కంగనా రనౌత్… బాలీవుడ్‌లో ఓ ఇంట్రస్టింగ్, ఫైటింగ్ కేరక్టర్… ఆమె వార్తలకు రీచ్ ఎక్కువ… సహజంగానే ఆమె ప్రెస్‌మీట్లకు ఎక్కువ మంది రిపోర్టర్లు హాజరవుతుంటారు,… కవరేజీ కూడా ఎక్కువే… అయితే కంగనా ప్రెస్‌మీట్‌ను తమకు అనుకూల ప్రచారం కోసం వాడుకుందామని అనుకున్న దీపిక పడుకోన్ పీఆర్ టీం కంగనా బ్లంట్ రెస్సాన్స్‌తో భంగపడిపోయింది…
బేశరం పాటతో దీపిక ఇజ్జత్ పోగొట్టుకుంది… జవాబులు చెప్పాల్సి వస్తుందనే భయంతో తను ప్రెస్‌కు కూడా దూరదూరంగా ఉంటోంది… కానీ ఆమె పీఆర్ టీం మాత్రం ఈ నెగెటివిటీని తగ్గించడానికి నానా పాట్లూ పడుతోంది… కంగనా ప్రెస్‌మీట్‌లో ఓ విలేఖరితో ప్రశ్న అడిగించారు ఆ టీఎం సభ్యులు… సదరు విలేఖరి బేశరం పాటలో దీపిక వేసుకున్న డ్రెస్సునూ (వల్గర్‌గా కనిపించే బికినీ) మహిళా సాధికారతతో లింక్ పెట్టి, మీ స్పందన ఏమిటి అనడిగింది…
‘ఎవరైతే తమను తాము సమర్థించుకోలేరో వాళ్ల కోసం నేను మాట్లాడతాను… ఆమెకు (దీపికకు) తనను తాను సమర్థించుకునే సామర్థ్యం ఉంది, తగిన వేదికలున్నాయి… ఇక్కడ ఆమె ప్రస్తావన దేనికి..? ఆ సినిమా ప్రచారం కోసమా..? ఇక కూర్చో…’ అని రిప్లయ్ ఇచ్చింది… సదరు విలేఖరి మారుమాట్లాడకుండా కూర్చుండిపోయింది… ఇప్పుడు ఈ వీడియో డిజిటల్ ప్రసార సాధనాల్లో వైరల్ అయిపోయింది…
Ads
ఇదుగో కంగనా సమాధానాలు ఇలా ఉంటాయి కాబట్టే ఆమె మీద విలేఖరులు, మీడియా స్వారీ చేయడానికి సందేహిస్తుంది… పైగా ఆమె బాబ్బాబు అని భయపడేరకం కాదు… అంతకుముందు ఆమె ఎమర్జెన్సీ సినిమా వివరాలు చెబుతూ… నా ఆస్తులు తాకట్టు పెట్టుకోవాల్సి వచ్చింది… ఈ సినిమా కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని చెప్పుకుంది… ‘‘డెంగ్యూ వచ్చింది, ప్లేట్‌లెట్స్ పడిపోయాయి, కానీ ఎక్కడా నా అనారోగ్యం వివరాలు బయట పెట్టలేదు, ఎందుకంటే, నన్ను ఆ స్థితిలో చూసి నవ్వేవాళ్లకు ఓ అవకాశం ఇవ్వవద్దని అనుకున్నాను…’’ అని చెప్పుకొచ్చింది…
నిజమే, ఆ టెంపర్ కూడా ఉందామెకు… తన బాధ తనంటే పడనివాళ్లకు ఆనందాన్ని కలిగిస్తుంది… అసలే తనకు బాలీవుడ్‌లో శత్రువులు ఎక్కువ… చిన్న అవకాశం దొరికినా సరే కంగనాను బదనాం చేయడానికి, కంగనా కూలిపోతే ఆనందపడటానికి రెడీగా ఉంటారు… వాళ్లకు ఆ ఆనందాన్ని ఇవ్వదలుచుకోలేదు ఆమె… మొండిది… అందుకే షూటింగ్ అయిపోయేవరకూ, ఆమె కోలుకునేవరకూ ఏ వివరాలూ బయటికి వెల్లడించలేదు… ఇందిరగాంధీ జీవితంలోని కొన్ని ముఖ్య ఘట్టాలతో ఆమె తీస్తున్న ఎమర్జెన్సీ మీద చాలా ఆశలు పెట్టుకుంది… అసలే ధాకడ్ సినిమా దారుణమైన ఫ్లాప్ ఆమెను కొంత ఫ్రస్ట్రేషన్‌కు గురిచేసింది… అందుకే తన సాధనసంపత్తి మొత్తాన్ని ఎమర్జెన్సీ మీద పెడుతోంది…
Share this Article