Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

సేమ స్టోరీ… సేమ్ ప్రచారం… సేమ్, అప్పట్లో శ్రీదేవి… ఇప్పుడు దీపిక…

September 19, 2025 by M S R

.

సేమ్… సేమ్ అదే కథ… అప్పట్లో శివగామి పాత్రలో శ్రీదేవిని తీసుకోవాలని అనుకుని, తరువాత రమ్యకృష్ణను తీసుకుని… ఏయే సాకులతో శ్రీదేవిని దర్శకుడు రాజమౌళి, నిర్మాత శోెభు బదనాం చేశారో… అచ్చు అలాంటివే కారణాలు ఇప్పుడు దీపిక పడుకోన్ మీద కల్కి నిర్మాతలు చెబుతున్నారు… సీన్ రిపీట్…

పారితోషికం ఎక్కువ అడిగింది… వర్కింగ్ టైమ్ షెడ్యూల్ తనకు అనుకూలంగా అడ్జస్ట్ చేయాలంది… తనతో వచ్చే టీమ్‌కు సకల స్టార్ సౌకర్యాలు డిమాండ్ చేసింది… ఇవే కదా అప్పుడూ ఇప్పుడూ ప్రధాన కారణాలు… దీపికను వదులుకున్న స్పిరిట్ టీమ్ కూడా అదే కదా చెప్పేది…

Ads

బాలీవుడ్ సర్కిళ్లలో ఉన్న ప్రచారం ప్రకారం… కల్కి-2 సీక్వెల్ కోసం ఫస్ట్ పార్ట్ పారితోషికంకన్నా ఎక్కువ అడిగిందట… అది 20, 25, 30 కోట్లు అని ఎవరిష్టానుసారం వాళ్లు అంకె చెబుతున్నారు… ప్రతిరోజు కేవలం 7 గంటలు మాత్రమే సెట్లో ఉంటానని పట్టుబడుతోందట… ఈ సినిమా భారీ స్థాయిలో VFX ఆధారితం కాబట్టి షూటింగ్ సమయాన్ని తగ్గించడం బడ్జెట్‌ను పెంచే అవకాశం ఉందని నిర్మాతలు ఆమెకు చెప్పారట…

కానీ ఆమె దానికి ఒప్పుకోలేదట… షూటింగ్ లేటయితే ఆమెకు విశ్రాంతి కోసం అతి ఖరీదైన వానిటీ వాన్ సమకూరుస్తామని నిర్మాతలు ప్రతిపాదించినా దీపిక అంగీకరించలేదట… ‘ప్రభాస్ వంటి పెద్ద నటుడు కూడా సీక్వెల్ కోసం తన పారితోషికం పెంచమని అడగలేదు… ఈమె ఎక్కువ అడుగుతోంద’ని నిర్మాతలు అభిప్రాయపడుతున్నారట…

తన పిల్లలతో గడపడానికి వీలుగా తనకు అనుకూలంగా షెడ్యూల్స్ ప్లాన్ చేయాలని కూడా అప్పట్లో శ్రీదేవి అడిగిందట… ఇప్పుడు దీపిక కూడా తన బిడ్డతో గడపడానికి గాను ఎక్కువ టైమ్ షూటింగ్ చేయలేనని అంటోంది… తన పారితోషికం కూడా 6 కోట్లో, 7 కోట్లో డిమాండ్ చేసిందట అప్పట్లో శ్రీదేవి…

అన్నింటికన్నా ముఖ్యమైంది… శ్రీదేవి అప్పట్లో హోటల్‌లో ఒక ఫ్లోర్ మొత్తం తన వ్యక్తిగత సిబ్బందికి కావాలని అడిగిందని రాజమౌళి ఆరోపించాడు కదా… దీపికపై కల్కి టీమ్ ప్రచారం కూడా ఇదే… తన టీం 25 మందికి ఫైవ్ స్టార్ హోటల్ వసతి, భోజన ఖర్చులు ప్లస్ రవాణా, ఇతరత్రా ఖర్చులన్నీ నిర్మాతే భరించాలని దీపిక పట్టుబడుతోందనీ, ఆ ఖర్చు తడిసి మోపెడవుతుందనీ కల్కి టీమ్ మీడియాకు లీకులు ఇస్తోంది…

సేమ్, స్పిరిట్ టీమ్ కూడా ఈ కోరికల్ని అంగీకరించలేక, ఆమెను వదిలేసిందని బాలీవుడ్ ప్రచారం… ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్, దీపిక ఫ్యాన్స్ పోస్టులతో ఘర్షిస్తున్నారు… నిజానికి దీపిక యవ్వారంతో ప్రభాస్‌కు సంబంధం లేదు… కల్కి నిర్మాతలకూ దీపికకూ నడుమ వివాదం, అంతే… ప్రభాస్ ఫ్యాన్స్ ఎంటర్ కావడం అనవసరం…

ఒక సినిమాలో నటించాలా వద్దానేది ఆమె ఇష్టం… సీక్వెల్‌లో కూడా అదే పారితోషికంతో తప్పకుండా నటించేలా ఆమెతో అగ్రిమెంట్ ఏమీ లేనట్టుంది.,. లేకపోతే, చూడబోతే కల్కి నిర్మాతలు కోర్టుకు లాగేవారు ఆమెను…

సోషల్ మీడియాలో దీపికను సమర్థించేవాళ్లు కొందరు… వ్యతిరేకించేవాళ్లు కొందరు… సంవాదాలు సాగుతున్నాయి… కల్కి టీమ్ ఆమె కమిట్మెంట్ (తప్పు అర్థంలో కాదు) లేని నటి అంటోంది… ఆమె కడుపుతో ఉండీ కల్కి ఫస్ట్ పార్టులో నటించలేదా అనేవాళ్లు కొందరు… మరీ ఆమె అంతలేసి డిమాండ్లు చేస్తుంటే మన తెలుగు సినిమా టీమ్స్ నిర్మొహమాటంగా ఆమెను వదిలేసి మంచి పనిచేశాయి అనేవాళ్లు కొందరు…

ఎటొచ్చీ, కల్కి సీక్వెల్‌లో కల్కిని ప్రసవించే ఆ తల్లి ఎవరో, దీపిక స్థానంలో ఆమె ఫిట్టవుతుందా..? ప్రేక్షకులకు ఈ మార్పు జీర్ణం అవుతుందా..? సరే, అదంతా వేరే కథ…

ఓ మిత్రుడు సోషల్ మీడియాలో ఓ పోస్టులో ఏమంటాడంటే..? ‘‘ఇలా ఒక హీరో గనుక ఏదైనా ప్రాజెక్టు నుంచి తప్పుకుంటే, ఇలా ఏవేవో ప్రచారాలతో బదనాం చేయగలరా..? కూలీ ఫ్లాప్‌తో ఆమీర్‌ఖాన్ సీక్వెల్‌లో నటించను పొమ్మన్నాడు… దేవర సీక్వెల్ మీద మళ్లీ చడీచప్పుడూ లేదు… ఎటొచ్చీ ఈ సినిమా టీమ్స్‌కు హీరోయిన్లే తేలికగా దొరుకుతారు..’’

అవును, మొన్న మంచు అలియాస్ కంచు లక్ష్మి అన్నదీ అదే కదా… ‘‘నన్ను అడిగినట్టే డ్రెస్ సెన్స్ మీద మహేష్ బాబును అడగగలరా’’ అని..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • వాణిని తొక్కేసింది లత, ఆశ… అసలే సౌతిండియన్, పైగా మెరిటోరియస్…
  • గ్రేట్… కథాకాకరకాయ జానేదేవ్… అదే విజువల్ వండర్… ఇది మరో లోకం..!!
  • జోలా జో-లమ్మ జోలా, జేజేలా జోలా, జేజేలా జోలా… హమ్ చేయండి ఓసారి…
  • అంత వణికిపోయే ముప్పేమీ కాదు… నందాదేవి అణుముప్పు అసలు స్టోరీ..!!
  • రేవంతుడు ధన్యుడు… వందలేళ్ల ఆదివాసీ చరిత్ర ‘చెక్కబడుతోంది’…
  • ఎడ్యుకేటెడ్, రిటైర్డ్, ఇంగ్లిషు తెలిసినవాళ్లే… ఈజీ సైబర్ టార్గెట్లు..!
  • ఒక బ్రహ్మపుత్రుడు… ఒక బ్రహ్మపుత్రిక… వెరసి ఓ బ్రహ్మపదార్థం సినిమా..
  • అశ్వపతి… ఈ పాత్రే లేకపోతే రామాయణం లేదు… రావణ వధ లేదు…
  • పాకీజా, శ్యామల, జయవాహిని… రంగులు వెలిసిన జీవితాలు…
  • రాముడి తమ్ముడు శతృఘ్నుడికీ విడిగా ఓ కథ ఉంది రామాయణంలో…!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions