.
అనుకున్నదే… అనుకున్నట్టుగానే నిత్యానందుడు మరణించలేదనీ, చురుకుగా, ఆరోగ్యంగా… అంటే నిక్షేపంలా ఉన్నాడని తన సొంత దేశం కైలాసం ప్రభుత్వం ప్రకటించింది… అలా ప్రకటించకపోతేనే ఆశ్చర్యం కదా…
సరే, ఇక్కడి దర్యాప్తు సంస్థలు, ఇక్కడి న్యాయవ్యవస్థ, గతంలో వివాదాస్పద స్వాములకు పడిన శిక్షలు అన్నీ తెలిసినవాడు, తెలివైనవాడు కదా… హఠాత్తుగా ఇక్కడ మాయమై, ఎక్కడో ఏ ఈక్వెడార్‌లోనో తేలి, ఓ దేశమే ప్రకటించుకున్నాడు…
Ads
తన దేశం, తన జెండా, తన చట్టం, తన రాజ్యాంగం, తనే దేవుడు… డబ్బులకు ఎలాగూ కొదువ లేదు… కాకపోతే సాక్షాత్తూ తన మేనల్లుడు సుందరేశ్వరన్ స్వయంగా నిత్యానంద సజీవ సమాధి అయ్యాడని ప్రకటించడంతో వచ్చింది సమస్య…
రెండురోజులైనా సరే కైలాసదేశం గానీ, దాని వెబ్‌సైట్ గానీ ఖండించకపోవడంతో ఓ సందిగ్ధత ఏర్పడింది… నిత్యానంద వెంకటేశ్వర మూర్తి భావసమాధి దర్శనం పేరుతో శ్రీవారి వేషంలో సోషల్ మీడియాలో ఫోటోలు కనిపించి మరింతగా అస్పష్టతను పెంచాయి…
కేసుల నుంచి తప్పించుకునేందుకే ఈ కొత్త నాటకం ఆడుతున్నారనే విమర్శలు కూడా కనిపించాయి సోషల్ మీడియాలో… ఆల్రెడీ ఎగిరిపోయాడు, ఇంకా కొత్త నాటకాలు, ఈ కేసుల భయాలు ఎందుకు ఉంటాయి గానీ… ఈ వార్తలతోపాటు ఇక తన సహచరి రంజితవే ఆస్తులన్నీ అనే ప్రచారాలూ మొదలయ్యాయి…
నిజానికి తను ప్రాణత్యాగం చేసి, సజీవసమాధి అయ్యే పక్షంలో… ఎప్పట్నుంచో విపరీతంగా ఆ కైలాసదేశం హైప్ క్రియేట్ చేసేది… తనను మరో మహితాత్ముడిగా చిత్రించి, తన పట్ల భక్తుల్లో మరింత ఆదరణను పెంచే ప్రయత్నం చేసేది… అదేదీ జరగలేదు కాబట్టి సజీవ సమాధి జరగనట్టే కదా… ఎవరూ ఖండన ఇవ్వాల్సిన పని కూడా లేదు నిజానికి…
రంజితమే రంజితమే అనే పాట తరహాలో ఈ ప్రచారాలు పెరిగిపోవడంతో ఇక కైలాసదేశం ఈ సజీవ సమాధి వార్తల్ని ఖండించింది… తనకు దేశంలో పలు ప్రాంతాల్లో 41 ఆశ్రమాలున్నట్టు అంచనా… ఇప్పుడు వాటి సిట్యుయేషన్ ఏమిటో కూడా క్లారిటీ లేదు ఎవరికీ…
కేసులు బలంగా ఉండేందుకు తన మీద మనీ లాండరింగ్ ఎట్సెట్రా సెక్షన్లు కూడా గట్టిగా బనాయించారు పోలీసులు… ఈ స్థితిలో తను ఇండియాకు రాలేడు… కానీ మొత్తానికి తన నవ్వొచ్చే ప్రవచనాలు, ఆ వింత భాష, ఆ విచిత్ర ప్రసంగాల సరళి సేఫ్ అన్నమాట… థాంక్ గాడ్, ఇంకొన్నాళ్లు హాయిగా నవ్వుకోవచ్చన్నమాట… అదేకదా నిత్యానందం అంటే..!!
Share this Article