గత నెల మొదటివారంలో మనం ఓ వార్త చెప్పుకున్నాం… పోలీసుల వద్దకు వచ్చిన ఓ వింత కేసు… బెంగాల్‌లో బిర్‌భూమ్ (వీరభూమ్) అనే ఓ పల్లెటూరు… అక్కడ భుబన్ బద్యాకర్ (భువన్ వద్యాకర్) ఓ వీథివర్తకుడు… పచ్చి పల్లికాయ (వేరుశెనగ)ను హోల్‌సేల్‌గా కొనుక్కుని, ఊళ్లు తిరుగుతూ అమ్ముకుంటాడు… పాత సెల్‌ఫోన్లు, పక్కన పడేసిన గిల్టు పట్టీలు, జూకాలు గట్రా తీసుకుని కూడా పల్లీలు ఇచ్చేస్తుంటాడు… పల్లీలమ్మా పల్లీలు, పచ్చి పల్లీలు అని అరుస్తూ తిరగకుండా… రండి బాబూ రండి, వేయించలేదు, ఉడికించలేదు, సూకా మాల్ అని సగటు వీథివ్యాపారుల్లా గాకుండా… సొంతంగా ఓ పాట కట్టాడు, అంటే ఓ మంచి ట్యూన్ క్రియేట్ చేశాడు… ఆ టూన్‌తో పాడుతూ జనాన్ని పిలిచేవాడు… పాట రిథమ్ బాగుండి, ఎవరో సోషల్ మీడియాలో వీడియో పోస్ట్ చేశాడు… అది కాస్తా ఫుల్లు వైరల్ అయిపోయింది…
రౌడీ బేబీ, కొలవెరి పాటల్లా… ఎక్కడ చూసినా ఇదే పాట… ఇన్‌స్టా, యూట్యూబ్, ఫేస్‌బుక్, రీల్స్… మీమ్స్, రీమిక్సులు దుమ్మురేగిపోయాయ్… ఆ రిథమ్ అలా పట్టేసింది… ఈ పచ్చిపల్లీల పాట కొన్ని వీడియోలకు లక్షల వ్యూస్… హఠాత్తుగా భువన్ సెలబ్రిటీ అయిపోయాడు, కానీ హేపీగా లేడు… ఎవరెవరో ఇంటికొస్తారు, పాడమంటారు, రికార్డ్ చేస్తారు, వెళ్తారు, వాడికి మిలియన్లలో వ్యూస్, డబ్బు… భువన్‌కు టైమ్ వేస్ట్, ఎవడూ రూపాయి ఇవ్వడం లేదు… కొందరైతే ఈ పాట మీద పేటెంట్ మాదే అని ప్రయత్నలు… దాంతో దుబ్రాజ్‌పూర్ పోలీస్ స్టేషన్ వెళ్లి కేసు పెట్టేశాడు… ఆ వీడియోలన్నీ తీసేయించాలి, అందరి మీద చర్యలు తీసుకోవాలి అని ఆ కేసు… లోకల్ బీజేపీ, టీఎంసీ నేతలు ఎంటరయ్యారు… పోలీసులు ఏం చేస్తారు ఈ కేసులో… ఏమీలేదు… అందుకే ఏమీ జరగలేదు…
Ads
Godhuli Bela Music అనే మ్యూజిక్ కంపెనీ ఏం చేసిందంటే… భువన్‌కు ఓ కొత్త లుక్ తీసుకొచ్చింది… తన ఒరిజినల్ స్ట్రీట్ వెండర్ వేషం తీయించి, కొత్తరకం బట్టలు తొడిగింది, కళ్లద్దాలు పెట్టింది… కానీ భువన్ పెట్టుకునే ఆ నిలువునామాల బొట్టును అలాగే ఉంచేసింది… ఓ సినిమా కథలోలాగే ఓ కొత్త ట్రాన్స్‌ఫార్మేషన్… తన పాటను ర్యాప్ వెర్షన్‌లో రీమిక్స్ చేసింది.., (ర్యాప్ అంటే తెలుసు కదా…, మన మామూలు సంభాషణే రాగాలు తీస్తూ, ఓ రిథమ్ ప్రకారం పాడడం… చేతులు విచిత్రంగా ఊపుతుండాలి… బాడీ ఊగుతుండాలి…) ఓ అమ్మాయి ఆధునిక వస్త్రధారణతో కచ్చాబాదం భువన్ పక్కన గెంతులేసింది… నెల క్రితం సదరు కంపెనీ దీన్ని యూట్యూబ్‌లో రిలీజ్ చేసింది… భువన్‌కు ఎంతోకొంత ఆర్థికసాయం చేసింది… ఈ వీడియోకు ఇప్పుడు వ్యూస్ ఎన్నో తెలుసా..? 2.70 కోట్లు… నిజం… ఇంకా టాప్ ట్రెండింగ్‌లో నడుస్తోంది… అసలు సోషల్ మీడియాలో ఇప్పటికీ ఈ పాటదే రచ్చ… రీల్స్, ఇన్‌స్టా పోస్టుల్లో ఇదే హల్‌చల్…
https://www.youtube.com/watch?v=58CNG2IBnvw
అంతే… జనానికి ఏది, ఎప్పుడు, ఎందుకు నచ్చుతుందో ఎవరూ చెప్పలేరు… ఊ అంటావా, ఊఊ అంటావా పాటలో ఏమీ లేదు… మగాళ్లంతా పాపిష్టోళ్లు అనే తరహాలో నాలుగు పిచ్చిపదాల కూర్పు… ఐతేనేం, ఆ ట్యూన్ ఇరగ్గొట్టేసింది… ఇంద్రావతి టోన్, ఆ ట్యూన్, సమంత డ్యాన్స్… ఇంకేం, ఎక్కడికో వెళ్లిపోయింది పాట… ఈ సినిమా విడుదలైన ప్రతి భాషలోనూ ప్రజలు ఊ, ఊఊ అని ఊగిపోతున్నారు ఇప్పటికీ… యూట్యూబ్‌లో 10 కోట్లు దాటేసినట్టున్నయ్ వ్యూస్… కొన్నాళ్ల క్రితం సేమ్, బుల్లెట్ బండెక్కి వచ్చేత్తపా అనే పాట కూడా ఇంతే కదా… ఒకాయన మీమ్ రీమిక్స్ అని పాత వీడియోకే కొత్త కలర్ ఇచ్చి, ఫ్రెష్ రీమిక్స్ ఇదుగో అని విడుదల చేశాడు యూట్యూబ్‌లో… 1.20 కోట్ల వ్యూస్… అర్థమైందిగా అది కచ్చాబాదం, అంటే పచ్చి పల్లికాయ కాదు… హాట్ హాట్ మసాలా పల్లీ…!!
https://www.youtube.com/watch?v=pdIspwIv4yY
Share this Article