ఒక సినిమా గురించి చెప్పుకోవాలి… దాని పేరు ‘క’… మొన్న బిగ్‌బాస్ వేదికగా ప్రమోషన్లకు వచ్చినప్పుడు నాగార్జున అడిగాడు… క అంటే ఏమిటి…? దానికి కిరణ్ లాస్ట్ క్లైమాక్సులో తెలుస్తుంది సర్ అన్నాడు…
నిజమే… క అంటే కాంతారా ఏమో అనుకుంటాం చాలాసేపు… పోనీలే, కర్మ కావచ్చూ అనుకుంటాం కొద్దిసేపు… ఏమో హీరో పేరులో మొదటి అక్షరాన్ని పెట్టారేమో అనీ అనుకుంటాం… కానీ క అంటే ఏమిటో క్లైమాక్సులో నిజంగానే ఓ కాంతారాను చూపించారు దర్శక ద్వయం…
పలుచోట్ల కాంతారా కనిపిస్తుంది… తప్పు కాదు, తెలుగు సినిమాకు కొత్త జానర్లు, వైవిధ్యమై కథలు అవసరముంది… దిక్కుమాలిన సోకాల్డ్ దరిద్రపు స్టార్ హీరోల వెగటు ఎలివేషన్ల నుంచి అర్జెంటుగా తెలుగు సినిమాను విముక్తం చేయాల్సి ఉంది…
Ads
క సినిమా కథ ఆ దిశలో ఉన్నదే… నచ్చింది… చివరి 20 నిమిషాలు మనల్ని ఊపిరాడనివ్వకుండా చేస్తారు దర్శకులు… మిగతా సినిమా అంతా సోసో… కాంతారా కూడా అంతే కదా… చివరి 20 నిమిషాల క్లైమాక్సే ప్రాణం… దర్శకులు ఈ సినిమా కథను భూతకాలంలోకి, వర్తమానంలోకి, మాయల్లోకి, ఫాంటసీల్లోకి అలా అలా తీసుకెళ్తూ పోతారు…
కొందరు హీరోలు ఉంటారు… కిరణ్ అబ్బవరం లాంటోళ్లే… చిన్న హీరోలు… వైవిధ్యమైన కథలు… ఎలివేషన్లు పెద్దగా కోరుకోరు… కానీ తన సినిమాలు కొన్నాళ్లుగా ఫెయిల్యూర్స్… ఐతేనేం, వరుసగా సినిమాలు వస్తూనే ఉన్నాయి… గుడ్ ప్రోగ్రెస్… ఎంతోకొంత తన పాత్రలకు న్యాయం చేస్తూనే ఉంటాడు పాపం…
క సినిమా పాత్రలో ఇంకాస్త మెరుగయ్యాడు… మిగతా నటీనటుల గురించి పెద్దగా చెప్పడానికేమీ లేదు… దర్శకద్వయం రచన, క్లైమాక్స్ మీద శ్రద్ధ, హీరో యాక్షన్… అంతే… కానీ ఎటొచ్చీ చిరాకొచ్చేది హీరోకు సగటు తెలుగు స్టార్ తరహా పిచ్చి ఎలివేషన్… అది లేకుండా ఉంటే ఇంకా బాగుండేదేమో…
ఉత్తరాలు చదివి ఎమోషనల్‌గా ఫీలయ్యే ఓ చిత్రమైన కేరక్టర్… వేరే ఊరికి వెళ్తాడు… కంట్రాక్ట్ పోస్ట్ మ్యాన్ కొలువు… అదే ఉత్తరాలు చదివే అలవాటు… అనుకోకుండా ఆ ఉత్తరాల్లో హింట్స్ దొరుకుతూ ఉంటాయి… అవే తనను కూడా ఇబ్బందుల్లో పడేస్తాయి… వావ్, డిఫరెంట్ స్టోరీ…
కాకపోతే ఫస్టాఫ్ మొత్తం సాదాసీదాగా ఓ సగటు బిలో యావరేజ్ సినిమాలాగా కనిపిస్తుంది… క్లైమాక్సే సినిమాకు ప్రాణం… అన్నింటికీ మించి కొత్త దర్శకులు, కొత్త హీరోలు కొత్త కథలపై దృష్టి పెడుతున్నారు… కొత్త ప్రయోగాలు చేస్తున్నారు… తెలుగు సినిమాకు ఇదే అవసరం… కొన్ని లోటుపాట్లు ఉన్నా సరే అభినందనీయం…!
Share this Article