ఏపీ రాజకీయాలే కాదు, జనం కూడా రెండుగా చీలిపోయినట్టున్నారు… కమ్మ వర్సెస్ రెడ్డి… ఎప్పుడూ ఏదో ఒక అంశం మీద ఇద్దరూ కొట్టుకుంటూనే ఉండాలా..? తాజాగా కల్కి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ మీద దుమారం రేగుతోంది… ఒకటి కులం, రెండు ప్రాంతం… సోషల్ మీడియాలో పోస్టులు, కామెంట్స్, మీమ్స్ రచ్చ రచ్చ అయిపోతోంది…
నిజానికి కమ్మ- రెడ్డి కులాల మధ్య బోలెడు వివాహాలు జరిగాయి… రెండూ సొసైటీలో మంచి ఎన్‌లైటెన్ కమ్యూనిటీలే… పైగా స్టేటస్ ఓ రేంజుకు వచ్చాక, ఆస్తులు, అంతస్థులు తప్ప కులాలు పెద్దగా పరిగణనలోకి రాని రోజులివి… ఐనా సరే, ఏపీ రాజకీయాల పైత్యం ప్రభావం విపరీతంగా పడుతోంది… దురదృష్టకరం… అసలు ఈ కల్కి ఇష్యూయే కాస్త సంక్లిష్టం, విచిత్రం…
ఎలాగంటే… ఇప్పటిదాకా రాజమౌళిదే హవా… తనను ఆకాశానికెత్తింది ఒక సెక్షన్… వోకే, సరుకున్నోడే… ఇప్పుడు నాగ్ అశ్విన్ పాన్ వరల్డ్ హిట్ అయ్యేసరికి ఆ సెక్షన్‌లో కొందరికి మండుతున్నట్టుంది… తను రెడ్డి… నాగ్ అశ్విన్ రెడ్డి… సరైన సమాచారం అవునో కాదో తెలియదు గానీ… తల్లి హైదరాబాదులో మంచి పేరున్న పెద్ద గైనకాలజిస్ట్… తండ్రి కూడా డాక్టరే… ఆమెది చిత్తూరు జిల్లా అని కొందరు, ఆయనది జడ్చర్ల (తెలంగాణ) అని కొందరు, నోనో, వాళ్లది కర్నూలు అని ఇంకొందరు ఏదేదో రాసేస్తున్నారు…
Ads
బట్, నాగ్ అశ్విన్ కుటుంబం చాలా ఏళ్లుగా హైదరాబాదులో ఉన్నదే… ఉస్మానియా, గాంధీ మెడికల్ కాలేజీలు, దవాఖానాలతో సంబంధాలున్న హైప్రొఫైల్ ఫ్యామిలీయే… నాగ్ అశ్విన్ పెళ్లి చేసుకున్నదేమో ప్రముఖ నిర్మాత, వైజయంతి మూవీస్ అశ్వినీ దత్ బిడ్డను… ప్రియాంక దత్… లవ్ మ్యారేజీ… ఆమె కూడా మంచి టేస్టున్న నిర్మాత… ఫీల్డ్‌లో సక్సెస్ సాధించిన పర్సనాలిటీ… భార్యాభర్తలిద్దరూ వర్క్ ఓరియెంటెడ్, అందరితోనూ సత్సంబంధాలు మెయింటెయిన్ చేస్తారు… ఓవరాక్షన్లు, హైఫై షోపుటప్‌లు ఉండవు…
ఐనా కొందరికి మంట… అసలే తెలంగాణ, ఆపై రెడ్డి… ఇంకేముంది..? ట్రోల్స్… అవసరమా..? మరి వంగా సందీప్ రెడ్డి యానిమల్‌తో బాలీవుడ్‌లో కూడా తిష్ట వేశాడు, ఓ లెవల్ చేరుకున్నాడు… తెలంగాణ కల్చరల్ సెంటర్ వరంగల్ బిడ్డ తను… సంకల్ప్‌రెడ్డిది హైదరాబాద్ శివారులోని ఇబ్రహీంపట్నం… ఐనా అసలు క్రియేటివ్ ఫీల్డులో, ఈరోజుల్లోనూ ఈ కులాల ప్రస్తావనలు, పోరాటాలు ఏమిటసలు..?
ఇలాంటి ఏ ఇష్యూ వచ్చినా సరే, మధ్యలో విజయ్ దేవరకొండను లాగుతున్నారు… తను తెలంగాణ, కానీ కమ్మ కాదు, రెడ్డి కాదు… ఇదే నాగ్ అశ్విన్‌కు చాన్నాళ్లుగా బాగా దగ్గర స్నేహితుడు… వీళ్లందరూ రేపటి మనుషులు… కానీ కొందరు కులాల ముద్రలు వేసి, బజారులోకి, బురదలోకి లాగుతూనే ఉంటారు…
కల్కి విషయానికే వద్దాం… మొదటి రోజు వసూళ్లలో మూడో అతి పెద్ద ఇండియన్ సినిమాగా రికార్డు సాధించింది… 1, ఆర్ఆర్ఆర్… 223 కోట్లు… 2, బాహుబలి-2… 217 కోట్లు… ఈ రెండూ రాజమౌళి క్రెడిట్స్… 3, కల్కి… 180 కోట్లు… (దీని నిర్మాణవ్యయం చాలా ఎక్కువ)… 4, కేజీఎఫ్… 159 కోట్లు… సరే, కల్కి ఎక్కువగా నార్త్ ఆడియెన్స్‌కు కనెక్టయింది… తమిళనాడులో పూర్, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఆశించినంత లేదు, సెకండ్ డే బుకింగ్స్ తగ్గాయి, సరే, అదంతా వేరే కథ…
కానీ ఏ హిందీ స్టార్ హీరోకూ సాధ్యం కాని వసూళ్లను మన సౌత్ సినిమాలు చూపిస్తున్నాయి… టాప్ 4 మనవే… చెప్పుకొండి… మన దక్షిణ సినిమా విజయపతాక గురించి చెప్పుకొండి… అంతేతప్ప, ఈ ఆంధ్రా- తెలంగాణ ఏంది..? ఈ కమ్మ- రెడ్డి ఏమిటి..? అన్నింటికీ మించి ఇండియన్ సినిమాలో సౌత్ ప్రకంపనలకు ఎపిసెంటర్ ఇప్పుడు హైదరాబాద్… ఇదెప్పుడూ కులం చూడదు… ఇది విశ్వనగరం..!!
Share this Article