మొదట నమ్మబుద్ధి కాలేదు… కామారెడ్డి నియోజకవర్గం… రేవంత్, కేసీయార్ పోటీచేస్తున్న స్థానం… హోరాహోరీ సాగుతోంది పోటీ… అంతేకాదు, లోకల్ బీజేపీ లీడర్ వెంకట రమణారెడ్డి వాళ్లకు దీటైన పోటీ ఇస్తున్నాడు… దాంతో అందరి దృష్టీ దీనిపై పడింది… బీజేపికి ఆశలున్న సీట్లలో ఇదీ ఒకటి… అందుకే మోడీ భాయ్ రాక…
రేవంత్ కోసం ఒక మండల ఇన్‌చార్జిగా పనిచేస్తున్న ఓ పెద్దమనిషి చెప్పిందే… మొన్న కేటీయార్ మీటింగు జరిగింది… మామూలుగా ఏ పార్టీ మీటింగైనా సరే ఎంతో కొంత డబ్బు ఇవ్వనిదే ఎవరూ ఊళ్ల నుంచి కదలరు, తెలిసిందే కదా… భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామం నుంచి అయిదు ట్రాక్టర్లలో జనం తరలారు… ఒక్కొక్కరికి ఎంతిచ్చారనేది అప్రస్తుతం… సరే, బాగానే ఉంది… ట్రాక్టర్లకు కిరాయి ప్లస్ జనానికి డబ్బులు…
కేటీయార్ మీటింగు అయిపోయింది… డాడీ పోటీచేస్తున్న సీటు కాబట్టి కేటీయార్ ఎక్కువసార్లు ఆ స్థానంపై కాన్సంట్రేట్ చేసి తిరగాల్సి వస్తోంది… తిరుగుతున్నాడు… లోకల్ కేడర్‌తో తనే ఆర్గనైజ్ చేసుకుంటున్నాడు… తప్పదు… కేటీయార్ మీటింగు అయ్యాక ఆ ట్రాక్టర్లలో ఉన్న జనం తరఫున లోకల్ బీజేపీ లీడర్ ఒకాయనకు ఫోన్లు చేశారు…
Ads
అన్నా, మేం ఎలాగూ ఇంటికే వెళ్తున్నాం… మా ఊరు దాటినాక మోడీ సార్ మీటింగు ఉంది కదా… దానికి కూడా హాజరవుతాం… ఎంతోకొంత ఇవ్వండి… ఇదీ వాళ్ళ కోరిక… అడగడంలో కూడా తప్పులేదు… ఎన్నికల కార్యక్రమాలకు ఇది సహజమైపోయింది కాబట్టి… కానీ సదరు లీడర్ ‘మీరు 200 మంది అంటే కనీసం 200 చొప్పున ఇచ్చినా 40 వేలు కావాలి, నాకు అంత బడ్జెట్ ఇవ్వలేదు… ఏమీ అనుకోకండి…’’ అన్నాడు… నిజంగానే ఆ స్థానంలో బీజేపీ చాలా తక్కువ ఖర్చు చేస్తోంది…
‘పోనీ, ట్రాక్టర్ కిరాయి ఇవ్వండి, మేం ఫ్రీగానే వస్తాం… మాకూ మోడీ మీటింగుకు రావాలనే ఉంది, ఆయన్ని కూడా చూసి ఇంటికి వెళ్తాం…’’ అనడిగారు… ఆ లీడర్ దానికీ ఒప్పుకోలేదు… తనూ ఏమీ చేయలేడు… పోనీ, ట్రాక్టర్ వాళ్లనే అడుగుదాం, 1000 రూపాయల చొప్పున కిరాయి ఇస్తా, వాళ్లను తీసుకొస్తారు మీటింగుకు అని వాళ్లకే ఫోన్లు చేస్తే… ఆ ఐదుగురూ కూడబలుక్కున్నారు…
1000 రూపాయలు వద్దు గానీ 500 ఇవ్వండి అన్నా… డీజిల్ పోయించండి చాలు అన్నారు… వావ్… పార్టీల అవసరం కదాని అందరూ ఎంతోకొంత ఎక్కువ అడగడం సాధారణమే… కానీ ట్రాక్టర్లు, ప్రజలు కూడా దాదాపు స్వచ్చందంగానే బీజేపీ మీటింగుకు వచ్చినట్టు లెక్క… ఆ లీడరే ఆశ్చర్యపోయాడట… తోటి లీడర్లకు చెబితే వాళ్లూ ఆశ్చర్యపోయారు… ఇంట్రస్టింగుగా అనిపించింది… నియోజకవర్గంలో ఇదొక చిన్నపాటి చర్చ…
Share this Article