Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

అక్కినేని వారి సినిమా… చూడాలంటే ఎక్కడా చాన్స్ లేదెందుకో…

November 10, 2024 by M S R

.

కల్యాణి… సంగీత సాహిత్య ప్రియులకు మృష్టాన్న భోజనమే ఈ సినిమా … ఓ శంకరాభరణం , ఓ మేఘసందేశం వంటి సంగీతసాహిత్యాలు . అయితే కమర్షియల్ గా ఆ సినిమాలు సక్సెస్ అయినట్లుగా సక్సెస్ కాలేదు . క్లాస్ ఆడియన్సుకు మాత్రమే గుర్తుండి ఉండాలి .

అన్నపూర్ణ ఫిలింస్ బేనరుపై మొట్టమొదటి సినిమా . అంటే అక్కినేని కుటుంబ సంస్థ . మాదిరెడ్డి సులోచన గారి రాగమయి నవల ఆధారంగా దాసరి నారాయణరావు దర్శకత్వంలో 1979 ఆగస్టులో వచ్చింది .

Ads

రమేష్ నాయుడు అద్భుతమైన సంగీతాన్ని అందిస్తే , అంతకుమించి బ్రహ్మాండమైన సాహిత్యాన్ని దాసం గోపాలకృష్ణ , సినారె , వేటూరి పోటాపోటీగా అందించారు . ఒక్కో పాట ఒక్కో ఆణిముత్యం . ఒక్కో పాట గురించి చెప్పుకుందాం .

వేటూరి వ్రాసిన నీ పలుకే త్యాగరాయ కీర్తన , నీ నడకే క్షేత్రయ పద నర్తనా , నీ పిలుపే జయదేవుని దీపికా , నీ వలపే కాళిదాసు కవితా . పాటంతా మన దేశ సాంస్కృతిక సౌరభాన్ని వెదజల్లుతుంది . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మలు పాడారు . ఈ పాటలో జయసుధ శాస్త్రీయ నృత్యం చాలా బాగుంటుంది . విచిత్ర కుటుంబం సినిమాలోని ఆడవే జలకమ్మూలాడవే , అమెరికా అమ్మాయిలో పాడనా తెలుగు పాట పాటలు గుర్తుకు వస్తాయి.

మరో గొప్ప పాట సి నారాయణరెడ్డి వ్రాసిన లలిత కళారాధనలో వెలిగే చిరుదివ్వెను నేను పాట . ఈ పాట సినిమాలో మురళీమోహన్ మీద ఒకసారి , జయసుధ మీద మరోసారి ఉంటుంది . బాలసుబ్రమణ్యం , సుశీలమ్మల గాత్రంలో పాట చాలా శ్రావ్యంగా ఉంటుంది . జయసుధ పాడిన పాటలో పోతన , త్యాగయ్యలకే కడుపు నింపని కళలెందుకు అని ప్రశ్నించబడుతుంది .

మూడో పాట గుబులు పుట్టిస్తావె ఓ మల్లికా గుండెలే దోస్తావు ఓ మల్లికా . దాసం గోపాలకృష్ణ వ్రాస్తే సుశీలమ్మ , బాలసుబ్రమణ్యం పాడారు . నాలుగో పాట వేటూరి వ్రాసిందే . ఆకాశంలో హాయిగా రాగం తీసే కోయిలా జీవన రాగం విడిచావా కల్యాణి రాగం మరిచేవా పాట . వింటుంటే మన హృదయం ద్రవించిపోతుంది . బహుశా ట్రాజిక్ సాంగ్ అనుకుంటా .

ఈ సినిమా రిలీజప్పుడే చూసాను .  నాకయితే సినిమాలో సీన్లు గుర్తులేవు . రిఫ్రెష్ చేసుకోవటానికి యూట్యూబులో సినిమా వీడియో లేదు . పాటల ఆడియోలు అన్నీ ఉన్నాయి . కొన్ని పాటల వీడియోలు మాత్రమే ఉన్నాయి . ఈ సినిమాను ఆరోజుల్లో చూసిన సంగీత సాహిత్య ప్రియులకే గుర్తుండి ఉండాలి . కామెంట్లలో వారే యాడ్ చేయాలి .

అయిదో పాట లేత లేత యెన్నెల్లో నీలి నీలి చీరె కట్టి నూకాలమ్మ జాతర నాడు నూతి కాడ కూర్చుంటే పాట . దాసం గోపాలకృష్ణ వ్రాస్తే యస్ జానకి పాడారు . సినిమాలో హలం మీద అని గుర్తు . ఆరోది ఏది మోసం ఎవరిది దోషం ఏది పాపం ఎవరిది లోపం . సి నారాయణరెడ్డి వ్రాసిన ఈ పాటను సుశీలమ్మ , బాలసుబ్రమణ్యం పాడారు .

ప్రధాన పాత్రల్లో మురళీమోహన్ , జయసుధ , మోహన్ బాబు , నిర్మలమ్మ నటించారు . జయసుధ అద్భుతంగా నటించిందని మాత్రం గుర్తుంది . మంచి పేరు కూడా వచ్చిందని గుర్తు . ఇంత గొప్ప కళాత్మక సినిమా యూట్యూబులో లేకపోవడం బాధాకరం . ఎవరైనా సినీప్రియులు పూనుకుంటే బాగుంటుంది .

సినిమా యూట్యూబులో లేదు కాబట్టి సినిమా చూడండని చెప్పలేను . కొన్ని పాటల వీడియోలు , అన్ని పాటల ఆడియోలు ఉన్నాయి . సంగీత సాహిత్య ప్రియులు పొరపాటున కూడా మిస్ కావద్దు . A great , unmissable musical & literary feat . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు ……… (దోగిపర్తి సుబ్రహ్మణ్యం)

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ’’నా పిల్లల్ని అమెరికాలో పెంచుతున్నానా..? ఇండియాలోనా..?’’
  • అసలు కన్సల్టెన్సీ అనగానేమి..? నిజానికి అవి ఏమి చేయును..?
  • సొంత బిడ్డపై డర్టీ క్యాంపెయిన్… ఎందుకు కేసీయార్ సైలెంట్..?!
  • ఇచ్చట అన్ని పళ్లూ సరసమైన ధరలకు ఊడపీకబడును..!
  • Cancer Vaccine..! ఒరే అయ్యా… కాస్త ఆగండ్రా బాబూ… కథ వేరు…!!
  • ఈ అందమైన అడవిపూల వెన్నెల మళ్లీ ఎప్పుడూ కనిపించలేదు..!
  • జర్నలిస్టులంటే తోపులూ, తురుములు కాదు… జస్ట్, వెర్రి పుష్పాలు…
  • 1.74 లక్షల కోట్ల స్కామ్ సహారాకు… అప్పట్లో కేసీయార్ చేసిన సాయం, సలాం..!!
  • ఒరేయ్ గుండూ… బట్టతలపై బొచ్చు పెంచే మందొచ్చిందటరా…
  • అగ్నిపరీక్ష ఓ చెత్త తంతు… 3 గంటల లాంచింగే జీరో జోష్ నాగార్జునా…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions