ప్రభాస్ కల్కి బాక్సాఫీసు కలెక్షన్లను పరిశీలిస్తే ఓ ఆశ్చర్యకరమైన పాయింట్ కనిపించింది… సరే, మీడియాలో వచ్చే కలెక్షన్ల వివరాలన్నీ కరెక్టేనా, సినిమాకు పెట్టిన ఖర్చు, వచ్చే రెవిన్యూ వివరాలపై మీడియా ప్రకటనల్లో నిజమెంత అనే డిబేట్ ఎలాగూ ఉన్నదే… కాకపోతే సాక్‌నిల్క్ వంటి సైట్ల వివరాలను గనుక ప్రామాణికంగా తీసుకుని పరిశీలిస్తే…
కల్కి సినిమాకు ఇప్పటివరకు 846 కోట్ల కలెక్షన్లున్నాయి… ముందు నుంచీ అనుకున్నట్టే హిందీలో బ్లాక్ బస్టర్… 224 కోట్లు… హిందీ హీరోలకు దీటుగా ప్రభాస్ వసూళ్లు సాగిస్తున్నాడు… మొన్నటి వీకెండ్స్‌లో 18, 22 కోట్ల వసూళ్లు అంటే చిన్న విషయమేమీ కాదు… అమితాబ్, దీపిక పడుకోన్ హిందీ రన్‌కు బాగా ఉపయోగపడుతున్నట్టే… పైగా మైథాలజీతో కథను లింక్ చేయడం నార్తరన్ ఆడియెన్స్‌కు నచ్చినట్టుంది… ట్రెండ్ అదే కదా…
తెలుగులో కూడా బ్లాక్ బస్టర్… 250 కోట్లు… మొన్నటి వీకెండ్స్‌లో 11, 16 కోట్ల వసూళ్లు… కాకపోతే నైజాంలో గ్రేట్ కలెక్షన్లు, కానీ ఆంధ్రాలో కొన్నిచోట్ల ఇంకా బిజినెస్ జరిగిన అంకెలకు వసూళ్లు చేరుకోలేదనీ వార్తలు… ఓవరాల్‌గా ప్రభాస్ సినిమా కాబట్టి తెలుగు రాష్ట్రాల్లో ఆ ప్రభావం వసూళ్ల మీద బాగానే ఉంటుంది… ఉంది…
Ads
ఓవర్సీస్‌లో కూడా బ్లాక్ బస్టర్… 227 కోట్లు… ఇంకా నడుస్తూనే ఉంది బాగానే… సోషల్ మీడియాలో చాలామంది నెగెటివ్ రివ్యూలు రాస్తున్నా సరే అమెరికాలోని ఇండియన్ సినిమా ప్రియులకు కల్కి సినిమా బాగానే కనెక్టయింది… బహుశా హాలీవుడ్ టైప్ టేకింగ్ కారణం కావచ్చు, మహాభారతంలోని పాత్రలతో లింకు పెట్టడం కూడా నచ్చి ఉండవచ్చు…
నిజానికి తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో కల్కికి పెద్దగా వసూళ్లు ఉండకపోవచ్చునని అంచనా వేస్తున్నదే… మలయాళ మార్కెట్ చిన్నది… తమిళులేమో వాళ్ల సినిమాల్ని తప్ప వేరేవాళ్ల సినిమాల్ని ఇష్టపడరు, రానివ్వరు… అందుకే అడ్వాన్స్ బుకింగుల్లోనూ ఆ రెండు రాష్ట్రాల్లో స్పందన పూర్… కానీ పర్లేదు, రెగ్యులర్ రన్‌లో మరీ తీసికట్టుగా ఏమీలేవు వసూళ్లు… తమిళంలో 31 కోట్లు… మలయాళంలో 19 కోట్లు…
ఎటొచ్చీ కర్నాటకలో తేడా కొట్టేసింది… ఇది అంచనా వేయలేదు… తమిళ, మలయాళ వసూళ్లతో పోలిస్తే కన్నడ వెర్షన్ వసూళ్లు చాలా పూర్… జస్ట్, 4 కోట్లు… మరీ 12, 13 రోజుల్లో కలెక్షన్స్ 15, 10 లక్షలు… అంతే… దీంతో ఓ చర్చ… అమితాబ్, దీపికతో హిందీ బెల్ట్, కమల్‌హాసన్ కారణంగా తమిళనాడు, అన్నా బెన్‌తో కేరళ ఏరియాల్లో వర్కవుట్ అయ్యిందీ అనుకుందాం…
పేరున్న ఏ కన్నడ నటీనటుల్ని తీసుకోని కారణంగానే కన్నడ ప్రజలు కల్కిని ఓన్ చేసుకోలేదా..? బేసిక్‌గా సినిమాలో తారాగణానికీ, ఏరియాల వారీగా వసూళ్లకు పెద్దగా సంబంధం ఉంటుందా అనేది పెద్ద డిబేటబుల్ ప్రశ్నే… మరి ఈ లెక్కన మంచు కన్నప్పకు కూడా పలు భాషల స్టార్ తారాగణం మంచి వసూళ్లను సాధించాలి, వేచి చూడాల్సిందే..!
Share this Article