.
లక్నవరంలో మరో ఐలాండ్ డెవలప్ చేశారు, గుడ్… మేడారం పరిసరాల్లో నైట్ క్యాంప్, ఎకో టూరిజం డెవలప్ చేస్తున్నారు, గుడ్, అడవులు, నేచర్ బేస్డ్ చాలా ఎఫర్ట్స్ చేయొచ్చు… వరంగల్ జిల్లాలోని బోలెడు వాటర్ ఫాల్స్ దగ్గరకు యాక్సెస్ పెరుగుతోంది, గుడ్… ఇంకా కాన్సంట్రేట్ చేయొచ్చు…
అద్భుతమైన శిల్ప విన్యాసానికి వేదిక రామప్ప గుడి దగ్గరకూ టూరిస్టులు పెరుగుతున్నారు, గుడ్… అక్కడ వసతులు కల్పించి, ఇంకా డెవలప్ చేయొచ్చు… బోలెడు టూరిస్ట్ స్పాట్స్ సరే… కానీ ఆ నగరం మాటేమిటి..?
Ads
కలకత్తాకు కాళీలాగే వరంగల్ జిల్లాకే ఇలవేల్పు భద్రకాళి… మొన్న వెళ్లినప్పుడు జాలేసింది… పూర్ మెయింటెనెన్స్… 20 ఏళ్ల క్రితంలాగే ఇప్పుడూ… యాదగిరిగుట్టకు 1500 కోట్లు పెట్టిన నాటి పాలకుడు ఫేమస్ ఇతర గుళ్లను గాలికి వదిలేశాడు…
అనేకానేక హుండీల పక్క నుంచే క్యూలో వెళ్తే… మహా చిరాకేసింది… అఫ్‌కోర్స్, చివరకు ఆ విగ్రహాన్ని దర్శించాక ఆ అసంతృప్తి మొత్తం దూరమైంది… అసలు ఎంత మంచి టెంపుల్ టూరిజం స్పాట్‌గా చేయొచ్చు దీన్ని… ప్రభుత్వానికి ఏ సోయీ లేదు…
కానీ కాకతీయ అర్బన్ డెవలప్‌మెంట్ వాడు భద్రకాళి రిజర్వాయర్ నడుమ ఏదో ఐలాండ్ డెవలప్ చేస్తాడట… నాన్సెన్స్… పూడికతీతకు చెరువు మొత్తం ఖాళీ చేశారు… విచిత్రంగా కనిపిస్తోంది అది… గుడి ఎంట్రన్స దగ్గరే సాయినాథుడి గుడి సపరేటుగా…
అసలే హిందూ గుళ్లల్లో సాయిబాబా విగ్రహాలేమిటి అనే వివాదం గుర్తొచ్చింది… గుళ్లో ఎటుచూసినా గందరగోళమే కనిపించింది… అమ్మవారి చీరెల అమ్మకం దగ్గరే కాస్త హడావుడి కనిపించింది…
వేయి స్థంభాల గుడి… ఏళ్ల కొద్దీ నాన్చీ నాన్చీ… ఆర్కియాలజీ విభాగం దాన్ని ఏరీతిలోనూ ఆకర్షణీయం చేయలేకపోయింది… దశాబ్దాల తరబడీ… పిల్లర్లు అన్నీ పీకేసి, నంబర్లు వేసి… చివరకు ఎలాగోలా అమర్చారు… ఆ నంబర్లు అలాగే ఉన్నాయి… కొత్త రాళ్ల స్లాబులు వేశారు కొన్ని… నంది వెనుక వైపు అర్థంతరంగా వదిలేశారు…
చినుకు చిటుక్కుమంటే మొత్తం చిత్తడే అక్కడ… నడవడమే కష్టంగా ఉంది… ఓ ప్రఖ్యాత, విశిష్ట వాస్తు నిర్మాణం విలువే తెలియదు మన టూరిజం శాఖకు… పోనీ, కేంద్రం చెప్పుచేతల్లోని ఆర్కియాలజీ విభాగానికి..!!
