Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

తెలంగాణ కమ్మల వోట్లు ఎటు..? ఏకంగా 40 కాంగ్రెస్ టికెట్లు కావాలట…!!

October 7, 2023 by M S R

Nancharaiah Merugumala…..  తెలంగాణ కమ్మోరు.. కేసీఆర్ కుటుంబాన్ని, బీఆరెస్ నూ అమ్మోరులా ఆదుకోక తప్పదేమో!

——————————–

కమ్మ కుటుంబాల్లో పుట్టామని చెప్పిన ఆరుగురు తెలంగాణ మాజీ శాసనసభ్యులకు 2018 డిసెంబర్ అసెంబ్లీ ఎన్నికల్లో టీఆరెస్ టికెట్లు ఇచ్చింది. వారిలో ఒక్క తుమ్మల నాగేశ్వరరావు గారు తప్ప మిగిలిన ఐదుగురూ (కోనేరు కోనప్ప, మాగంటి గోపీనాథ్, అరికపూడి గాంధీ, నల్లమోతు భాస్కరరావు, పువ్వాడ అజయ్ కుమార్) గెలిచారు. వచ్చే డిసెంబర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ ఐదుగురికి టికెట్లు ఖాయమని చెబుతున్నారు.

Ads

మరి, తెలంగాణ కమ్మ కులస్థులు ఈసారి కాంగ్రెస్ వైపు ఉంటారని ధీమాగా ఉన్న హస్తం పార్టీ… ఎంత మంది స్వయం ప్రకటిత కమ్మ నాయకులకు టికెట్లు ఇస్తుందో చెప్పడం కష్టమేమీ కాదు. ఇద్దరికిస్తే గొప్పే. ఈలెక్కన… మహాభారతంలో కౌరవుల పక్కన ఉండాలా లేక పాండవుల పక్షాన ‘పనిచేయాలా’ అనే సమస్యకు మథురలో పుట్టిన కృష్ణుడు ఎట్టకేలకు పరిష్కారం కనుగొన్నాడు. పాండవులను ఫ్రంట్ & బ్యాక్ సీట్ డ్రైవింగ్ తో ఓ ‘ఒడ్డుకు’ చేర్చాడు కిషన్ కన్హయ్యా.

ఇక తెలంగాణ ఎన్నికల్లో ‘హస్తాన్ని’ తొక్కుకుంటూ పోయి పాత అంబాసిడర్ కారు ఎక్కి, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును మూడోసారి ముఖ్యమంత్రిని చేయడానికి కమ్మలు మొగ్గు చూపుతారని నా కృష్ణా జిల్లా మిత్రులు అంచనా వేస్తున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో… పారిశ్రామిక వేత్తలు, కాంట్రాక్టర్లు, వ్యాపారులు అయిన కమ్మలను ‘ పెద్ద భూతాలుగా, బాహుబలులుగా ‘ చిత్రించిన చంద్రశేఖర్ రావు గారూ.. అంత బ్యాడ్ కాదనీ, శానా మంచోరని 2014లోనే తెలంగాణ కమ్మ సోదరులు సొంత అనుభవం ద్వారా సక్కగా తెలుసుకున్నారు.

ఈ చక్కటి సామాజిక, రాజకీయ, ఆర్థిక నేపథ్యంలో తెలంగాణ Self-declared కమ్మ ఓటర్లు భారత రాష్ట్ర సమితికే ఓటేస్తారని రాజకీయ పంతుళ్లు, రెడ్లు, వెలమలు, బీసీలు, ఎస్సీలు, ఎస్టిలూ, ముస్లిములూ నమ్ముతున్నారు. మరి ప్రస్తుత శాసనసభలో ఐదుగురు, శాసనమండలిలో ఒక్కరు, లోక్ సభలో ఒక్కరూ (ఖమ్మం) చొప్పున ప్రాతినిధ్యం ఉన్న తెలంగాణ కమ్మోరు డిసెంబర్ ఎలక్షన్లలో కేసీఆర్ కుటుంబాన్ని అమ్మోరులా ఆదుకుంటేనే… తెలంగాణ-ఆంధ్రా బ్రదర్లు, సిస్టర్ల మధ్య సామరస్యం బలోపేతం అవుతుందని… చిక్కడపల్లి కోనసీమ ద్రావిడ బ్రాహ్మణ సంఘం మేధావులు సైతం అంచనాలు వేసిపారేస్తున్నారు. కోబ్రాల జోస్యాలు సాధారణంగా తప్పు కావనే మంచి పేరుంది.

తుమ్మలను విస్మరించినా పువ్వాడకు మేలే చేశారు కదా!

——————————

పాలేరు అసెంబ్లీ టికెట్ తుమ్మల నాగేశ్వరరావు గారికి వరుసగా మూడోసారి కేసీఆర్ ఇవ్వని మాట నిజమే. 2014 ఎన్నికల్లో ఓడిన తుమ్మలకు ముందు మంత్రి పదవి, తర్వాత కౌన్సిల్ సీటూ తెలంగాణ జాతిపిత ఇచ్చిన మాటా వాస్తవమే కదా. తెలంగాణ పోరాట యోధుడు చెన్నమనేని రాజేశ్వరరావు గారి సుపుత్రుడు చెన్నమనేని రమేశ్ బాబును ఎన్నోసార్లు అసెంబ్లీకి పంపారు పెద్ద పద్మ నాయకుడు.

kamma

రమేశ్ ను వెలమవాడని కేసీఆర్ మేలు చేశాడని అనుకున్నా… మరో కమ్యూనిస్టు యోధానుయోధుడు, ఖమ్మం కామ్రేడ్ పువ్వాడ నాగేశ్వరరావు గారి కొడుకు అజయ్ కుమార్ కు కృష్ణా, గుంటూరు జిల్లాల కమ్మలకు ఇష్టమైన రవాణా శాఖ ఇచ్చిన విషయం మరిచిపోయేంతటి చెడ్డవారు కాదు తెలంగాణ కమ్మ పౌరులు. (పొద్దున్నే టీవీ 9 చానలు పెడితే…” తెలంగాణలో కమ్మ రాజకీయాలు, కమ్మోరి మద్దతు కాంగ్రెసుకేనా?” అనే భయోత్పతం కలిగించే తెలుగక్షరాలు చూశాక పై ‘వాక్యాలు’ రాయాలన్పించింది. సకలాంధ్ర కమ్మ సోదరులు అపార్ధం చేసుకోరనే ఆశతో..)




ఇదీ నాంచారయ్య గారి అభిప్రాయం… ఇది సైటులో పెడుతుండగానే ఓ వాట్సప్ మెసేజ్ వచ్చింది… 40 సీట్లను తమకు కేటాయించాలని కమ్మవారి రాజకీయ ఐక్యవేదిక ప్రముఖులు కాంగ్రెస్ పెద్దలను కలిశారట…

kamma

సరే, బాగానే ఉంది… తమ కులానికి ఎక్కువ సీట్లు కావాలి అని కోరుకోని కులసంఘం ఏముంటుంది..? కానీ రెడ్ల పెత్తనం బలంగా ఉండే కాంగ్రెస్ అంతగా సీట్లను కమ్మలకు కేటాయించే సీన్ ఉంటుందా..? 23 స్థానాల్లో గెలుపోటముల్ని శాసిస్తారట… 7 స్థానాల్లో ప్రభావం ఉంటుందట… వోకే, మరి మిగతా పది..? అవేమిటో కూడా అందులో రాయలేకపోయారా..? ఓ రాయి వేయడమే కదా, తగిలితే తగిలింది… ఎక్కువ అడిగితే ఎన్నో కొన్ని దక్కకపోవు కదా అన్నట్టుగా ఉంది ఈ జాబితా…

తప్పకుండా మేమే గెలుస్తాం అని ధీమాగా చెప్పిన జాబితాలో … బాన్స్‌వాడ, బోధన్, కుత్బుల్లాపూర్, పటాన్‌చెరు, కూకట్‌పల్లి, రాజేంద్రనగర్, ఉప్పల్, పాలేరు, కోదాడ, జుబిలీ హిల్స్, కొత్తగూడెం, మల్కాజిగిరి, ఖమ్మం, ఎల్బీనగర్, శేరిలింగంపల్లి, పినపాక, సత్తుపల్లి, మధిర, అశ్వారావుపేట, ఇల్లెందు, వైరా, భద్రాచలం, ములుగు… ప్రభావం ఉండే నియోజకవర్గాల జాబితాలో నాగార్జునసాగర్, మిర్యాలగూడ, హుజూర్‌నగర్, సూర్యాపేట, ఖైరతాబాద్, సనత్‌నగర్, మేడ్చల్ ఉన్నాయి… ఈ సీట్లలో సెటిలర్ల వోట్లు ఎక్కువే… ఇందులో పది ఖమ్మం జిల్లా సీట్లే… ఎనిమిది సిటీ సీట్లు… కానీ ఓ ప్రధాన ప్రశ్న… సెటిలర్లు అంటే కేవలం కమ్మవారేనా..? ఏమో, రెడ్లు, కాపులు చెప్పాలి..!

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • మళ్లీ ఓసారి ఈ దేశం ఈ ఐరన్ లేడీ ఇందిరని గుర్తుతెచ్చుకుంటోంది..!!
  • ‘‘మొగుడు పోయిన ఆడది, ఎన్నిక ఓడిన లీడర్ జనంలోకి వెళ్లొద్దు’’
  • నిన్నటి కాల్పుల విరమణ మరియు మహాభారతంలోని ఓ సంభాషణ..!
  • కోహ్లి రిటైర్‌మెంట్ ప్రచారాల వెనుక అసలు కథలేమిటి..?
  • పాపం శమించుగాక… ఇద్దరు వ్యక్తుల పేర్లు పదే పదే గుర్తొస్తున్నాయి…
  • యుద్ధానికి విరమణ సరే… కానీ ఈ ఆపరేషన్ ఏం తేల్చి చెప్పింది..?!
  • హమ్మయ్య… ఆ శ్రీవారి కృప వల్ల టీటీడీ ఉద్యోగుల ప్రాణాలకు భరోసా..!!
  • హీరోనని చెప్పుకోకు నానీ… ఈ దరిద్రపు పోకడలతో చావుదెబ్బ తింటావ్…
  • పెళ్లిళ్లు వద్దు, పిల్లలు వద్దు… ఉనికే కోల్పోతున్నా ఉలుకు లేని ఓ మతం…
  • పాకిస్థాన్ అంటేనే ఓ రోగ్ కంట్రీ కదా… అందుకే ఎవ్వడూ స్పందించడు…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions