.
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ వ్యక్తిగత జ్యోతిష్కుడి పేరు రాధన్ పండిట్ వేట్రివేల్… విజయ్ సక్సెస్ తరువాత ఈయనకు గిరాకీ పెరిగింది, ఈయన మీద చాలామంది నాయకులకు గురి కుదురుతోంది… కవిత కూడా తనను ఆహ్వానించింది… తన పార్టీ, తన భవిష్యత్తు, జాతకలోపాలు, ఉపశమనాలు గట్రా చర్చించింది…
గుడ్, ఇలాంటివి నమ్మడం, నమ్మకపోవడం ఆమె వ్యక్తిగతం… ఆమె ఇష్టం… వినిపిస్తున్న కొన్ని వార్తల ప్రకారం… ఆమెకు తను కొన్ని సూచనలు చేశాడు… అందులో ముఖ్యమైంది… పూర్తిగా కల్వకుంట్ల అనే ఇంటి పేరుతో తెగతెంపులు చేసుకోవాలి…
Ads
నిజానికి ఆమె అత్తారింటికి వెళ్లాక ఆమె ఇంటిపేరు దేవనపల్లి అవుతుంది, మన ఆనవాయితీల ప్రకారం.., కానీ ప్రస్తుతం పుట్టింటి ఇంటిపేరుతో పాస్‌పోర్ట్ ఉంటే, దాన్ని ఎవరూ మార్చుకోవడానికి ఇష్టపడటం లేదు… దాన్నే కొనసాగిస్తున్నారు… పైగా కల్వకుంట్ల అనేది ఆమెకు ప్లస్ పాయింట్ అవుతుంది… అది కేసీయార్ ఇంటిపేరు కాబట్టి దానికి కాస్త తెలంగాణ ఉద్యమం తాలూకు ఎమోషనల్ వాల్యూ యాడ్ అవుతుంది…
కానీ… కవిత జాతకం ప్రకారం ఆయన సజెస్ట్ చేసింది మాత్రం జయలలిత తరహాలో పేరులో మార్పులు… ఆమె పేరులో J Jayalalitha” కు బదులుగా “J Jayalalithaa అని ఒక a అదనంగా జోడించుకుంది… జ్యోతిష్కుల సూచనల ప్రకారమే… ఒకవేళ కవిత పేరులో మార్పుకు సిద్దపడితే ఆప్షన్లు…
- కల్వకుంట్ల బదులు ఓన్లీ కవిత
- అత్తారింటి పేరు దేవనపల్లి కలిసేలా Kavitha బదులు Kavitha D తో ముందుకు వెళ్లడం
కుటుంబం, పార్టీ, తండ్రి, అన్న తనను బహిష్కరించాక ఆమె ఆ కల్వకుంట్ల పేరును కూడా తీసేయాలని అనుకున్నట్టు సమాచారం… దాంతో లాభనష్టాలూ బేరీజు వేసుకుని నిర్ణయాన్ని పెండింగులో పెట్టినట్టుంది… ఇప్పుడు ఈ రాధన్ పండిట్ ఈ మీమాంసను మళ్లీ మొదటికి తీసుకొచ్చినట్టే…
ఆమె కుండలిలో రాజకీయ ఉన్నతిని నిర్దేశించే దశమ స్థానం బలంగా ఉన్నా.. భాగ్య స్థానం (9వ స్థానం)లో అనేక దోషాలున్నట్లు ఆయన చెప్పినట్టు సమాచారం… ఆమె జాతకంలో కుజుడు, సూర్యుడు, శని బలంగా ఉన్నా.. రాహువు అనుకూలంగా లేకపోవడం వల్ల ఈ రెండేళ్లలో అనుకున్న స్థాయిలో దూసుకెళ్లడం అంత సులభం కాదు, విపరీతంగా శ్రమించాలట…
అసలు ఈయన జోస్యాల స్ట్రయికింగ్ రేట్ ఎంత..? అదీ ఓసారి చూడాలి… ఈయనది ఈరోడ్… వైదిక జ్యోతిష్యం… 1991లో జయలలిత గెలుస్తుందని చెప్పాడు… తరువాత ఆమె ఈయన్ని నమ్మేది… 1996లో ఆమె జైలు, కష్టకాలం దాటేందుకు పేరులో అదనంగా ఒక a యాడ్ చేసుకొమ్మని చెప్పాడు, అది ఫలించింది, ఫలితంగా ఈయనకు డిమాండ్ పెరిగింది…
2008లో తన పేరును రాధన్ పండిట్‌గా మార్చుకుని, ఢిల్లీలో తిష్టవేసి, సెలబ్రిటీల జ్యోతిష్కుడు అయ్యాడు… తనకు చాలామంది పెద్ద నాయకులు కస్టమర్లుగా ఉన్నారు… అడ్వాణీ సహా…! 2024 లో విజయ్ కోసం తమిళనాడు వచ్చేశాడు… మళ్లీ సక్సెస్… ఎక్కడ విజయం ఉండునో అక్కడ గిరాకీ ప్రబలును… తన తన గ్రహబలం, జాతక స్థితి ప్రస్తుతం అదే…!!
Share this Article