, మరీ ఒక్క నిమిషమేనా అని… సో, జస్ట్ ఎ మినట్ అనే టైటిల్ మాత్రం ఆప్ట్…
అసలు ప్రోమోలో కూడా ఇలాంటి డైలాగులు దంచి వదిలారు… ఇదే కామెడీ జానర్ అనుకుంటే ఇక ఎవరూ ఏమీ చెప్పలేరు… ఈ వెగటు కామెడీ చూడటానికి ప్రేక్షకులు థియేటర్ దాకా పర్సు కత్తెరేయించుకోవడానికి రావాలా..? పైగా సినిమాలో నిర్మాణ విలువలు మరీ పూర్… దర్శకుడి అనుభవ రాహిత్యం మరీ కొట్టొచ్చినట్టు కనిపిస్తోంది… ఏవో షార్ట్ ఫిలిమ్స్ చేసి యూట్యూబ్‌లో పెట్టుకోవడానికి వోకే…
‘ఇక పడుకోవడమే లేదు’ అని ఓ డైలాగ్ ఓచోట… నిజానికి శీఘ్ర స్ఖలనం అనేది ఓ సీరియస్ ఇష్యూ… ఇలాంటి చర్చిస్తే తప్పేమీ కాదు, కానీ దాన్ని కామెడీకి వాడుకుని, బూతును నింపడమే బాగనిపించలేదు… కామెడీగా చెబితే ప్రేక్షకుడికి బాగా ఎక్కుతుంది అనుకున్నా, కనీసం అదీ సరిగ్గా పాటించక ఓ ఘాటు జబర్దస్త్ లెంతీ ఎపిసోడ్‌ను ప్రజెంట్ చేశారు…
కాలం మారుతోంది, పురుషుల్లో లైంగిక సమస్యలూ పెరుగుతున్నాయి… కారణాలు అనేకం… వాటిల్లో శీఘ్ర స్ఖలనం కూడా ఒకటి… బోలెడు సంసారాలే కూలిపోతున్నాయి… ఈ సమస్యపై కాస్త మెడికల్ ట్రీట్‌మెంట్ కూడా జతచేసి, సెన్సిబుల్‌గా డీల్ చేసి ఉంటే బాగుండేది… ప్చ్, సినిమా చివరలో కాస్త బెటర్ ప్రజెంటేషన్ కనిపించినా… మొత్తంగా కథనం తీరు సినిమా మీద ఓ పాజిటివ్ ఓపీనియన్ అప్పటికే లేకుండా పోతుంది..!!
ఆమధ్య హీరోయిన్ రెజీనా కసాండ్రా కావచ్చు, మ్యాగీ, మ్యాన్ రెండూ ఒకటే, జస్ట్ రెండు నిమిషాలే అని వ్యాఖ్యానించింది తెలుసు కదా… సినిమా స్టార్టయిన కాసేపటికే అదే గుర్తొస్తుంది పలుసార్లు..!! ఆ మ్యాగీ బాపతు డైలాగ్ కూడా ఉంది సినిమాలో..!!
Share this Article