.
ఒక ప్రత్యేక దేశం దిశలో నిత్యానంద స్వామి టీమ్ చేసే ఆలోచనలు, వేసే అడుగులు ఇంట్రస్టింగు… ఎహె, మా దేవుడినే మీ చట్టాల ద్వారా విచారిస్తారా అన్నట్టుగా జాగ్రత్తగా ప్లాన్ చేసి… ఎక్కడో అంతుపట్టని ఏ దీవినో కొనుగోలు చేసి, ముఖ్యమైన టీమ్ దేశం దాటిపోయిన సంగతి తెలిసిందే కదా…
అక్కడెక్కడో ఈక్వడార్ దగ్గర అన్నారు గానీ, నిజానికి తను ప్రకటించిన కైలాసం ఎక్కడో లోకానికి స్పష్టంగా తెలియదు… ఆ దేశ వ్యవహారాలను ఎవరెవరు ఎక్కడ ఉండి నడిపిస్తున్నారో కూడా తెలియదు… ఆమధ్య ఓ మహిళ కైలాస విహిత వస్త్రధారణతో ఏకంగా ఐక్యరాజ్యసమితి భేటీ ఒకదానికి (సమితి ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (CESCR) సమావేశం జెనీవాలో జరిగింది) హాజరై తమ వాదనలు వినిపించింది తెలుసు కదా…
Ads
తమ ఉనికిని చాటడానికి అలా చాలా ప్రయత్నాలు చేస్తూనే ఉంది ఆ టీమ్… ఇప్పుడు మరో ట్విస్టు… ఈ టీమ్ ఏం చేసిందంటే దక్షిణ అమెరికా దేశం బొలీవియా మీద పడింది… అక్కడి స్థానిక సమూహాల్ని ప్రలోభపెట్టి, నానారకాల ఎరలు వేసి విస్తారమైన భూభాగాన్ని ఏకంగా 1000 సంవత్సరాల లీజు ఒప్పందాల మీద సంతకాలు పెట్టించే ప్రయత్నాలు చేశారు… కొన్ని సమూహాలతో ఓమేరకు సక్సెసయ్యాయి…
ఓ శాశ్వత స్థావరాన్ని సృష్టించుకుని, స్థానిక సమూహాల సాయంతో తాము అనుకున్నట్టుగా ఓ ప్రత్యేక ప్రతిపత్తి గల దేశం నిర్మించాలని ప్లాన్… ప్చ్, కానీ ఫలించలేదు… బొలీవియా పోలీసులు దాన్ని బ్రేక్ చేశారు… ఆ ఒప్పందాలన్నీ రద్దు చేయబడ్డాయి… కైలాస దేశ ప్రతినిధులుగా చెప్పబడినవారిని వారి వారి ఒరిజినల్ దేశాలకు డిపోర్ట్ చేశారు…
యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస అనే ప్రతిపాదిత దేశంతో తమకు ఎలాంటి సంబంధాలు లేవు, మేమేమీ ప్రోత్సహించడం లేదు, ఏ దౌత్య సంబంధాలనూ మేం అంగీకరించడం లేదు అని బొలీవియా విదేశాంగ శాఖ ముఖ్యులు న్యూయార్క్ టైమ్స్ కు ఓ ప్రకటన రిలీజ్ చేశారు…
నిజానికి ఈ ఒప్పందాలకు ముందు కైలాస ప్రతినిధులు ఎలా మేనేజ్ చేశారో గానీ బొలీవియా అధ్యక్షుడు లూయీస్ ఆర్సేతో ఫోటో దిగారు… స్థానిక సమూహాలతో ఒప్పందాలపై సంతకాలు కూడా చేయించారు… ఎక్కడో తేడా కొట్టింది… బెడిసి కొట్టింది…
‘కైలాస ప్రతినిధులతో సంప్రదింపులు 2024 చివరలో ప్రారంభమయ్యాయి… కార్చిచ్చుల వంటి సందర్భాల్లో కైలాస ప్రతినిధులు సాయం చేశారు… తరువాత న్యూఢిల్లీకి మూడు రెట్లు పెద్దదైన ఓ భూభాగం లీజుకు ఒప్పందాలు కుదిరాయి… ఒక తెగ నాయకుడు బౌరే ఏటా 2 లక్షల డాలర్ల లీజుతో 25 ఏళ్ల ఒప్పందానికి అంగీకరించి సంతకం చేశాడు…
కానీ అదే బౌరే ఇప్పుడు ఎదురుతిరిగాడు… నో, నో, మేం వారి మాటల్ని విని మేం తప్పు చేశాం, వాళ్లు చెప్పేవన్నీ అబద్ధాలని ఇప్పుడు అర్థమవుతోంది అంటున్నాడు… 25 ఏళ్లు లీజు అన్నారు, 1000 ఏళ్లు అని రాశారని తన ఆరోపణ… సో, ఎవరెవరితో ఏం ఒప్పందాలు ఎంత కాలానికి, ఎంత భూమికి కుదిరాయో గానీ అన్నీ రద్దు చేయించింది బొలీవియా దేశం… మరో దేశం వైపు కైలాస టీమ్ దృష్టి సారిస్తుంది ఇక..!!
Share this Article