బీజేపీ కొత్త ఎంపీ, నటి కంగనా రనౌత్‌ను ఎయిర్ పోర్టులో ఓ సీఐఎఫ్ జవాను కొట్టింది… ఎందుకు..? గతంలో ఢిల్లీలో ఆందోళనలు చేసిన రైతుల గురించి కంగనా ఏదో కామెంట్ చేసింది గతంలోనే… ఆ ఆందోళనల్లో ఈ సీఐఎస్ఎఫ్ జవాను తల్లి కూడా కూర్చున్నదట… కంగనా కామెంట్ ఈమెలో రగులుతూ ఉండిపోయింది… ఈమె కనిపించగానే ఒక్కటి పీకింది… సమయానికి ఆమె చేతిలో ఏ మారణాయుధమూ లేదు… ఉండి ఉంటే..? రేప్పొద్దున ఇంకెవరో మరెవరికో ఇలాగే తారసపడితే..?
ఖచ్చితంగా తప్పు… తప్పున్నర… ఆమె డ్యూటీ ఏమిటి..? ఏం చేసింది..? సరే, ఉన్నతాధికారులు ఆమెను సస్పెండ్ చేశారు, ఇలాంటివాటికి అలాంటివాళ్లు భయపడరు… ఒక ప్రధానినే తన అంగరక్షకులు హతమార్చిన ఉదంతం అందరమూ చూసిందే కదా… మరో ప్రధాని కాన్వాయ్‌ను ఓ చిన్న ఇరుకు బ్రిడ్జి మీద నిలిపేసి ఎస్పీజీని కూడా నిశ్చేష్టులను చేసిన సంఘటన కూడా చదివిందే కదా…
ఇక్కడ కంగనా రనౌత్ కామెంట్ ఏమిటనేది ముఖ్యం కాదు… సిక్కు సమాజంలో పెరిగిపోతున్న ఆ పాత వేర్పాటువాదం దాఖలా ఇది… ఇంతకుముందు కూడా చెప్పుకున్నదే… పంజాబ్‌లో రోజూ స్కోర్ వచ్చేది మీడియాలో… హిందువుల ఊచకోత నంబర్… భింద్రన్‌వాలేను ఖతం చేసేదాకా ఇదే స్థితి… ఇప్పుడు కెనడా పంజాబ్ ఉగ్రవాదానికి అడ్డాగా మారింది… ఆస్ట్రేలియా, బ్రిటన్ తోడయ్యాయి… హిందూ గుళ్ల దగ్గర అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి… అన్ రెస్ట్ ప్రబలుతోంది…
Ads
మాకు ప్రత్యేక దేశం కావాలి, మేం విడిగా బతుకుతాం అనే ధోరణి బలంగా వ్యాపిస్తోంది… సామదానభేదదండోపాయాల ప్రయోగంలో మోడీ ఫెయిల్యూర్… మోడీకి స్ట్రాటజిక్ పాలిటిక్స్ చేతకావు, అందుకే క్షమాపణలు చెప్పి మరీ రైతు చట్టాల్ని వెనక్కి తీసుకున్నాడు… కేజ్రీవాల్ వంటి నాయకుల మద్దతు కూడా లభిస్తోంది… ఇవన్నీ రాను రాను సీరియస్ ఇష్యూస్ కాబోతున్నాయి…
ఆందోళన ఏమిటంటే..? ఒక గోద్రా రైలు దుర్ఘటన జరిగాక గుజరాల్ అల్లర్లలో వేలాది మంది ముస్లింలు ఊచకోతకు గురయ్యారు… వాళ్లెవరికీ గోద్రాతో సంబంధం లేదు… కానీ మతం పడగవిప్పితే జరిగే అనర్థం అది… ఇందిరాగాంధీ హత్యకు గురైతే ఢిల్లీలో వేలమంది సిక్కులు హతమారిపోయారు… ఎవరో ఎక్కడో ఏదో ఘటనకు పాల్పడతారు… వాటి ప్రభావం ఎవరెవరి మీదో, ఎక్కడెక్కడో దారుణంగా విరుచుకు పడుతుంది… అదీ విషాదం…
ఎస్, ఏ సర్వసత్తాక సార్వభౌమ దేశమూ అంత తేలికగా వేరే దేశాన్ని అంగీకరించదు… పంజాబ్ ప్రత్యేక దేశమూ అంత తేలిక కాదు… నేపాల్ ఉగ్రవాదం చూశాం, శ్రీలంక ఉగ్రవాదం చూశాం… నిజమే, ఢిల్లీ ఆందోళనల్లో కేవలం పంజాబ్ రైతులు మాత్రమే ఎందుకు పాల్గొన్నారు..? ఖచ్చితంగా చర్చనీయాంశమే… ఆ ఆందోళనలకు మద్దతిచ్చిన ఆప్ ఏకంగా పంజాబ్‌లో అధికారమే చేజిక్కించుకుంది…
సో, ఇది అన్ని కోణాల నుంచీ సామరస్యం, సానుకూల ధోరణుల ఆధారంగా డీల్ చేయాల్సిన సబ్జెక్టు… ఆ దిశలో బీజేపీ ఒక పార్టీగా, ఒక ప్రభుత్వంగా ఫెయిలవుతుందనే భావన దేశమంతా ఉంది… ఇప్పుడైతే సంకీర్ణంలో పడిపోయి దాదాపు అచేతనావస్థలోకి చేరుకున్నట్టే… వాళ్లు ఆధారపడిన పార్టీల క్రెడిబులిటీ అది… మరి ఏమిటి పరిష్కారం..? కనుచూపు మేరలో ఎవరికీ ఏ దారీ కనిపించని దురవస్థ..!!
Share this Article