బిగ్ బాస్ నుంచి కాజల్ వెళ్ళిపోయింది… నిజానికి ఒక కోణంలో ఆలోచిస్తే ఆమె దాదాపు ఫైనల్ దాకా వచ్చినట్టే… కోల్పోయింది తక్కువే… మహా అయితే ఒక వారం పేమెంట్ పోగొట్టుకుంది అంతే… కాకపోతే సిరి వెళ్లిపోతే జనం బాగా ఆమోదించే వాళ్ళేమో… షన్నుని విన్నర్ గా చూడాలని ఉంది అంటూ ఆమే చెప్పాక, 24 గంటలూ కౌగిలించుకుని, ముద్దుల పెట్టుకుంటూ, దుప్పట్లో దూరుతూ వేషాలు వేస్తుంటే, మరి నువ్వెందుకు ఇక ఆటలో అనే ప్రశ్న తలెత్తింది… పైగా షన్నుతో వెకిలి వేషాలు కూడా ఆమెకు మైనస్ అయ్యాయి… ఐనా సరే, సిరికి కాజల్‌కన్నా ఎక్కువ వోట్లు రావడం ఆశ్చర్యమే…
కానీ ఆమెకు ఓటింగ్ బయటి నుంచి ఎవరో బలంగా ఆర్గనైజ్ చేస్తున్నారు… బహుశా షన్ను బ్యాచ్ కావొచ్చు… అసలు షన్నుయే ఈమధ్య బాగా మైనస్ అయిపోయాడు, బిగ్‌బాస్ టీం నుంచి ఫిక్సింగ్ ఉన్నట్టు ప్రచారం ఉన్నా సరే, మొన్నమొన్నటిదాకా ఎప్పుడూ మస్తు వోట్లు పడేవి, ఫస్ట్ ప్లేసులో ఉండేవాడు… ఏ టాస్కూ చేతగాక, ఎంతసేపూ సిరితో రొమాన్స్ తప్ప వేరే పనేమీ లేక, మాట్లాడే మాటల్లో లాజిక్ లేక, దమ్ము లేక జనానికి నచ్చలేదు… కానీ వోట్లు పడ్డట్టుగా కనిపించేది… అంతా మాయ… సేమ్, సిరికి కూడా…
నిజానికి కాజల్ మంచి స్ట్రాటజిస్టు… గేమ్ ప్లాన్ ముందే రూపొందించుకుని మరీ హౌజులోకి వచ్చింది… ఎవరితోనూ ఏ అనుబంధాలు పెట్టుకోలేదు, తనేమిటో, తన ఆటేమిటో… ఎవడూ శత్రువు కాదు, ఎవడూ మిత్రుడు కాదు… పక్కాగా ఆడుతూ వచ్చింది… ఫినాలేకు ముందు వారం దాకా హౌజులో ఉండటం అంటేనే ఓ సక్సెస్ ఆమెకు… ఇప్పుడు వెళ్లిపోతే ఆమె పెద్దగా నష్టపోయేది కూడా ఏమీ లేదు… కావల్సినంత పాపులారిటీ వచ్చింది, డబ్బు వచ్చింది, ఆఫ్టరాల్ టాప్ ఫైవ్‌లో చేరినా సరే అదనపు ఫాయిదా ఏమీ ఉండదు, ఒక వారం పేమెంట్ పోతేపోయింది… ఇలా స్థూలంగా కాజల్ సక్సెస్ ఫుల్ ప్లేయర్… ప్రత్యేకించి సిరి వంటి అడ్డగోలు ప్లేయర్‌తో పోలిస్తే చాలా బెటర్… సో, కాజల్ నిష్క్రమణ పట్ల నో రిగ్రెట్స్… బై బై కాజల్… ఇక సన్నీ నిలుస్తాడా..? షన్నూ నిలుస్తాడా అనే విషయంలో జనానికే పెద్ద ఆసక్తి లేదు… ఈసారి బిగ్‌బాస్ సీజన్ ఎప్పుడో ఇజ్జత్ కోల్పోయింది… ఎవరు గెలిస్తేనేం..?
Ads
Share this Article