Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

జస్ట్, కాస్త ఇసుక కొట్టుకుపోయి పిల్లర్లు కుంగాయట… వీళ్లు మన ఇంజినీర్లు..!!

October 26, 2023 by M S R

మేడిగడ్డ బరాజ్‌లోని ఏడో బ్లాకు పిల్లర్లన్నీ మార్చాల్సిందే, కాఫర్ డ్యామ్ తప్పదు… ఒక వార్త

పిల్లర్లలో నిలువు పగుళ్లు రావడం ఏమిటో కేంద్ర బృందానికీ అర్థం గాక విస్తుపోయారు… మరో వార్త

ఇదే కాదు, మొత్తం ప్రాజెక్టుల సేఫ్టీ, క్వాలిటీపై టెక్నికల్ దర్యాప్తు అవసరం… ఇంకో వార్త

Ads

మొత్తం కాలేశ్వరం ప్రాజెక్టు  డిజైన్, ఖర్చు, క్వాలిటీలపై సమగ్ర శోధన కావాలి… ఇదో వార్త

.

ఇలాంటి వార్తలెన్నో తెలంగాణ సమాజాన్ని షాక్‌కు గురిచేస్తుంటే… మొదట ప్రభుత్వ వర్గాలు కుట్ర కోణం మీదకు జనం దృష్టిని మళ్లించే విఫల ప్రయత్నం చేశాయి… చివరకు ఎస్పీ సైతం కుట్ర కోనం కేసు నమోదును సమర్థించుకున్నాడు… జస్ట్, అరగంటలో ప్లేటు తిప్పాడు… ఇంకోవైపు గుత్తా సుఖేందర్‌రెడ్డి అబ్బే, జస్ట్, టెక్నికల్ సమస్యలు, ఇవన్నీ సహజం అంటూ ఓ విచిత్ర వ్యాఖ్య చేశాడు… అవును, టెక్నికల్‌గానే పంపు హౌజులు మునుగుతాయి, బరాజులు కుంగిపోతాయి…

మేడిగడ్డ

సరే, వాళ్లెవరో ఏదో చెబుతారు… కీలక స్థానంలో ఉన్న ఇంజినీర్ ఇన్ చీఫ్ ‘కుట్ర కోణం ఏమీలేదు, జస్ట్, పిల్లర్ల కింద ఇసుక కదిలింది, అంతే… పెద్ద ప్రాబ్లమేమీ కాదు’ అంటున్నాడు… ఎంత బాధ్యతారాహిత్యం..? వీళ్లూ మన అభినవ విశ్వేశ్వరరావులు…!! నదుల్లో ఇసుక గాకుండా రాక్ ఫార్మేషన్లు ఉంటాయా..? నదులపై ఆనకట్టలు ఇసుకను తవ్వి, లోతుగా పిల్లర్లు వేయకుండా ఇసుకపైనే కట్టేస్తారా..? ఈయన ఒక చీఫ్ ఇంజినీర్ అట… తెలంగాణ ప్రజల ఖర్మ గాలి…!!

మేడిగడ్డ

ఈ పిల్లర్ల కింద బొగ్గు నిల్వలు ఉన్నాయని, కేసీయార్‌కు ఈ విషయం చెబితే ఆ సిబ్బందిని మార్చిపారేసి, అందరి కళ్లుగప్పి బరాజ్ కట్టించాడని ఒకాయన వీడియో వార్త పెట్టాడు… నిజంగానే నిలువు పగుళ్లు ఓ పెద్ద మిస్టరీ… ఒకవేళ నిజంగానే పిల్లర్ల కింద పునాదులు సరిగ్గా లేకపోతే పిల్లర్లు కుంగిపోవాలి గానీ పగుళ్లు రావడం ఏమిటి..? ఎల్ అండ్ టీ వాడు రిపేర్లు చేసిస్తాడు సరే, మరి ఈ నాసిరకం డిజైన్లు, పనులకు శిక్ష ఏమిటి..? అంతా గందరగోళం…

మేడిగడ్డ

నిన్న బోలెడు సోషల్ జోకులు… దీని వెనుక కూడా ఏదో ప్రేమ యవ్వారం ఉండే ఉంటుందని, ఎవరో మరో శివరామ్ (ప్రవల్లిక ఆత్మహత్య కేసులో నిందితుడిని చేశారు కదా పోలీసులు) ను పట్టుకొచ్చి, పిల్లర్లను కుంగించింది ఇతనే అని పోలీసులు చెబుతారని ఆ జోకుల సారాంశం… బీజేపీ కిషన్‌రెడ్డి ఇప్పుడు కాలేశ్వరం ఓ దిక్కుమాలిన ప్రాజెక్టు అంటున్నాడు… ఈ వైఫల్యానికీ, ఈ ప్రమాదానికీ, ఈ అక్రమానికీ బీజేపీ ప్రభుత్వం కూడా బాధ్యత వహించాలి కదా…

మేడిగడ్డ

అప్పట్లో కాలేశ్వరం కేసీయార్‌కు ఏటీఎం అన్నదీ బీజేపీయే… తరువాత నోరు మూసుకున్నదీ బీజేపీయే… అంతర్రాష్ట్ర ప్రాజెక్టుపై లక్ష కోట్ల మెగా ప్రాజెక్టు కడుతుంటే తన కేంద్ర సంస్థలతో నిఘా, పరిశీలన పట్టించుకోకుండా అన్నీ మూసుకుని కూర్చుని, ఇప్పుడు ప్రాజెక్టును తిట్టడం ఏమిటి..? గతంలో సాగునీటి మంత్రిగా పనిచేసి, సబ్జెక్టు నాలెడ్జి కూడా ఉండి, గతంలో బోలెడు విశ్లేషణలు వెలువరించిన పొన్నాల లక్ష్మయ్య మాట్లాడతాడు అనుకుంటే తనూ ఆ క్యాంపులోనే చేరిపోయాడు…

కాంగ్రెస్‌లో సాధికారంగా మాట్లాడేవాళ్లు లేరు… రిటైర్డ్ ఇంజినీర్లు మాట్లాడరు… పెద్ద సారుకు కోపం వస్తుందని మెయిన్ స్ట్రీమ్ మీడియా హైలైట్ చేయదు… గతంలో దీన్ని తిప్పపోతల అని వర్ణించిన తెజాస కూడా ఎక్కడా మాట్లాడినట్టు కనిపించలేదు… మరోవైపు తెలంగాణది చైతన్య సమాజం అని మనమే భుజాలు చరుచుకుంటాం… గొప్పలు చెప్పుకుంటాం… గోదావరిపై బ్యారేజీలు కట్టడమే తప్పా అంటున్నాడు చీఫ్ ఇంజనీర్ మురళీధర్… ఎస్, ఇలా కట్టడం తప్పేనయ్యా సారూ… కడితే నాలుగు కాలాలపాటు నిలబడేలా కట్టాలి… ఇలా ఇసుకగూళ్లు కాదు…!! అన్నట్టు, కేంద్ర బృందం ఏవో నిజాల్ని చెబుతుందని అనుకోవడం వృథా… కేసీయార్‌పై ఈగ వాలనివ్వదు బీజేపీ హైకమాండ్…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వారసత్వమంటే బీజేపీకి పడదట… కానీ టీ-స్టేట్ కమిటీలో ఆరుగురు వాళ్లే..!!
  • కేసీయార్ స్కామ్స్ చూసీచూడనట్లు వదిలేయాలా… ఎందుకు..?!
  • నేపాల్ తాత్కాలిక ప్రధానిగా ఈ పచ్చి భారత వ్యతిరేకి పేరు వాపస్…
  • బరేలీ మార్కెట్‌లో పడిపోయిన ‘చెవికమ్మ’ దొరికింది… ఇదుగో ఇదే…
  • అప్పట్లో మహాబాహుబలి… ఆరుగురు ఎంపీలు… ఇద్దరు మంత్రులు, ఓ ఎమ్మెల్యే…
  • పెద్ద దొరవారి ధరణి..! నిఖిల జగమూ నివ్వెరపోయే భారీ భూస్కాం..!!
  • 2 రోజుల్లో నలుగురు ప్రధానులు ఔట్… ఈసారి గ్రహణ బాధితుడు ఎవరు..?
  • శుభమాని ఇల్లు కొనాలంటే… ఈ బ్లూప్రింట్లు తగలేసే గోల ఏమిట్రా…
  • ఓరాకిల్ కాదు, మిరాకిల్..! ఒకే రోజులో 7.3 లక్షల కోట్లు పెరిగిన సంపద..!
  • నటన తెలియనివాళ్ల నుంచీ నటన పిండుకోవడం ఎలాగంటే..?

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions