Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అల్లు రామలింగయ్య ఓ శాడిస్టిక్ విలన్… చిరంజీవి బాధితుడు ఫాఫం…

July 12, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ద్విపాత్రాభినయంతో చిరంజీవి జ్వలించిన సినిమా 1985 జూన్ 14న రిలీజయిన ఈ జ్వాల … కధ రొటీన్ పగ , క్రైం వంటి అంశాలతో ఉన్నా కధను ఆవిష్కరించిన తీరు బిర్రుగా ఉండటం , చిరంజీవి వీరోచిత ఏక్షన్ సీన్లు డాన్సులు బ్రహ్మాండంగా ఉండటంతో సినిమా వంద రోజుల క్లబ్బులో చేరిపోయింది .

కానీ అప్పట్లో చిరంజీవికి ఉన్న పాపులారిటీ, క్రేజ్ కోణంలో చూస్తే ఆ రేంజ్ పెద్ద విజయం మాత్రం కాదు… ఓ సిన్సియర్ పోలీస్ ఆఫీసరుకి ఇద్దరు కొడుకులు . పెద్ద కొడుకు తన స్నేహితుడు చేసిన మోసం వలన తండ్రికి దూరం అయిపోతాడు . రెండో కొడుకు IPS అవుతాడు . విధి నిర్వహణలో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఓ క్రిమినల్ కొడుకుని షూట్ చేస్తాడు .

Ads

తన ఒక్కగానొక్క ముద్దుల కొడుకుని చంపాడనే కోపంతో పోలీస్ ఆఫీసర్ని , అతని భార్యను క్రూరంగా చంపుతాడు క్రిమినల్ . ఆ క్రిమినల్ని , అతని ఇద్దరు సహచరులను హీరో గారు తుదముట్టించడంతో సినిమా ముగుస్తుంది .

ఇద్దరు కొడుకులుగా చిరంజీవి , సిన్సియర్ పోలీస్ ఆఫీసరుగా సత్యనారాయణ , అతని భార్యగా అన్నపూర్ణ , పెద్ద కొడుకు భార్యగా రాధిక బాగా నటించారు . చిన్న కొడుకు ప్రేయసిగా భానుప్రియ గ్లామర్ డాల్ గా కనిపిస్తుంది .

క్రిమినల్సుగా కన్నడ ప్రభాకర్ , సిలోన్ మనోహర్ , అల్లు రామలింగయ్యలు నటించారు . సాధారణంగా సాఫ్ట్ & కామెడీ విలనుగా కనిపించే అల్లు రామలింగయ్య ఈ సినిమాలో సేడిస్ట్ విలనుగా కనిపిస్తాడు . బాగా నటించారు . ఇతర ప్రధాన పాత్రల్లో రమణమూర్తి , సాయికుమార్ , గుమ్మడి , ప్రభృతులు నటించారు .

ఇళయరాజా సంగీత దర్శకత్వంలో వేటూరి , సి నారాయణరెడ్డి , మైలవరం గోపిలు వ్రాసిన పాటల్ని బాలసుబ్రమణ్యం , జానకమ్మలు చాలా శ్రావ్యంగా పాడారు . రాధిక , చిరంజీవిల మధ్య సాగే ఏవేవో కలలు కన్నాను మదిలో సంగీతం చాలా భిన్నంగా , శ్రావ్యంగా ఇళయరాజా ప్రత్యేక శైలిలో ఉంటుంది .

రాధిక
చిరంజీవి హోటల్లో పాడే డాన్స్ పాట తళాంగు ధింత , మరో పాట కలికి చిలక చలికి దరికి చేరగనే బాగుంటాయి . ఈ రెండు పాటలూ భానుప్రియతోనే . సిల్క్ స్మిత , జయమాలిని డాన్స్ పాటలు బాగుంటాయి . జయమాలినితో డాన్స్ పాటలో చిరంజీవి అద్భుతంగా డాన్సించారు . సిల్క్ స్మిత డాన్స్ అతిగా ఉంటుంది .

సినిమా నృత్య దర్శకులు తార , ఆంథొనీలను అభినందించాలి . పాటల్ని అందంగా చిత్రీకరించిన దర్శకుడు రవిరాజా పినిశెట్టిని మెచ్చుకోవలసిందే . క్లైమాక్స్ సీనులను దర్శకుడు చాలా బాగా తీసారు . లోకేషన్ బాగుంటుంది .

తెలుగులో సక్సెస్ అయిన ఈ సినిమాను మళయాళంలో ప్రతీకార జ్వాల టైటిలుతో , తమిళంలో సత్యం శివం సుందరం టైటిలుతో రీమేక్ చేసారు . కధ , స్క్రీన్ ప్లే , దర్శకత్వాన్ని రవిరాజా పినిశెట్టి నిర్వహించగా , సంభాషణలను సత్యమూర్తి పదునుగా వ్రాసారు .

సినిమా యూట్యూబులో ఉంది . ఇంతకముందు చూసి ఉండకపోతే చూడతగ్గ సినిమాయే . చిరంజీవి అభిమానులు చూసి ఉన్నా మరలా చూడవచ్చు . It’s an action , emotion , sentiment-filled entertainer .
#తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు #సినిమాకబుర్లు

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ‘‘అడ్డూఅదుపూ లేని కాళేశ్వరం దందాకు… కేసీయారే పూర్తి బాధ్యుడు…’’
  • ప్రజాదేవుళ్లు కదా కరుణించాల్సింది… వాళ్ల సేవ అవసరం కదా కేసీయార్..!!
  • వాట్ ఏ మ్యాచ్..! ఆశ్చర్యకరంగా గెలుపు… అదే మరి క్రికెట్ అంటే..!!
  • అసలే పార్టీలో ఈటల ఎదురీత… ఈలోపు కాళేశ్వరం రిపోర్ట్ షాక్…
  • కల్వకుంట్ల షర్మిలక్క..! పూర్తిగా దారితప్పిన బిడ్డ… ఫాఫం, కేసీఆర్..!!
  • ఆ పాటలో ఆమె చదువుతున్న ఆ పుస్తకం ఏమిటి..? 30 ఏళ్ల మిస్టరీ..!!
  • మరీ ఇది యండమూరి నవలా..? నిజమేమిటో తనే చెప్పాలిక…!!
  • కొత్త ఎఐ పంచాయితీ… కథలూ, క్లైమాక్సులూ మార్చేసి రీరిలీజులు…
  • కుకూ జాతిరత్నాలు… టీవీ సెలబ్రిటీలు సరదాగా రక్తికట్టిస్తున్నారు…
  • ఆ చెత్త మొహాల పారితోషికాల్ని కట్ చేయండి, వందల మంది బతుకుతారు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions