Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కాళేశ్వరం గంతలు… హరీష్‌రావు వృథా ప్రయాస..! ఇవీ నిజాలు..!!

August 19, 2025 by M S R

.

కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, అక్రమాలు, అరాచకం సబ్జెక్టు వేరు… సోకాల్డ్ అభినవ భగీరథుడు కేసీయార్ కట్టిన కాళేశ్వరం బరాజులు అక్షరాలా తెలంగాణ ప్రజల సొమ్మును గోదావరిలో నిమజ్జనం చేశాడనే నిజం వేరు… ఆ నిజాలు జనానికి తెలియకుండా హరీష్ రావు నానారకాలుగా తెలంగాణ జనం కళ్లకు గంతలు కడుతున్నానేదీ నిజం…

ఓసారి అంటాడు… మేం వెళ్లి కన్నెపల్లి మోటార్లు ఆన్ చేస్తాం అని… పైగా కేసీయార్‌తో కలిసి లక్షలాది మందితో వెళ్తారట… ఆయన ఫామ్ హౌజ్ జైలు కదలడు… రాడు… అసలు జనమే రారు, అలా వచ్చేపక్షంలో కరీంనగర్ బీసీ సభ పదే పదే ఎందుకు వాయిదా పడుతుంది…

అసలు కన్నెపల్లి బాహుబలి పంప్ హౌజు, మోటార్లు అన్నారు కదా… అసలు కట్టిన స్థలమే రాంగ్ అని తేలి, ఆమధ్య వరదల్లో మునిగి… ఈరోజుకూ మొత్తం మోటార్లను రిస్టోర్ చేయలేని దురవస్థ… జస్ట్, బికాజ్ కేసీయార్… హండ్రెడ్ పర్సెంట్… ఇప్పుడు ది గ్రేట్ హరీష్ రావు వెళ్లి కటకలు ఆన్ చేస్తామంటూ తెలంగాణ జనం దృష్టిని కాళేశ్వరం అక్రమాల నుంచి డైవర్ట్ చేసే టాక్టిక్స్…

Ads

ఆ పిలుపు అట్టర్ ఫ్లాప్ అయిపోయింది… తరువాత ఇప్పుడు తాజా పాట… ఎల్లంపల్లి నీటిని మిడ్ మానేరు వైపు తరలించేలా గాయత్రి, నందిమేడారం మోటార్లు ఆన్ చేస్తే… అన్నపూర్ణ, రంగనాయకసాగర్‌, మల్లన్నసాగర్‌, కొండపోచమ్మ సాగర్‌, బస్వాపూర్‌ రిజర్వాయర్లు అన్నీ నిండుతాయని, ప్రభుత్వం ఆన్ చేయకపోతే మేమే వేలాది మందితో వెళ్లి స్టార్ట్ చేస్తామని మరో పిలుపు…

అంటే..? ఎల్లంపల్లే ప్రధానం, మొత్తం పాత ప్రాణహిత- చేవెళ్ల బాపతు సాగునీటి నెట్‌వర్క్‌కు అదే ప్రాణం అని అంగీకరిస్తున్నట్టే కదా… స్థూలంగా చూస్తే అన్నారం, సుందిళ్ల, కుంగిన మేడిగడ్డ బరాజులు వృథాగా కట్టినట్టే కదా… హరీష్ చెబుతున్నది అదేనా పరోక్షంగా..! అంటే, కమీషన్ల కోసమేనా..?

ఈ విమర్శ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి లోపించింది… ఎస్, నిజం ఇదే… కాళేశ్వరంపై బీఆర్ఎస్ ప్రాపగాండాకు సరైన సబ్జెక్టుతో కౌంటర్ చేసే వాళ్లు లేకుండా పోయారు… ఎస్, నీటి మంత్రి ఉత్తమకుమార‌రెడ్డికి కూడా చేతకావడం లేదు…

కృష్ణాకు సంబంధించి శ్రీశైలం ఎలా రక్తం పంప్ చేసే గుండెకాయో… సేమ్, తెలంగాణ గోదావరి ప్రవాహానికి సంబంధించి ఎల్లంపల్లి అలా… మంచి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్… నీరు తక్కువైతే సప్లిమెంట్ చేయడానికి ప్రాణహిత నుంచి లింక్… అప్పట్లో వైఎస్ చేపట్టిన ప్రాజెక్టు పర్‌ఫెక్ట్… దాన్ని అడ్డదిడ్డపు ఆలోచనలతో మొత్తం భ్రష్టుపట్టించింది కేసీయార్… నిజం ఇదే…

గతంలో చూశాం కదా… బోలెడంత ఖర్చు పెట్టి మూడు బరాజుల నుంచి ఎల్లంపల్లికి నీటిని ఎత్తిపోసి, మళ్లీ వృథాగా సముద్రంలోకి వదిలేశాం… నాసిరకం నిర్మాణాల గురించి పక్కన పెడితే… అసలు ఆ బరాజుల ప్లానింగే లోపభూయిష్టం అని తేలిపోయింది…

కడెం, శ్రీరాంసాగర్, వరదకాలువ, మిడ్ మానేరు, ఎల్ఎండీ, కాకతీయ కాలువ… ఇవే కాదు… ఎల్లంపల్లి బేస్డ్ హైదరాబాద్ తాగునీటి లైన్, ఎన్టీపీసీకి వాటర్… అన్నీ ఎల్లంపల్లి చలువే… అది కాంగ్రెస్ కట్టింది… (శ్రీరాంసాగర్ పునరుజ్జీవ ప్రాజెక్టు తదితర కమీషన్ల ప్రాజెక్టుల చర్చ వేరు…)

నిజంగానే సాగునీటి సబ్జెక్టు సంక్లిష్టం… రాజకీయ నాయకులు అనగా హరీష్‌లు, కేసీయార్‌లు వాళ్లే ఇంజినీర్లు అయిపోయి, విశ్వేశ్వరరావులు అయిపోయి… ప్రాజెక్టులు డిజైన్ చేస్తే… ఘోష్ భాషలో అక్రమాలతో కడితే… ఇదుగో ఇలాగే ఉంటుంది… మూడు బరాజులు వేస్ట్… నీటిని నిల్వ చేస్తే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు… మేడిగడ్డ దుర్గతి చూశాం కదా…

ఇప్పుడూ అదే భాష, అదే ధోరణి… మేం వెళ్లి స్టార్టర్లు ఆన్ చేస్తాం… ఏ ప్రాజెక్టుకైనా నీటివిడుదలకు ఓ ప్రోటోకాల్ ఉంటుంది… ముందు తాగునీరు, తరువాత పవర్, ఇండస్ట్రీస్, అగ్రికల్చర్… అది చూసుకోవడానికి ఓ సిస్టం ఉంది… దానికి వదిలేయాలి… అలా వదిలేయకుండా సొంత నిరర్థక విజ్ఞానాన్ని ప్రదర్శిస్తే అదెలా ఉంటుంది… తస్కిన మేడిగడ్డ బరాజ్‌లాగా ఉండి వెక్కిరిస్తుంది…!!

అన్నట్టు… కాస్త ఉత్తర తెలంగాణలో వర్షపాతం తక్కువగా ఉండేది మొన్నటిదాకా… రీసెంటు వర్షాలతో అక్కడా వోకే… ఎస్ఆర్ఎస్‌పీ నిండిపోయింది… ఇతర గోదావరి రిజర్వాయర్లు, ప్రాజెక్టులు నిండుతున్నాయి… ఔట్‌ఫ్లో, ఇన్‌ఫ్లో వివరాలు ఆశలు రేకెత్తిస్తున్నాయి…

సో, ఈసారి వర్షాకాలం వ్యవసాయ విస్తీర్ణం సాధారణ స్థాయిని మించేట్టు, కొత్త రికార్డు క్రియేట్ కానున్నట్టు కనిపిస్తోంది... అన్నారం, సుందిళ్ల, మేడిగడ్డ ఏమీ పనికి రాకుండాపోయినా సరే...!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • అమెజాన్ అంటేనే అమేజింగ్..! వర్షాన్ని తనే రప్పించుకుంటుంది..!
  • కమర్షియల్ యాడ్స్‌పై రజినీకాంత్ ధోరణి ప్రశంసనీయమే..! కానీ..?
  • ఆధ్యాత్మికత + నృత్యాలు = కామాఖ్యలో దియోధని ఉత్సవాలు…
  • కాళేశ్వరం గంతలు… హరీష్‌రావు వృథా ప్రయాస..! ఇవీ నిజాలు..!!
  • …. కోటి రూపాయలకు ఓ కింగ్ ఫిషర్ విమానం కొని ఈ హోటల్ పెట్టాను
  • ఈరోజు నచ్చిన వార్త… అర్ధరాత్రివేళ మన వ్యోమవీరుడికి ఘనస్వాగతం…
  • నేల మీదే నడుద్దాం… పడే ప్రమాదముండదు… ఓ డైరెక్టర్ విలువైన మాట…
  • భగవాన్ శ్రీరాం సర్..! విశ్వాసులకు దేవుడే… అంతగా ప్రభావితం చేస్తారు..!!
  • పూప్ సూట్‌కేస్..! పుతిన్ పర్యటనల్లో కనిపించే ఈ భద్రత కథేమిటి..?!
  • మంచి సోర్స్, గైడ్, అప్‌‌డేషన్, క్రాస్‌చెక్… ఆ బ్యూరో చీఫ్‌ల రోజులే వేరు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions