అట్నుంచి నరుక్కొస్తున్నారు… ఎట్నుంచి…? కర్నాటక నుంచి…! రెండు ప్రధాన పార్టీలూ అంతే… కర్నాటకలో కాంగ్రెస్ పలు గ్యారంటీ స్కీముల హామీలను ఇచ్చి, జనం వోట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చింది… దాదాపు అవే స్కీములను తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రయోగిస్తోంది… మొదట్లో జనంలోకి వెళ్లాయి ఆ స్కీముల హామీలు…
చివరకు కేసీయార్ సైతం తన మేనిఫెస్టోకు కాంగ్రెస్ మేనిఫెస్టోనే ఆధారంగా చేసుకున్నాడు… ఆ కాంగ్రెస్ హామీల్నే కాస్త అటూఇటూ సర్దాడు… పైగా 200 యూనిట్ల ఫ్రీ పవర్, మహిళలకు ఆర్టీసీ ప్రయాణం ఫ్రీ వంటివి మాత్రం అవాయిడ్ చేశాడు… అధిక సోషల్ పెన్షన్లు, చౌక సిలిండర్లు గట్రా మొత్తం కాంగ్రెస్ హామీలకు దాదాపు కాపీలే…
ఇప్పుడు బీఆర్ఎస్ మేనిఫెస్టో గురించి ప్రసంగాల్లేవు… కాంగ్రెస్‌ను ఇయ్యర మయ్యర తిట్టుడే… కాంగ్రెస్ కూడా అంతే, తన మేనిఫెస్టో గురించి గాకుండా బీఆర్ఎస్, కేసీయార్‌లను గట్టిగా జోపుతోంది… బీజేపీకి చెప్పుకోవడానికి మేనిఫెస్టోలో ఏమీలేదు… బీఆర్ఎస్‌ను తిడుతున్నట్టు నటిస్తూ, కాంగ్రెస్ పార్టీని మాత్రం మనస్పూర్తిగా తిట్టడానికి నానా ప్రయాస పడుతోంది… దాని బాధ దానిది…
Ads
చెప్పుకోదగిన సంఖ్యలో సీట్లు రావాలి, ప్రభుత్వం ఏర్పాటుకు కేసీయార్ తమపై ఆధారపడాలి… ఏ స్థితిలోనూ కాంగ్రెస్ బలపడకూడదు… అదీ బీజేపీ స్ట్రాటజీ… దీనికోసం చివరకు ఫాఫం పవన్ కల్యాణ్‌ను కూడా ఆలింగనం చేసుకుంది… సరే, ఎన్నికల ప్రచారాల్లో ఎవరి స్ట్రాటజీ వాళ్లకు ఉంటుంది కదా… కర్నాటకలో బోలెడు హామీలు ఇచ్చిన కాంగ్రెస్ వాటిని అమలు చేయలేక ఆపసోపాలు పడుతోంది అని బీఆర్ఎస్ ప్రచారం… (తన హామీలు కూడా ఆ దిశలోనే అలవిగాకుండా ఉన్నాయని మరిచిపోతున్నట్టుంది…)
కర్నాటక నుంచి రైతులట… వస్తున్నారు, ధర్నాలు, ఆందోళనలు… ఏమని..? కర్నాటకలో మమ్మల్ని మోసగించింది కాంగ్రెస్… అసలు 3 గంటలు కూడా కరెంటు ఇవ్వడం లేదు అంటూ..! తమ రాష్ట్రం విడిచి రైతులు సమూహాలుగా తెలంగాణ రైతులకు కర్తవ్యబోధ చేయడానికి వస్తారా..? ఎందుకు రారు..? బీఆర్ఎస్ కోసం వస్తారు… కాలేశ్వరం చూడటానికి రాలేదా టూరిస్టులు..? సేమ్, ఇదీ అంతే… ఇదేదో నెగెటివ్‌గా జనంలోకి పోతుందని కాంగ్రెస్ ఉలిక్కిపడింది…
కర్నాటక కాంగ్రెస్ మంత్రుల్ని రప్పిస్తోంది… ఎహె, బీఆర్ఎస్ ప్రచారం బోగస్… మేం హామీల్ని నెరవేరుస్తున్నాం… ఎక్కడా ప్రాబ్లమ్ లేదు అని చెప్పిస్తోంది… ఐనా ఆనడం లేదు… దాంతో ఈరోజు తెలంగాణ ఎడిషన్ల కోసం ప్రధాన పత్రికలకు ఫస్ట్ పేజీ, ఫుల్ పేజీ కలర్ యాడ్స్ జారీ చేసింది… హామీలను అద్భుతంగా అమలు చేస్తూ అప్పుడే ఆరు నెలలు గడిచిపోయాయ్ అంటూ కర్నాటక ప్రభుత్వ ఖర్చుతోనే తెలంగాణ ఎన్నికల ప్రయోజనాల కోసం యాడ్స్ ఇచ్చింది… కేసీయార్ పదే పదే చెప్పే తెలంగాణ మోడల్‌కు విరుగుడుగా కర్నాటక మోడల్ అని పాట స్టార్ట్ చేసింది… అందుకే అందరూ అట్నుంచే నరుక్కొస్తున్నారు అని చెప్పేది…!! ಯಾವ ರಾಜಕೀಯ?
Share this Article