.
కంగనా రనౌత్… చాలామందికి నచ్చకపోవచ్చుగాక… తను సాహసి… ఫైర్ బ్రాండ్… తన నటన, దర్శకత్వ ప్రతిభలకు మరో కోణం రాజకీయం… బాలీవుడ్ మాఫియా, శివసేన కక్షలకు, దాడులకు, బుల్‌డోజర్ కూల్చివేతలకు వ్యతిరేకంగా నిలబడి పోరాడింది… మరి మనం చెప్పుకునేది మరో పార్శ్యం… ఆసక్తికరం…
తనలోని పోరాట పటిమకు మూలం ‘ఆ మహాదేవుడే’ అని చాటిచెప్పే ఆమె… ఎంపీగా బాధ్యతలు నిర్వర్తిస్తూనే, గత పదేళ్లుగా నిశ్శబ్దంగా సాగిస్తున్న తన ఆధ్యాత్మిక ప్రయాణాన్ని అత్యంత భావోద్వేగంగా పూర్తి చేసింది…
Ads
కంగనా రనౌత్ ప్రయాణం పూల బాట కాదు… ఒకవైపు సినిమాల్లో ఒంటరి పోరాటం, మరోవైపు తన గళాన్ని నొక్కేయాలని చూసిన వ్యవస్థలు… ఈ ఒత్తిడిలోనూ ఆమె చెక్కుచెదరకుండా నిలబడటానికి కారణం ఆమెకు శివునిపై ఉన్న అచంచలమైన విశ్వాసం… గడిచిన పదేళ్లలో దేశంలోని ప్రతి మూలకూ వెళ్లి, ఆ పరమశివుని 12 రూపాలను దర్శించుకోవడం వెనుక ఆమె పడ్డ తపన సామాన్యమైనది కాదు…
చాలామందికి ద్వాదశ జ్యోతిర్లింగాలను దర్శించుకోవాలని ఉంటుంది… నటిగా, దర్శకురాలిగా, ఎంపీగా బిజీగా ఉంటూనే… ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని దర్శించుకోవడానికి ఆమెకు పదేళ్లు పట్టింది… ముందుగా ఆ ద్వాదశ జ్యోతిర్లింగాటేమిటో చూద్దాం… (చాలామందికి 12 జ్యోతిర్లింగాలేవో తెలియదు)…
ద్వాదశ జ్యోతిర్లింగ యాత్ర – సంపూర్ణ సమాచారం
| జ్యోతిర్లింగం | ప్రాంతం (రాష్ట్రం) | నదీ తీరం / విశిష్టత |
| సోమనాథ్ | గుజరాత్ | త్రివేణి సంగమం |
| మల్లికార్జున | ఆంధ్రప్రదేశ్ | కృష్ణా నది (శ్రీశైలం) |
| మహాకాళేశ్వర్ | మధ్యప్రదేశ్ | క్షిప్రా నది |
| ఓంకారేశ్వర్ | మధ్యప్రదేశ్ | నర్మదా నది |
| కేదార్‌నాథ్ | ఉత్తరాఖండ్ | మందాకినీ నది |
| భీమశంకర్ | మహారాష్ట్ర | భీమా నది (యాత్ర ముగింపు) |
| కాశీ విశ్వనాథ్ | ఉత్తరప్రదేశ్ | గంగా నది |
| త్ర్యంబకేశ్వర్ | మహారాష్ట్ర | గోదావరి నది |
| వైద్యనాథ్ | జార్ఖండ్ | జల రూప శివలింగం |
| నాగేశ్వర్ | గుజరాత్ | ద్వారక తీరం |
| రామేశ్వర్ | తమిళనాడు | హిందూ మహాసముద్ర తీరం |
| గృష్ణేశ్వర్ | మహారాష్ట్ర | చిట్టచివరి జ్యోతిర్లింగం |
భీమశంకర దర్శనం – ఒక దివ్య అనుభూతి
మహారాష్ట్రలో తన ఇంటిపై దాడులు జరిగినప్పుడు ఏ శక్తి అయితే ఆమెకు తోడుగా నిలిచిందో, అదే మట్టిలో ఈరోజు భీమశంకర జ్యోతిర్లింగాన్ని దర్శించుకుని తన జ్యోతిర్లింగ యాత్రను ముగించింది… “పురాతన లింగాన్ని దర్శించుకోవడానికి దొరికిన ఆ 10 నిమిషాలు నా జీవితంలో మరువలేనివి. ఇది నా పూర్వీకుల పుణ్యం, మహాదేవుని దయ” అంటూ కంగనా కన్నీటి పర్యంతమైంది…
ముగింపు…: వివాదాలు, విమర్శలు ఎన్ని ఉన్నా.. ఒక మహిళగా తను నమ్మిన సిద్ధాంతం కోసం, తన ఆధ్యాత్మిక తపన కోసం పదేళ్ల పాటు నిలకడగా శ్రమించడం నిజంగా స్ఫూర్తిదాయకం… గ్లామర్ ప్రపంచంలోని ఒక వ్యక్తి ఇంతటి గాఢమైన భక్తిని కలిగి ఉండటం నేటి తరానికి ఆసక్తికరమైన సందేశం… హర హర మహాదేవ్!
“మహాదేవుడి దయ, నా పూర్వీకుల పుణ్య కర్మల వల్ల ఈరోజు నేను 12 జ్యోతిర్లింగాల దర్శనాన్ని పూర్తి చేశాను… పదేళ్లకు పైగా సాగిన నా యాత్ర భీమశంకర దర్శనంతో ముగిసింది… మొదట్లో ప్రయాణాల్లో యాదృచ్ఛికంగా దర్శనాలు జరిగాయి… కానీ ఇటీవల గట్టి నిర్ణయం తీసుకుని అన్నింటినీ పూర్తి చేయాలనుకున్నాను…” అని కంగనా తన పోస్ట్‌లో పేర్కొన్నది…
భీమశంకర జ్యోతిర్లింగం ప్రత్యేకతను కూడా ఆమె వివరించింది… శివుడు, శక్తి ఇద్దరూ అర్ధనారీశ్వర రూపంలో ఒకే లింగంలో కొలువై ఉండటం ఇక్కడి విశిష్టత అని తెలిపింది… “రోజులో ఎక్కువ భాగం ఈ లింగమూర్తి వెండి కవచంతో కప్పబడి ఉంటాడు… కేవలం 10 నిమిషాలు మాత్రమే పురాతన లింగమూర్తిని చూసే అవకాశం దొరుకుతుంది… ఆ సమయంలోనే నేను దర్శనం చేసుకోగలిగాను… హరహర మహాదేవ్…” అని ఆమె రాసింది…
కొద్ది రోజుల క్రితం కంగనా గృష్ణేశ్వర్ జ్యోతిర్లింగాన్ని, అంతకుముందు వైద్యనాథ్ జ్యోతిర్లింగాన్ని కూడా దర్శించుకున్న కంగనా ఇప్పుడు భీమశంకర దర్శనంతో తన ఆధ్యాత్మిక యాత్రను సంపూర్ణం చేసుకున్నది…
Share this Article