.
ఈమధ్యకాలంలో గౌహతిలోని కామాఖ్య దేవాలయానికి తెలుగు పర్యాటకులు/ భక్తుల సంఖ్య బాగా పెరిగింది… దర్శనాలకే కాదు, బలి పూజల కోసం కూడా…
ప్రస్తుతం అక్కడ దియోధని (దేవధని) ఉత్సవాలు సాగుతున్నాయి… ఇది ప్రతి సంవత్సరం ఆగస్టు 17 నుంచి 19 వరకు జరుగుతాయి… ఇదీ శక్తి ఆరాధనలో భాగమే…
Ads
ఇది అస్సామీ సంస్కృతిలో ప్రముఖంగా భావించబడే పండుగ.., అస్సామీలో ఇది షావోన్ నెల నుండి భద్రా నెలకు మారడాన్ని సూచించేది… ఈ ఉత్సవాల సందర్భంగా కనిపించే ప్రముఖ దృశ్యాలు దేవతలు ఆవహిస్తారని చెప్పబడే దేవోధల ఓ రిథమిక్ నృత్యాలు, తోడుగా వాయిద్యాలు…
ఈ ఉత్సవంలో కేంద్ర వ్యక్తులు దేవోధలు.., వీరిని ఘోరా లేదా జోకి అని కూడా పిలుస్తారు.., సర్ప దేవత మానస ఆరాధనకు సంబంధించిన ఆచారం ఇది… నృత్యం చేసేటప్పుడు, దేవోధలు మానస, జయదుర్గ, వనదుర్గ, శివ, గణేష్ వంటి దేవతలు ఆవహించి ట్రాన్స్‌లోకి ప్రవేశిస్తారని నమ్ముతారు… ఈ స్థితిలో, వారు భవిష్యత్తును అంచనా వేసే జోస్యాలు కూడా చెబుతుంటారు…
దియోధని నృత్యం ఒక ప్రత్యేకమైన, మంత్రముగ్ధులను చేసే జానపద నృత్య రూపం, దీనిలో నృత్యకారులు కత్తులు, కర్రలు లేదా కవచాలను ఉపయోగిస్తారు… నృత్యం, ఆధ్యాత్మికత మిశ్రమానుభూతి ఈ ఉత్సవం, అందుకే పెద్ద ఎత్తున భక్తులు ఈ ఉత్సవాలకు హాజరవుతారు…
రీసెంట్ విశేషం ఏమిటంటే..? ఈమధ్య ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ గుడిని దర్శించుకుని వంద మేకలు, వంద పావురాలను సమర్పించాడు… అంతేకాదు, గుడి గోపురంపై కలశానికి కొన్ని కిలోల బంగారు తొడుగు సమర్పణ కూడా..! చాలామంది పారిశ్రామికవేత్తలు వస్తున్నారు ఇక్కడికి కొంతకాలంగా..!
Share this Article