Chada Sastry………… ఇటీవల ఒక జర్నలిస్ట్ మరణం కేరళ రాష్ట్రాన్ని కుదిపింది. ఎందుకంటే ధైర్యం, జర్నలిస్టు నీతి గలిగిన, అనేక ప్రముఖ మీడియా హౌసెస్ లో పనిచేసిన ఒక జర్నలిస్టు…. SV ప్రదీప్ అనే అతను డిసెంబర్ 15 ఒక లారీ ఆక్సిడెంట్ హిట్ & రన్ కేసులో చంపబడ్డాడు అని ఆరోపణలు వస్తున్నాయి…
ప్రముఖ రాజకీయ పార్టీల నాయకులతో మరియు కెపి యోహాన్తో తన పాత్రికేయ నిబద్ధతతో ఢీ కొన్న జర్నలిస్టు ప్రదీప్. ఈ ప్రదీప్ రాతల వల్ల ఇటీవల కెపి యోహానన్ కి చెందిన ఒక NGO పై ఐటి డిపార్ట్మెంట్ దాడి చేసింది. కెపి యోహానన్ భారీ అవయవ మార్పిడి రాకెట్టులో ఉన్నాడు అని ఈ ఎస్వీ ప్రదీప్ ఆరోపణ. ఈ జర్నలిస్ట్ మరణానికి ఈ అవయవ మార్పిడి రాకెట్ కి ఏమైనా సంబంధం ఉందేమో కేరళ ప్రభుత్వం విచారణ జరిపిస్తుందేమో చూడాలి
Ads
కెపి యోహానన్ బృందం అవయవ మార్పిడి ప్రబలంగా ఉన్న అనేక ఆసుపత్రులను నడుపుతున్నట్లు మరణించిన జర్నలిస్ట్ తన నివేదికలో వెల్లడించాడు. సమాజంలో దిగువ వర్గాల చెందిన వ్యక్తులను పెద్ద ఎత్తున మతమార్పిడులు చేసే మార్పిడి మాఫియా ఉందని, అలాంటి వారిని అవయవ మార్పిడి ఆపరేషన్లకు వాడుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు.
కేపీ యోహానన్ మరియు బృందం నిర్వహిస్తున్న ఆసుపత్రులలో ఇటువంటి చట్టవిరుద్ధ కార్యకలాపాల వల్ల సంభవించిన మరణాల సంఖ్యను దాచడానికి, వారి కింద సుమారు 20-25 శ్మశానవాటికలు ఉన్నాయి అని ఇలా అవయవ మార్పిడికి గురైన వారి మృతదేహాలు ఎటువంటి ఆధారాలు లేకుండా ఇక్కడ పూడ్చివేయబడతున్నాయని ప్రదీప్ తన నివేదికలో ఆరోపించారు.
అవయవ మార్పిడిపై తన నివేదికను ప్రచురించకుండా ఆపమని కేపీ యోహానన్ మరియు బృందం రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎలా ఒప్పించగలిగాయో ఒక వీడియోలో ఎస్.వి.ప్రదీప్ వివరించారు. కేపీ యోహానన్పై నివేదిక చేసినందుకు తాను దాదాపు అరెస్టు కూడా అయ్యానని ఆయన పేర్కొన్నారు.
పెద్ద వాళ్ల మద్దతు ఉన్న ఇటువంటి రాకెట్లపై రాయడానికి చాలా ధైర్యం అవసరం. ప్రదీప్ కి సోషల్ మీడియా ద్వారా బెదిరింపులు కూడా వచ్చాయి. ఎస్వీ ప్రదీప్ హత్యకు సిపిఎం వంటి రాజకీయ పార్టీలతో చాలా మీడియా సంస్థలు ముడిపెడుతున్నాయి. ఎందుకంటే ఎస్వి ప్రదీప్ రాష్ట్రంలోని సిపిఎం కార్యకలాపాలపై క్రమం తప్పకుండా నివేదిస్తున్నారు. ఇటీవలి బంగారు స్మగ్లింగ్ కేసుపై చాలా లోతుగా పరిశోధించి కధనాలు రాయడం చాలా మంది సీపీఎం రాజకీయనాయకులకు అధికారులకు ఆగ్రహం తెప్పించింది.
అయితే, ఎన్నికల సమయంలో ఏ రాజకీయ పార్టీ కూడా రాజకీయ హత్యకు పాల్పడి తనను తాను ఇబ్బంది పెట్టుకోదు. కేరళలో ఈ నెల 14 వరకు స్థానిక సంస్థల ఎన్నికలు జరిగాయి. కాబట్టి ఎన్నికల నడుమ ఒక వివాదం సృష్టించుకోడానికి సాధారణంగా ఏ రాజకీయ పార్టీ ధైర్యం చేయదు.
మరి ఈ హత్యను రాజకీయ పార్టీల మీదకు నెట్టయ్యడానికి ఎవరు ప్రయత్నిస్తున్నారు? ఎస్వీ ప్రదీప్ ఎలిమినేషన్‌తో ఎవరు లాభం పొందారు? మరియు అతని మరణ సమయాన్ని ఎవరు సద్వినియోగం చేసుకోగలిగారు? ఊహించడం పెద్ద కష్టం కాదు!
ఎస్వీ ప్రదీప్ తన మోటారు బైక్ మీద ప్రయాణిస్తుండగా ఒక ట్రక్ వెనుక నుండి ఢీ కొట్టింది. చూసిన ప్రత్యక్ష సాక్షులు ఇది హిట్ & రన్ కేసు అని చెపుతున్నారు. పోలీసులు డ్రైవర్‌ను అరెస్టు చేసినప్పటికీ ఇది ఒక ఇంకా ఒక యాక్సిడెంట్ గా ప్రచారం చేయబడుతోంది.
ఈ కేపీ యోహానన్ గత చరిత్ర ఏమి గొప్పది కాదని తెలుస్తోంది. అతను నిర్వహిస్తున్న ఎన్జీఓపై ఐటీ శాఖ దాడి చేసి సుమారు 7 కోట్ల విలువైన డబ్బును స్వాధీనం చేసుకున్నారు. ఎన్జీఓ కార్యాలయం లోపల రహస్య గదిలో నగదు పేర్చబడిందని, కారు డిక్కీ నుండి కూడా కొంత మొత్తం దొరికిందని కొన్ని మీడియా సంస్థలు చెప్పాయి
శబరిమల భూ గొడవలు అప్పుడు కూడా అతని పేరు బయటకు వచ్చింది. శబరిమల సమీపంలో 2268 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకున్నందుకు ఈ వ్యక్తి , అతని ఎన్జిఓ కూడా కొంతకాలం నుండి ప్రభుత్వ పరిశీలనలో ఉన్నారు . యోహానన్ కింద 100 ఎకరాల భూమి దేవస్థానం బోర్డు కు చెందినదని, కేపీ యోహానన్ ఆధీనంలో ఉన్న ఈ భూమిపై విమానాశ్రయం నిర్మించే ప్రణాళిక ఉందని ఆరోపణలు వచ్చాయి . అంటే అక్రమంగా యోహానన్ స్వాధీనం చేసుకున్న భూమిని ప్రభుత్వం భారీ ధరలకు కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి అన్న మాట.
అమెరికాలో యోహానన్ నిర్వహిస్తున్న గోస్పెల్ ఆఫ్ ఆసియా అనే సంస్థపై 2 మోసం కేసులు నమోదు అయి ఉన్నాయి . వీరి సామ్రాజ్యం చాలా వరకు వ్యాపించింది. శబరిమల ఆందోళనలో వీరి ద్వారా విదేశీ నిధులు ప్రవాహం కూడా ఉండే అవకాశం ఉంది అని కధనాలు. ఆదాయపు పన్ను శాఖ కేపీ యోహన్నన్ను తన విదేశీ లావాదేవీల పత్రాలను అందజేయాలని కోరింది. కానీ అతను విదేశీ పర్యటనలో ఉన్నట్లు ఏజెన్సీకి సమాచారం ఇచ్చారు. ఈ KP బృందం భారతదేశం అంతటా రిజిస్టర్ చేయబడిన 30 ట్రస్టులను నడుపుతోంది. వాటిలో ఎక్కువ భాగం కాగితంపై మాత్రమే ఉన్నాయి. బ్లాక్ మనిని తిప్పడానికి ఈ ట్రస్ట్ లు ఉపయోగించబడుతున్నాయి.
PFI కి చెందిన ఒక జర్నలిస్టును ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసినందుకు మీడియా అంతా గగ్గోలు పెట్టింది, టీవీలో డిబేట్లు చేశారు. మేధావులు సోషల్ మీడియాలో. పోస్టులు పెట్టారు. కారణం అక్కడ బిజెపి మత ప్రభుత్వం ఉండడం, హత్రాస్ దళిత కుల గొడవ ఉండడం. కానీ కేరళలో ప్రదీప్ అనుమానాస్పద మృతి మీద అంత స్పందన లేదు. దీనికి కారణం బహుశా ఇక్కడ ఉన్నది సెక్యూలర్ కమ్యూనిస్ట్ ప్రభుత్వం మరియు అరోపణలు ఎదుర్కొంటున్నది సెక్యూలర్ సిపిఎం మరియు బలమైన సెక్యూలర్ చర్చ్ పెద్ద కారణమా..?
Share this Article