అవును. సింపుల్‌గా చెప్పాలంటే బ్లాస్ట్… ఇండస్ట్రీ ఎదురుచూస్తున్న ఓ సూపర్ హిట్ భారీ సినిమాను నాగ్ అశ్విన్ ప్రజెంట్ చేశాడు… మైథాలజీ, టెక్నాలజీని మిక్స్ చేసి… భూత, వర్తమాన, భవిష్యత్తు కాలాల్ని మిక్స్ చేసి… యాక్షన్, ఎమోషన్ మిక్స్ చేసి… మహానటిలోలాగే అనేకమంది ప్రముఖుల్ని తీసుకొచ్చి…
అందుబాటులోని అత్యున్నత టెక్నాలజీని పట్టుకుని… ఓ విజువల్ ఫీస్ట్‌గా రూపొందించాడు … ఇది అచ్చంగా నాగ్ అశ్విన్ సినిమా… ఫస్ట్ పార్టు మొత్తం అమితాబ్‌దే హవా… చాలాసేపటి తరువాత ప్రభాస్ వచ్చాడు… తన కేరక్టరైజేషన్ కూడా బాగుంది… కానీ ఓవరాల్‌గా అమితాబ్ అదరగొట్టాడు… ఒక్క ముక్కలో చెప్పాలంటే రాబోయే కల్కిని కాపాడే అశ్వత్థామ పాత్రలో అమితాబే ఈ ఫస్ట్ పార్ట్ హీరో…
పుష్ప సినిమాలోలా ఫహాద్‌లాగా కమలహాసన్ చాలా తక్కువసేపు కనిపించాడు… కాకపోతే సెకండాఫ్‌లో మెయిన్ విలన్ అవుతాడేమో… పుష్ప-2లోలాగా..! ప్రభాస్, దీపిక మెప్పించారు… ఆడియెన్స్ భలే ఎంజాయ్ చేశారు.,. యాక్షన్ సీన్లు బాగా కుదిరాయి… మహాభారతాన్ని టచ్ చేయడం అమెరికా జనానికి బాగా పట్టింది… VFX కూడా ఎక్కడపడితే అక్కడ గాకుండా, అవసరమున్నచోట, అవసరమున్నంతమేరకే వాడుకున్నారు… బుజ్జికి కీర్తిసురేష్ వాయిస్ ఓవర్ పర్లేదు…
Ads
రాజేంద్రప్రసాద్, శోభన, మాళవిక నాయర్ ఉన్నారు… సరే, నాగ్ అశ్విన్ సినిమాలో సెంటిమెంట్ ప్రకారమైనా మాళవిక ఉండాల్సిందే కదా… వీళ్లు గాకుండా ఆర్జీవీ, మృణాళ్, విజయ్ దేవరకొండ, దుల్కర్, రాజమౌళి కూడా ఉన్నారు ఇందులో… దిశా పటాని కాసేపు కనిపించింది… అన్నా బెన్ బాగుంది… డైరెక్టర్ అనుదీప్, అవసరాల శ్రీనివాస్ కొన్ని సెకండ్లు కనిపించారు… బ్రహ్మానందం ఉన్నాడంటే ఉన్నాడు… కొన్నాళ్లుగా ఇండియన్ సినిమా ట్రెండ్ మైథాలజీతో మిక్సయిన అంశాలు కదా… కార్తికేయ తరహాలో…
కల్కి సినిమా దాన్ని మరో రేంజుకు తీసుకుపోబోతోంది… ఇండస్ట్రీ ఆశిస్తున్నట్టు ఈ సినిమా థియేటర్లకు మళ్లీ జనాన్ని రప్పించబోతోంది… నార్తరన్‌లో బాగా హిట్టయ్యే సూచనలు కనిపిస్తున్నాయి… అసలే అక్కడ సరైన సినిమాలు రాక థియేటర్లు ఖాళీగా బోసిపోయి కనిపిస్తున్నాయి కదా… పైగా అమితాబ్ కొత్తకొత్తగా కనిపిస్తున్నాడు…
దుష్ప్రచారాలు, నెగెటివ్ రివ్యూలు, ట్రోలింగులు దయచేసి వద్దు… వందల కోట్లతో నాలుగేళ్లు కష్టపడ్డాం, ఆర్టిస్టులకు గౌరవం ఇవ్వండి ప్లీజ్ అంటూ వైజయంతి మూవీస్ వాళ్లు రిక్వెస్ట్ చేశారుగా… ఇప్పుడు ఆ అవసరం ఇక లేదు… సినిమాలో నెగెటివ్‌గా రాయడానికి పెద్దగా పాయింట్లేవీ లేవు… మైథాలజీకి ఫిక్షన్ కలిపితే ఎలా ఉంటుంది..? అది చేసి చూపించాడు నాగ్ అశ్విన్… ఎస్, రాజమౌళి ఒక్కడే కాదు… విజయపతాక ఎగరేయడానికి తెలుగు సినిమాకు నాగ్ అశ్విన్ కూడా దొరికాడు..!
ఇదంతా అమెరికా ప్రేక్షకుల నుంచి వస్తున్న నిష్పాక్షిక సమీక్షల సారాంశం… మైనసులే లేవా అంటారా..? ఉన్నయ్… కొన్ని తరువాత చెప్పుకుందాం… యంగ్ అమితాబ్‌ను చూపించడానికి కొచ్చాడియాన్, ఆదిపురుష్‌లలో వాడుకున్న టెక్నాలజీనే ఉపయోగించారు… కానీ సరిగ్గా కుదరలేదు, కాస్త ఎబ్బెట్టుగా ఉంది… కాకపోతే అలా కాసేపే కనిపిస్తాడు…
ఈ సినిమాకు ప్రధానంగా మైనస్ ఏమిటంటే..? కొన్నాళ్లుగా విపరీతమైన హైప్ వచ్చి పడింది… ఓవర్ ఎక్స్‌పెక్టేషన్స్‌తో వెళ్తాడు ప్రేక్షకుడు… ఇదేమో హాలీవుడ్ తరహా మేకింగ్… మనకేమో కుర్చీలు మడతబెట్టే పాటలు, కథలు కావాలి… ఓవర్ హీరోయిజం కావాలి… వీలయితే ఓ ఊఅంటావా మావా పాట పడాలి… లేదంటే అచ్చంగా ఏదైనా మలయాళ ప్రయోగం కావాలి… ఇదేమో డిఫరెంట్ స్టయిల్… కొందరికి అస్సలు నచ్చకపోవచ్చు… పైగా సెకండ్ పార్ట్ ఉంది కాబట్టి ఫస్ట్ పార్ట్ అర్థరహితంగా ఎండ్ అవుతుంది…
మహానటి అనుభవంతో గెస్ట్ సెలబ్రిటీలను అలా అలా కాసేపు చూపిస్తాడు దర్శకుడు కానీ అదంత ఇంపాక్ట్‌ఫుల్‌గా లేదు… ఏదో అది స్టార్ అట్రాక్షన్ తప్ప, వాళ్లు కనిపించగానే సగటు ప్రేక్షకులు ఈలలు వేయడానికి తప్ప అంతిమంగా సినిమాకు ఉపయోగం ఏమీ లేదు అందులో… 22 భాషల్లో తీశారు కదా… మనకు మాత్రం తెలుగు సినిమా చూస్తున్నట్టే ఉంటుంది… అందులో అమితాబ్ హీరోగా చేసినట్టు..!!
Share this Article