Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆహా… ఏ టెస్టు బౌలరైనా కలలుగనే స్పెల్ ఇది… వావ్, వావ్…

July 28, 2026 by M S R

.

మొదట ఇది నిజం కాదేమో అనుకున్నాను… మరోసారి చెక్ చేశాను… నిజమే… ఇది నిజమే. అంతేకాదు, టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఇంతవరకు ఏ బౌలర్ చేయని ఘనత ఇది అని Justin Greaves పేరిట ఐసీసీ అధికారికంగా పేర్కొంది. అందుబాటులో ఉన్న టెస్టు రికార్డుల ప్రకారం వరుసగా ఐదు వికెట్ మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా గ్రీవ్స్ చరిత్ర సృష్టించాడు.

ఇది నిజంగా ఏ బౌలర్ అయినా కలలు కనే స్పెల్.

Ads

  • 64వ ఓవర్: మెయిడెన్ + వికెట్
    66వ ఓవర్: మెయిడెన్ + వికెట్
    68వ ఓవర్: మెయిడెన్ + వికెట్
    70వ ఓవర్: మెయిడెన్ + వికెట్
    72వ ఓవర్: మెయిడెన్ + వికెట్

మొత్తం: 5 వరుస ఓవర్లు… 5 మెయిడెన్లు… 5 వికెట్లు… ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు! వావ్… వావ్…

కథనం… బౌలర్ జీవితంలో ఇలాంటి స్పెల్ ఒక్కసారి వస్తే చాలు..! చరిత్రే గుర్తుంచుకుంటుంది!

  • టెస్టు క్రికెట్‌లో ఒక బౌలర్ ఐదు వికెట్లు తీయడం గొప్ప విషయమే. ఐదు మెయిడెన్ ఓవర్లు వేయడం కూడా ప్రత్యేకమే. కానీ ఈ రెండింటినీ కలిపి… అదీ వరుసగా ఐదు ఓవర్లలో ఒక్కో వికెట్ తీస్తూ, ఒక్క పరుగు కూడా ఇవ్వకుండా పూర్తి చేయడం? ఇప్పటివరకు ఎవరూ చేయని అద్భుతం.

వెస్టిండీస్ పేసర్ జస్టిన్ గ్రీవ్స్ ఈ ఫీట్ ఏదో అనామక జట్టు మీద సాధించలేదు… పాకిస్థాన్‌పై అదే చేసి చూపించాడు.

పాకిస్థాన్ ఒక దశలో మంచి స్థితిలో కనిపించింది. కానీ గ్రీవ్స్ చేతికి బంతి వచ్చిన తర్వాత మ్యాచ్ పూర్తిగా మారిపోయింది. ప్రతి స్పెల్‌లో బౌలర్లు “ఒక బ్రేక్‌థ్రూ వస్తే చాలు” అనుకుంటారు. కానీ గ్రీవ్స్ మాత్రం ప్రతి రెండో ఓవర్‌లో వికెట్ కాదు… ప్రతి ఓవర్‌లో ఒక వికెట్ తీస్తూ ప్రత్యర్థిని కుప్పకూల్చాడు.

ఈ స్పెల్‌లో మరో విశేషం ఏమిటంటే… బ్యాటర్లకు ఒక్క పరుగు కూడా ఇచ్చే అవకాశం ఇవ్వలేదు. డిఫెన్స్ ఆడినా అవుట్, డ్రైవ్ చేసినా అవుట్, వదిలేసినా ప్రమాదమే. అంత కచ్చితమైన లైన్, లెంగ్త్‌తో బౌలింగ్ చేశాడు.

ఇప్పటివరకు వరుసగా నాలుగు వికెట్ మెయిడెన్ ఓవర్ల రికార్డు మాత్రమే ఉండేది. ఇంగ్లండ్ మాజీ పేసర్ Stuart Broad 2016లో ఆ ఘనత సాధించాడు. ఇప్పుడు ఆ రికార్డును దాటి, వరుసగా ఐదు వికెట్ మెయిడెన్ ఓవర్లు వేసిన తొలి బౌలర్‌గా జస్టిన్ గ్రీవ్స్ టెస్టు చరిత్రలో తన పేరును బంగారు అక్షరాలతో లిఖించుకున్నాడు.

క్రికెట్‌లో కొన్ని గణాంకాలు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. కానీ కొన్ని స్పెల్స్ చూస్తే మాత్రం బౌలింగ్ కూడా ఒక కళ అని మరోసారి గుర్తుకు వస్తుంది. జస్టిన్ గ్రీవ్స్ ఈ స్పెల్… అలాంటి కళాఖండమే…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • G O A T … అనగా మేక, అనగా బకరా… అనగా తెలుగు ప్రేక్షకుడు..!!
  • పాపం రెహమాన్ ! కచేరీలకు ఆదరణ కరువు ! చుట్టూ బోలెడు నెగెటివిటీ !!
  • Overhauling Telangana’s Schooling: A Bold Step Toward Educational Equity
  • పాఠశాల విద్య సంస్కరణలు- బీఆర్ఎస్‌కు చేతకానిది, రేవంత్ సంకల్పించినది!
  • 3200 కోట్ల మంది హిందూ దేవతలట… మమత పార్టీ ఎంపీ పిచ్చి కూతలు!!
  • పార్టీ పేరు దగ్గర మొదలైన కసరత్తులోపం… ఆవిర్భావ ప్రసంగం దాకా..!!
  • టీవీకే ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ రహస్య భేటీలు- దేనికంటే..?
  • పక్కా అర్హుడు! ప్రణబ్ ముఖర్జీ ప్రధాని పదవి ఆశించి ఉంటే తప్పేముంది…!
  • కావ్య అనిరుధ్ పెళ్లి … కరుణానిధి – రజినీకాంత్ కుటుంబాల వియ్యం !!
  • *మైనస్ పాయింట్స్‌గా చెప్పబడుతున్నవన్నీ నిజానికి ప్లస్ పాయింట్సే*

Archives

Copyright © 2026 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions