Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

కన్నడ భాష పుట్టుకపై పిచ్చి కూతలు… కమలహాసన్‌పై రుసరుసలు….

May 28, 2025 by M S R

.

సినిమా సెలబ్రిటీలకు బుర్రలు ఉండవని మరోసారి నిరూపితం… వాళ్లు పలు సందర్భాల్లో కూసే కూతలు వింటున్నాం, చూస్తున్నాం కదా… అగ్ర కథానాయకుడు కమలహాసన్ భిన్నమేమీ కాదు…

పైగా హిందూ మతం, ఆచారాల తీవ్ర ద్వేషి తను… ఇప్పుడు ఇక వేరే భాషల మీద పడ్డాడు… కన్నడ భాషకు మూలం తమిళమేననీ,  తమిళం నుంచి కన్నడం పుట్టిందని ఎక్కడో ఏదో ప్రసంగంలో (థగ్‌లైఫ్ సినిమా ఆడియో ఫంక్షన్‌లో కావచ్చు..?) చెప్పాడు… దాని మీద కర్నాటక బీజేపీ విరుచుకుపడుతోంది… (కమలహాసన్ వ్యాఖ్యల సమయంలో శివరాజకుమార్ అక్కడే ఉన్నాడట)…

Ads

ఇప్పటిదాకా నువ్వు హిందూ ద్వేషివే అనుకున్నాం, పరభాషా ద్వేషివని నిరూపించుకుంటున్నావు… నీ తమిళం మీద నీకు ప్రేమ ఉంటే సరేగానీ కన్నడ భాషను కించపరిచే మాటలు దేనికి..? అని బీజేపీ విజయేంద్ర యడ్యూరప్ప విరుచుకుపడ్డాడు…

నీకు చరిత్ర తెలుసా..? ఎందుకీ కూతలు, తక్షణం క్షమాపణ చెప్పు 6.5 కోట్ల కన్నడ ప్రజలందరికీ… ఆర్టిస్టులకు భాషాసహనం, పర భాషల పట్ల గౌరవం ఉండాలనే కామన్ సెన్స్ లేకపోతే ఎలా? నువ్వు కన్నడంలో కూడా నటించావని మరిచిపోయావా..? అనేది తన అభ్యంతరం…

కర్నాటక రక్షణ వేదిక (ప్రవీణ్ శెట్టి వర్గం) కమలహాసన్‌కు ఓ లెసన్ చెబుతామని ప్రిపేరైంది… తను థగ్‌లైఫ్ ప్రమోషన్ కోసం బెంగుళూరు వచ్చాడు… ఇదేదో గొడవ అవుతుందని పసిగట్టిన నిర్వాహకులు కమల‌హాసన్‌ను అక్కడి నుంచి తప్పించేశారు… అసలే కొన్నాళ్లుగా కన్నడ అభిమానం మండిపోతోంది కర్నాటకలో…

ఇప్పుడు కూడా థగ్‌లైఫ్ సినిమా కన్నడ వెర్షన్‌ను బాయ్‌కాట్ చేయాలనే ఆలోచనలో కన్నడ అభిమాన సంఘాలు ఆలోచిస్తున్నాయి…. సరే, నిజానికి తనేదో కూశాడని కాదు గానీ కన్నడం తమిళం నుంచే పుట్టిందా..? కాదు, అన్ని భాషలకూ తమిళమే మాతృభాష అనే ఆభిజాత్య భావన నుంచి పుట్టుకొచ్చిన వాదనలు ఇవి…

మరి నిజమేమిటి..? ఇదీ…

‘‘తమిళం, కన్నడం, తెలుగు, మలయాళం — ఇవన్నీ ద్రావిడ భాషా కుటుంబంలోకి వస్తాయి. వీటి ప్రాథమిక మూలం: ప్రాచీన ద్రావిడ భాష (Proto-Dravidian): ఇది సుమారు 4500–5000 సంవత్సరాల క్రితం ఉన్నట్లుగా భాషా శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు… ఈ భాష నుంచే ద్రావిడ భాషలు అభివృద్ధి చెందాయి…

కన్నడ భాషకు తమిళ భాష తల్లి కాదు. కానీ, కన్నడ, తమిళ భాషలు ఒకే మూలం నుంచి వచ్చిన అక్కాచెల్లెల్లు అని చెప్పవచ్చు. ఇవి రెండూ దక్షిణ ద్రావిడ భాషలే… అటు ప్రాచీన కాలంలో (సంగం యుగం – తమిళం, బద్దెన ద్రావిడ కాలం – కన్నడం) ఒకే తరహా మూలభాషల ఆధారంగా అభివృద్ధి చెందాయి…

అక్షరలిపి, శబ్ద నిర్మాణం, వ్యాకరణం మొదలైన అంశాల్లో కొన్ని సామాన్యతలు ఉన్నా, రెండు భాషలు ఒక్కటి కాదు… కన్నడకు ప్రత్యేకమైన వ్యాకరణ పద్ధతి, ఉచ్చారణ శైలి ఉన్నాయి…

రెండూ ద్రావిడ భాషా కుటుంబంలోని సోదర భాషలు మాత్రమే… ఒకదాన్ని మరొకటి పుట్టించిందని చెప్పడం భాషా శాస్త్ర ప్రకారంగా సరైంది కాదు……. ఇదీ భాషానిపుణులు ఇస్తున్న క్లారిటీ… అవన్నీ ఆలోచించేంత బుర్ర ఉంటే తను కమలహాసన్ ఎందుకవుతాడు..? తను గొప్ప నటుడు కానీ విచక్షణాజ్ఞానం అంతంత మాత్రమే… లేకపోతే ఓ సోదర భాషను ఇలా ఎందుకు గెలికి అవమానించడం…!?

థగ్‌లైఫ్ డబ్బులు కావాలి కదా, అది కన్నడంలోనూ నడవాలి కదా… చూస్తుండండి, అబ్బే, నా ఉద్దేశం అది కాదు, నా మాటల్ని వక్రీకరించారు, నాకు కన్నడం అంటే బోలెడంత ప్రేమ అని లెంపలేసుకుంటాడు..!!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • జాతీయ పార్టీ అధ్యక్షుడు సరే… మరి ఇతర దేశాల శాఖల మాటేమిటి..?
  • అబ్బో… ఆ పిచ్చి కూతలు ప్రేమతో చేశాడట, సారీ చెప్పడట…
  • మా సంపద మా సొంతం… నయా- వలసవాదంపై ఓ తిరుగుబాటు పతాక…
  • బీజేపీలో బీఆర్ఎస్ విలీనం… మోడీ వద్దన్నాడా..? ఎందుకు కవితమ్మా..?.!
  • అవార్డు తీసుకో పుష్పా… ఆ జైలు, ఈ అభినందన… వేటికవే…
  • ఆడపిల్లలకు తీయటి స్కీమ్… కర్నాటకలో రద్దు, తెలంగాణలో స్టార్ట్…
  • రొటీన్ కథ… ఫార్ములా కమర్షియల్ పోకడ… ఐనా సూపర్ హిట్…
  • జర్నలిజం – ఇప్పుడు ఒక వెలిసిపోయిన ఆశ.., కళ తప్పిన కల…
  • అవధానాల్లో అప్రస్తుతాలు… అవే అసలైన హాస్యస్పోరకాలు…
  • రాను రాను కొందరు ఉన్నత విద్యావంతులు… డాక్టర్ కీకరకాయలు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions