కంగనా రనౌత్ ప్రతి అడుగునూ ట్రోెల్ చేసే సెక్షన్ ఉంటుంది… ముంబై పొలిటిషియన్స్, బాలీవుడ్ మాఫియా మీద ఆమె కనబరిచే టెంపర్‌మెంట్, పోరాటం ఆమెకు చాలా మంది శత్రువులను తెచ్చిపెట్టింది… పైగా ఎవరినీ లెక్కచేయని తత్వం… దానికితోడు బీజేపీలో చేరి, తన సొంత రాష్ట్రం హిమాచల్‌ప్రదేశ్, మండి నుంచి ఎంపికయ్యాక శత్రువుల సంఖ్య రెట్టింపైంది ఆమెకు…
అప్పట్లో గుర్తుంది కదా… ఎవరో కాంగ్రెస్ నేత ‘మండీలో ఈరోజు రేటెంత ఉందో’ అని వ్యంగ్యంగా కంగనా రనౌత్ మీద ఓ నీచమైన కామెంట్ ట్వీటితే రచ్చ రచ్చ అయ్యింది… ఎందుకో కంగనా పేరెత్తితే చాలు వ్యంగ్య వ్యాఖ్యలు, తిట్లు అలా తన్నుకొచ్చేస్తాయి నెటిజన్లలో కొన్ని సెక్షన్లకు…
తాజాగా మరొకటి… తమ సమస్యల మీద నన్ను కలవడానికి వచ్చే వాళ్లు తప్పనిసరిగా తమ ఆధార్ కార్డు వెంట తెచ్చుకోవాలి, అలాగే సమస్య ఏమిటో, కలిసేందుకు వచ్చిన కారణమేమిటో ఒక కాగితం మీద రాసుకురావాలి, మనాలిలోని తన ఇంటికి కూడా ప్రజలు రావచ్చు, మండీ ప్రజలు నగరంలోని తన ఆఫీసుకు కూడా రావొచ్చు అని ప్రజలకు విజ్ఞప్తి చేసింది…
Ads
అందులోనే ఓ రీజన్ కూడా చెప్పింది… హిమాచల్ ప్రదేశ్‌కు చాలా మంది టూరిస్టులు వస్తుంటారు, అందుకని ప్రజల్ని ఆధార్ కార్డు తెచ్చుకోవాలని అడుగుతున్నాను అని చెప్పింది… గుడ్… కానీ వెంటనే కాంగ్రెస్ నేతలు మొదలెట్టారు, నాన్సెన్స్, ప్రజల్ని అవమానిస్తోంది ఆమె, ఆమె ప్రజాప్రతినిధి, ప్రజల్ని కలవడం, బాగోగులు చూడటం ఆమె బాధ్యత, ఇలా ఆధార్ కార్డు తెచ్చుకొమ్మనడం ఏమిటి అని విమర్శల బ్యాటింగ్ స్టార్ట్ చేశారు…
ప్రతిదీ రాజకీయం చేయాలనే తిక్క ధోరణి తప్ప, కంగనా చెప్పిందాంట్లో తప్పేముంది అసలు..? నేను ప్రజల్ని కలుస్తాను అనే అంటోంది, నన్ను ఎక్కడైనా కలవొచ్చు అంటోంది… అంతేతప్ప ఎవరో ఓ ప్రతినిధిని పెట్టేసి, ఏమున్నా సరే, తనకు చెప్పుకొండి అని వదిలేయడం లేదు… తనే స్వయంగా కలుస్తాను అంటోంది…
పైగా ఒక కాగితం మీద సమస్య ఏమిటో రాసుకొస్తే, వాటిని కన్సర్న్‌డ్ అధికారులకో, నాయకులకో వాటి ప్రతులు పంపించడానికి, అవి ఫైల్ చేసి, సక్రమంగా ఫాలో అప్ చేయడానికి వీలుంటుంది… ఎస్, ఆమెను చూడటానికి టూరిస్టులు వస్తే సమస్యల కోసం వచ్చిన ప్రజల విజ్ఞప్తులు డిస్టర్బ్ అవుతాయి… అందుకే స్థానికులమేనని చెప్పడానికి ఆధార్ కార్డు తెచ్చుకోవాలంటోంది…
తప్పు కాదు, పైగా సమస్యల విజ్ఞప్తుల మీద ఆధార్ నంబర్ వేయడానికీ వీలుంటుంది… ఆమె లెటర్ హెడ్ మీద సంబంధిత అధికారులకు సమస్యను, సంబంధితుల ఆధార్ నంబర్లతో సహా అధికారికంగానే లేఖలు రాయడానికీ బెటర్… సమస్యకు సంబంధించిన డాక్యుమెంట్ ప్రతులు కూడా తెచ్చి ఇస్తే ఇంకా బెటర్… సో, యువార్ రైట్ కంగనా…!!
Share this Article