నిజానికి నా ఇంట్రస్టు కాలభైరవ గుడి… ఇదొకటి ఉందని వరంగల్ వాసులకే చాలామందికి తెలియదు… గోవిందరాజుల గుట్ట గుడి అది… వరంగల్ రైల్వే స్టేషన్‌కు కూతవేటు దూరం… పైన గోవిందరాజస్వామి గుడి… అది సరే, ఆ మెట్లు ఎక్కడం వృద్ధులకు వీలు కాదు… ఇలా స్టీప్ మెట్లు ఉంటాయి…
ప్రతి గుడికీ ఓ విశిష్ట ఆరాధన, అర్చన పద్ధతి ఉంటుంది… ప్రత్యేకించి దశమహావిద్యలు, గ్రామదేవతలు, కాలభైరవుల వంటి దేవుళ్లకు చేయాల్సిన పూజా పద్ధతి వేరు… కల్లు సాగపోయాలి, బలివ్వాలి… కొమురవెళ్లి మల్లిఖార్జున స్వామి అయితే మైలపోలు, పట్నాలు ఉంటాయి… సమ్మక్క- సారలమ్మకు బెల్లం మహాప్రీతి…
కానీ క్రమేపీ ప్రతి గుడినీ నవీన ఆగమశాస్త్రం ఆక్రమించి, సంప్రదాయ అర్చన పద్ధతులను దూరం చేస్తున్నారు దుర్మార్గంగా..! దేవాదాయ శాఖ నిర్వాకం గురించి చెప్పడానికి ఇక్కడ స్పేస్ సరిపోదు… కానీ వరంగల్ కాలబైరవ గుడిలో మాంస నైవేద్యం, మద్యం, సిగరెట్ల నైవేద్యం ఇంకా కొనసాగుతున్నాయని విని చూడాలనుకున్నాను… పక్కా వామాచార అర్చన విధానం…
వరంగల్‌లోనే ఎనిమిదిచోట్ల కాలభైరవుడు ఉంటాడు… కానీ భైరవీమాతతో కలిసి ఉన్న స్వయంభూ విగ్రహం గోవిందరాజుల గుట్ట గుడిలోనే…
కానీ డైల్యూట్ అయిపోయింది ఆ పూజావిధానం… జస్ట్, ఎవరైనా అడిగితే, నమ్మకంతో కావాలని వస్తే ఆ మద్యం హారతి మాత్రం ఇంకా కొనసాగుతోంది… ఎప్పుడైనా ఎవరైనా ఆసక్తి చూపిస్తే గుట్టుగా కోడినో, మేకనో బలివ్వడం… అంతే…
రాష్ట్రంలో పలుచోట్ల ఈరోజుకూ గ్రామదేవతల గుళ్ల దగ్గరకు వెళ్లే భక్తులు బలి ఇచ్చి, అక్కడే మద్యం, ఆ మాంసం తీర్థప్రసాదంలాగే స్వీకరిస్తారు… అది ఆయా గుళ్ల దగ్గర ఆనవాయితీ… నమ్మేవాడు నమ్ముతాడు, కానీ ఆయా సంప్రదాయ అర్చన పద్ధతుల్ని మార్చొద్దు, కలుషితం చేయొద్దు… కొనసాగించాలి…
ప్చ్, వరంగల్ జిల్లా టూరిజం వేరు… దాని డెవలప్‌మెంట్ ప్రణాళికలు వేరు… కొమురవెళ్లి, లక్నవరం, పాలకుర్తి టెంపుల్స్, రామప్ప, వాటర్ పాల్స్ ఇవన్నీ వేరు… వరంగల్ నగరం వేరు… ఇక్కడ ప్రభుత్వానికి ఏ ప్రణాళిక లేదు… సరైన ప్రణాళికతో టూరిజం డెవలప్‌మెంట్ చేయాలనే సోయి కూడా లేదు..!!
Share this Article