Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆయన ఆ జడ్జిని చూపిస్తే… ఈయన పోటీగా మరో జడ్జిని ప్రవేశపెట్టాడు…

June 1, 2025 by M S R

.

Subramanyam Dogiparthi …. దర్శకేంద్రుడు NTRతో జస్టిస్ చౌదరి తీస్తే దర్శకరత్న ANRతో ఈ జస్టిస్ చక్రవర్తిని తీసారు … అందులో NTR , ఇందులో ANR ద్విపాత్రాభినయం చేసారు తండ్రీకొడుకులుగా .

పెద్దపెద్దోళ్ళకు కూడా స్పర్ధ ఉంటుంది . తన తోటి వాడు సాధించినదానిని తానూ సాధించాలనే స్పర్ధే బహుశా దాసరి చేత ఈ జస్టిస్ చక్రవర్తిని తీయించి ఉంటుంది . ఆ స్పర్థ రాఘవేంద్రరావు, దాసరి మధ్య మాత్రమే కాదు… ఎన్టీయార్, ఏఎన్నార్ మధ్య కూడా…

Ads

అయితే ఇక్కడ దాసరి మల్టీ టాస్కింగ్ పాత్రని మెచ్చుకోవాలి . ఈ సినిమాకు ఆయన నటుడు , నిర్మాత , కధారచయిత , స్క్రీన్ ప్లే రచయిత , మాటల రచయిత , పాటల రచయిత , దర్శకుడు . ఇన్ని పనులు ఒకేసారి చేసిన వారు సినిమా రంగంలో మరెవరయినా ఉన్నారా !? సినిమా పండితులే చెప్పాలి .

జస్టిసుని దైవంతో సమానంగా భావించే జస్టిస్ చక్రవర్తి దురదృష్టవశాత్తు ఒక మోసకారి అయిన అల్లుడు వలన భార్య , కుమార్తెలను పోగొట్టుకుంటాడు . ఆ పగతో దానవుడిగా మారి అల్లుడిని లేపేసి చట్టానికి లొంగిపోతాడు . తిమ్మిని బెమ్మిని , బెమ్మిని తిమ్మిని చేయగల లాయర్ బచన్ జస్టిస్ చక్రవర్తిని నిర్దోషిని చేస్తాడు . జస్టిసంటే ప్రాణంగా చూసుకునే జస్టిస్ చక్రవర్తి కోర్టులోనే చనిపోతాడు . ఇదీ కధ టూకీగా .

ANR బాగా నటించారు . ముఖ్యంగా చిగురు మామిళ్ళు అనే పాటలో చనిపోయిన కూతురు తిరిగి వచ్చిందని భ్రమించి పాడే పాటలో ఆయన నటన అద్భుతం . సినిమా మొత్తంలో నాకు బాగా నచ్చిన సీన్ ఇది . ఆయన తర్వాత తాంబూలం జయసుధదే . వద్దన్నా వచ్చే భిన్న వయసులు , అనుభవాలు , ఎత్తుపల్లాలు జీవితంలో ఎవరికయినా రావలసిందే . వీటన్నింటిలోనూ జయసుధ గొప్పగా నటించింది .

తాను నటించే ప్రతి సినిమాలోనూ ఏదో ఒక ప్రత్యేకతను ఆవిష్కరిస్తూ ఉంటారు దాసరి . ఈ సినిమాలో లాయరుగా , ఓ డిఫరెంట్ డైలాగ్ డెలివరీతో బాగా నటించారు . డైలాగ్ డెలివరీ అలా తేడాగా, అంటే డిఫరెంటుగా ఉండకుండా ఉంటేనే ఇంకా రాణించేదేమో ఆయన పాత్ర .

దాసరి తర్వాత మెచ్చుకోవలసింది ప్రతాప్ పోతన్‌ను… క్రూరమైన సాఫ్ట్ విలనీని బాగా చూపారు . ఇతర ప్రధాన పాత్రలలో సుమలత , మురళీమోహన్ , సుహాసిని , ప్రభృతులు నటించారు . రాధిక అతిధి పాత్రలో తళుక్కుమంటుంది . (ఈ సంవత్సరం సుమలత చాలా సినిమాలు చేసినట్టుంది తెలుగులో).

రమేష్ నాయుడు సంగీత దర్శకత్వంలో పాటలు థియేటర్లో శ్రావ్యంగానే ఉంటాయి . ఈ సినిమాలో ఒక్క పాట మినహాయించి అన్నింటినీ దాసరే వ్రాసుకున్నారు . ఆ ఒక్క పాట సి నారాయణరెడ్డి వ్రాసారు . ANR , సుమలతల మీద తీయబడిన గంతులు వేసే గజ్జెల గుర్రం అంటూ సాగే సర్దార్జీల గ్రూప్ డాన్స్ .

సీతమ్మకు చేయిస్తి చింతాకు పతకం రామలక్ష్మీ అని ఓ రీమిక్స్ పాట ప్రతాప్ పోతన్ , విజయలలిత , అనూరాధల మీద క్లబ్ డాన్సుగా ఉంటుంది . ఇప్పుడయితే ఆ పాటకు దాసరిని ఉతికుతికి ఆరేసేవాళ్ళు . ఈమధ్యే ఇలాంటి రీమిక్స్ పాట విషయంలో తమిళనాడులో నానా రభస అయింది .

చందమామ దిగివచ్చే , రాంగ్ నంబర్ రమణమ్మా , ప్రేమంటే తెలుసుకోండిరా డ్యూయెట్లు , ప్రేమించి సుఖపడండిరా ఫేమిలీ పాట హుషారుగా ఉంటాయి . కోర్టుకెళ్ళబోకురా సోదరా పాట బాగుంటుంది .

1984 సెప్టెంబరులో విడుదలయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలా ఫేర్ చేసిందో నాకు ఐడియా లేదు . యూట్యూబులో ఉంది . ఇంతకుముందు చూడని అక్కినేని , దాసరి అభిమానులు చూడవచ్చు . చూడబులే . It’s a sentimental , family-centric movie . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు….


ఏమాటకామాట జస్టిస్ చౌదరి, జస్టిస్ చక్రవర్తి కథలు వేరయినా, ట్రీట్‌మెంట్ వేరయినా జడ్జి పాత్రలో ఎన్టీయార్‌తో పోలిస్తే ఏఎన్నార్ అంతగా ‘మెరవలేదు’…


 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ఆయేషా మీరా..! కేస్ ఖతం..!! మరి ఎవరు హత్యాచారానికి పాల్పడింది..!?
  • ఓ తండ్రి చితి… పక్కన కొడుకు… ఈ వైరల్ కథకు వాస్తవ ముగింపు అదేనా..?
  • 37 ఏళ్ల తర్వాత తల్లి పక్కకు తండ్రిని చేర్చాడు..! పక్కపక్క సమాధులు..!!
  • సరిత..! అప్పట్లో ఈ నటి విడాకుల కేసు ఓ సంచలనం…!!
  • స్టెమ్ సెల్ థెరపీ..! సుగర్ వ్యాధిపై మనిషి గెలుపు త్వరలోనే..!
  • కృష్ణంరాజు డేట్స్ ఇచ్చాడు… ఓ సినిమా లాగించేశారు… అంతే…
  • రెడ్ గోల్డ్..! బంగారం, వెండి మాత్రమే కాదు… రాగి కూడా ‘ఆకర్షిస్తోంది’…!!
  • ఆ ఎమ్మెల్యే ఎవరో గానీ… అయ్యా, సారూ, నీకో దండం సామీ…!!
  • శతాబ్దం తరువాత ఈ గర్భగుడి తెరుచుకుంటోంది..! అసలు ఏమిటీ కథ..?
  • గీ బూతులు, గీ పాటలు… అరె, గిట్ల తయారయ్యారేందిర భయ్…

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions