Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అదేమిటో గానీ… మారువేషంలో ఎన్టీయార్‌ను ఎవరూ గుర్తించరు, ప్రేక్షకులు తప్ప..!!

March 2, 2024 by M S R

Subramanyam Dogiparthi….   అగ్గి పిడుగు , చిక్కడు- దొరకడు , గోపాలుడు- భూపాలుడు , రాముడు- భీముడు , కదలడు- వదలడు అన్నీ ఆయనే . అయితే ఈ కదలడు వదలడు సినిమాలో ద్విపాత్రాభినయం లేదు . కావలసినన్ని మారు వేషాలు ఉన్నాయి . సినిమాలో వాళ్ళంతా పిచ్చోళ్ళు . మారువేషంలో ఉన్న NTR ని ఎవరూ గుర్తుపట్టలేరు . థియేటర్లో ఉన్న మనం చెపుతూనే ఉన్నా గ్రహించలేరు .

విఠలాచార్య దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పైన పేర్కొన్న సినిమాల్లాగా ఇరగతీయలేదని గుర్తు . NTR సినిమా కదా ! బాగానే ఆడింది . కమర్షియల్ గా సక్సెస్ అయింది . రొటీన్ కధే . ఓ రాజు , దుష్టచతుష్టయం , సాహసవంతుడయిన రాజకుమారుడు , ఓ బ్యూటీఫుల్ హీరోయిన్ , చివర్లో దుష్ట శిక్షణ చేసి , బ్యూటిఫుల్ హీరోయిన్ని పెళ్ళి చేసుకుని , సింహాసనం ఎక్కుతాడు NTR .

సాధారణంగా NTR – విఠలాచార్య సినిమాలో పాటలన్నీ లోనా బయటా హిట్టవుతాయి . టి వి రాజు సంగీత దర్శకత్వంలో కొన్ని పాటలే బాగా హిట్టయ్యాయి . బుల్లెమ్మా సౌఖ్యమేనా , కట్కో కట్కో గళ్ళ చీరె పెట్కో పెట్కో పెళ్ళి బొట్టు పాటలు హిట్టయ్యాయి . మిగిలిన పాటలు కూడా థియేటర్లో శ్రావ్యంగానే ఉంటాయి . As usual , జయలలిత ముద్దు ముద్దు మాటలు , NTR తో డాన్సులు బాగుంటాయి .

వీరిద్దరితో పాటు ముక్కామల , ధూళిపాళ , రామదాసు , సత్యనారాయణ , హేమలత , విజయలలిత , ఛాయాదేవి , మిక్కిలినేని , బాలకృష్ణ ప్రభృతులు నటించారు . మా నరసరావుపేటలో వెంకటేశ్వర పిక్చర్ పేలసులో చూసా . ఈ సినిమా కూడా రెండు సార్లు చూసా . కాలక్షేపం , వినోదం గ్యారంటీ . యూట్యూబులో ఉంది . చూడబులే .

#తెలుగుసినిమాలసింహావలోకనం #telugureels #తెలుగుసినిమాలు #TeluguCinemaNews #telugucinema

Share this Article

Ads



Advertisement

Search On Site

Latest Articles

  • సుహాసిని, విజయశాంతి ఓవర్ డోస్ ఎదుట అంతటి కుయిలీ వెలవెల..!!
  • అందరికీ కొత్త ఆధార్ కార్డులు..! అవసరం ఏమిటి..? ఎప్పటి నుంచి..?!
  • స్మృతి మంధానా పెళ్లికి ఈ విఘ్నాల వెనుక అసలు మర్మమేమిటో..!?
  • వందల కోట్లు కాదు… సినిమా పెద్ద తలలు చూడాల్సిన ఓ వండర్ ఇది…
  • అసలు ఏమిటీ చండీగఢ్ లొల్లి..? మోడీ ఏమైనా తప్పుచేశాడా..?
  • అయోధ్య..! గుడి నిర్మాణం సంపూర్ణం..! ధర్మధ్వజం విశేషం ఇదీ..!!
  • నాగార్జునా… ఈ కల్యాణ్ అనే రూడ్ కేరక్టర్‌ను బయటికి పంపించగలవా..?
  • హిడ్మా..! తెలంగాణలో రోజుకూలీగా అనామకంగా బతికాడా..? దేనికి..?!
  • ధర్మేంద్ర వందల కోట్ల ఆస్తులకు వాస్తవ హక్కుదారులు ఎవరు..?!
  • దైవశక్తులు Vs మంత్రశక్తులు… అందరిదీ ఇదే బాట… ఇదే జానర్…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions