మొత్తానికి నటి, బీజేపీ మండి లోకసభ స్థాన అభ్యర్థి కంగనా రనౌత్‌కు తనకు ఉపయోగపడే వివాదాన్ని ఎలా సృష్టించుకోవాలో బాగానే తెలుసు… బీజేపీ క్యాంపు సహజంగానే పటేల్‌ను, నేతాజీని ఎత్తుకుంటూ, నెహ్రూను డిగ్రేడ్ చేస్తుంటారు కదా… ఈసారి కంగనా ఏం చేసిందంటే..? ఈ దేశ తొలిప్రధాని నేతాజీ సుభాష్ చంద్రబోస్ కదా, స్వాతంత్య్రం వచ్చాక ఏమైపోయినట్టు..? అని ఓ ట్వీట్ కొట్టింది…
మండీమే క్యా రేట్ చల్ రహా ఆజ్ కల్ అంటూ (మండీలో (అంగట్లో) ఇప్పుడు ఏం రేట్లు నడుస్తున్నాయి..?) ఆమె ఎవరో కాంగ్రెస్ నాయకురాలు పెట్టిన ట్వీట్‌ను కూడా తనకు అనుకూలంగా మార్చుకుంది… నెటిజనం ఆమెకు మద్దతుగా, ఆ కాంగ్రెస్ నాయకురాలికి వ్యతిరేకంగా విరుచుకుపడ్డారు ఆ చిల్లర వ్యాఖ్య మీద… ఈ దెబ్బకు ఆమె ఎంపీ టికెట్టు పోయింది, కాంగ్రెస్ ఆమెను సస్పెండ్ చేసింది… ఇప్పుడు తాజాగా ఏమిటంటే నేతాజీ మీద వ్యాఖ్య… ఇది కంగనాయే రగిలించింది…
చాలామందికి ఓ సందేహం… ఇదేమిటి, కంగనా తప్పులో కాలేసిందా..? ఏదో పిచ్చి ట్వీట్ కొట్టిందేమిటి అనుకున్నారు మొదట్లో… నేతాజీ ఏమిటి, మన దేశ తొలి ప్రధాని ఏమిటి అనేది ప్రశ్న… దీంతో నెటిజనం రెండుగా చీలిపోయారు… సహజంగానే యాంటీ బీజేపీ నెటిజన్లు విసుర్లు, వ్యంగ్యాలతో రెచ్చిపోగా, బీజేపీ అనుకూల క్యాంపు కూడా ఆమెకు మద్దతుగా నిలిచింది…
Ads
మళ్లీ ఆమే మరో ట్వీట్‌లో క్లారిటీ ఇచ్చింది… ఇలా…
సారాంశం ఏమిటంటే…? ‘‘అక్టోబరు 21, 1943లో నేతాజీ అని పిలవబడే ఫ్రీడమ్ ఫైటర్ సింగపూర్‌లో ఆజాద్ హిందు ప్రభుత్వాన్ని ప్రకటించాడు… (ప్రవాస ప్రభుత్వం) ఈ దేశానికి ప్రధానిగా సుభాష్ చంద్రబోస్ తనే ప్రకటించుకున్నారు… ఇది రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జరిగింది… కెప్టెన్ డాక్టర్ లక్ష్మి స్వామినాథన్ మహిళా విభాగానికి ఇన్‌చార్జి… అంతేకాదు, ఇండియన్ నేషనల్ ఆర్మీలోని రాణి ఝాన్సీ రెజిమెంట్‌కు కమాండర్… ఇందులో మొత్తం మహిళా సైనికులే ఉంటారు… ఇది ఆసియాలో తొలి మహిళా సైన్యం రెజిమెంట్…’’
ఇది చరిత్ర… అబద్ధాలు లేవు… నేతాజీ ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది నిజమే… ఐతే దేశం స్వాతంత్య్రం పొందాక ఏర్పడిన ప్రభుత్వంలో ఎవరు ప్రధానో వాళ్లనే మనం తొలి ప్రధాని అంటాం కదా… అదంతా కంగనాకు అనవసరం… నెహ్రూను లైట్ తీసుకోవాలి, నేతాజీని ఎత్తుకోవాలి… అంతే…
‘‘నన్ను విమర్శిస్తున్న వాళ్లు ఒకసారి ఈ చరిత్ర చదివి స్పందించండి… నేను రైటర్‌ను, నేను నటిని, నేను డైరెక్టర్‌ను’’ అని ఆ ట్వీట్‌లో పేర్కొంది… అంటే నాకే చెబుతారా అని ప్రశ్నిస్తోందన్నమాట… మొత్తానికి భలే కంట్రవర్సీ క్రియేటర్ తను..!!
Share this Article