Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ప్రభాస్ పాత్ర, క్లైమాక్స్… కన్నప్పను బలంగా నిలబెట్టాయి…

June 27, 2025 by Rishi

.

కన్నప్ప సినిమా ఎలా ఉంది..? సూటిగా సుత్తి లేకుండా…. ఇది ఒక మామూలు కథను వాణిజ్య కోణంలో నానా సినీ మసాలాలు దట్టించి పాన్ ఇండియా రేంజ్ క్రియేట్ చేసి, జనంలోకి వదిలారు…

బాగాలేదా…? బాగున్న అంశాలు ఉన్నాయ్… బాగాలేనివీ ఉన్నాయ్… కృష్ణంరాజు చేసిన భక్త కన్నప్ప కథలోనే బోలెడు అంశాలు, డ్రామా కోసం క్రియేటివ్ లిబర్టీ తో గుప్పించారు….

Ads

అది చూసిన తరానికి ఇది నచ్చకపోవచ్చు… కృష్ణంరాజు వారసుడు ప్రభాస్ చేయాల్సిన సినిమా ఇది… కానీ ఒక ప్రధాన పాత్రకు పరిమితమై మంచు ఫ్యామిలీకి త్యాగం చేశాడు…

ప్లస్… ప్రభాస్ లేకుండా సినిమా లేదు… తను ఎంటర్ అయ్యాకే సినిమా పైకి లేచింది… సినిమాను నిలబెట్టింది ప్రభాసే… ఎస్, మంచు విష్ణు నుంచి ఈ నటన expect చేయలేదు… సూపర్… క్లైమాక్స్ లో అదరగొట్టాడు…

మోహన్ బాబు ఫ్యామిలీ అనేసరికి చాలామంది నెగెటివ్ గా చూస్తుంటారు… ఆ ప్రభావం కూడా సినిమాపై కొంత ఉండొచ్చుగాక… కానీ సినిమాను సినిమాగా మాత్రమే చూస్తే కొన్ని తప్పులు ఉన్నాయ్…

మోహన్ లాల్, మోహన్ బాబు, అక్షయ్, కాజల్, మధుబాల, విష్ణు పిల్లలు… చివరికి హీరోయిన్ కూడా చిన్న చిన్న వాల్యూ ఆడిషన్స్ మాత్రమే…. మంచు విష్ణులో మంచి నటుడు ఉన్నాడని ప్రూవ్ చేసుకున్నాడు… ప్లస్ ప్రభాస్ ఇమేజ్, ఇంపాక్ట్ రేంజ్ ఏమిటో కూడా మరోసారి నిరూపితం…

ఒక నాస్తికుడు మరీ మూఢ భక్తుడిగా మారే ఒక చిన్న కథకు అనేకానేక కల్పనలు జతచేసి, యాక్షన్ సీన్స్ పెట్టి, చివరకు హీరోయిన్ కు కురచ బట్టలు తొడిగి… పెద్ద పెద్ద స్టార్ ను ప్రవేశపెట్టి… నానా వేషాలు వేశారు…

తీరా చూస్తే ఒక రొటీన్ తెలుగు లేదా ఇండియా సినిమాలా మార్చారు… దానితో భక్తి తాలూకు ఉద్వేగం కలిగించదు… ఆ లోతు లేదు…

తిన్నడి తెలిసిందే… ఐతే కొత్తగా చెప్పాలి… అది గతంలో బాపు చేయగలిగాడు… ఈ దర్శకుడికి చేతకాలేదు… కాకపోతే చివరి అరగంట బాగా రక్తి కట్టింది కాంతారా టైపులో… అదొక్కటే సినిమాకు బలం… ప్రభాస్, క్లైమాక్స్ లేక ఈ కన్నప్ప జీరో…

మరీ ఫస్టాఫ్ స్లో, వెరీ స్లో, అసలు ఈ సినిమాకు ఎడిటర్ లేడా… సేమ్ కుబేర టైపులో 3 గంటల సినిమా…

నిర్మాతగా విష్ణు మంచి ప్రయత్నం… కాదు, భారీదనం… సాహసం… రిస్క్… ఇంకా ఏమున్నాయి..?

న్యూజీలాండ్ లొకేషన్స్ అదిరాయి… BGM అదిరింది… VFX పూర్… ప్రీతి ముఖుందన్ అందంగా ఉంది… నటన పర్లేదు…

రుద్రుడిగా లుక్ బాగుంది… పూర్తిగా భిన్నమైన దర్శనం… మోహన్ లాల్ చిన్న పాత్రే… తమిళ సీనియర్ నటుడు శరత్‌కుమార్‌కి మంచి స్క్రీన్ టైమ్ ఉంది… ఆ పాత్రకు సరిగ్గా సరిపోయాడు…

అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్ జస్ట్ ఓకే … మిగతా తారాగణం కూడా సో సో… తిన్నడు ఎందుకు నాస్తికుడో ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు ఫస్టాఫ్ మొత్తం తినేశాడు… అదే ఈ సినిమాకు పెద్ద మైనస్… కాకపోతే సెకండాఫ్ లో ఆ మైనస్ పూడ్చి ప్లస్ లోకి తీసుకొచ్చాడు…

అక్కడక్కడా కొన్ని హై సీన్స్ పడ్డాయి గానీ స్థూలంగా ఆ నిర్మాణ వ్యయానికి తగిన ఔట్ పుట్ ఇచ్చినట్టు అనిపించదు… మోహన్ బాబు పరిచయాలు, వాయు లింగం కోణం ప్రారంభంలో ఆసక్తిని రేకెత్తించినప్పటికీ, కథనం ఆ ఊపును నిలబెట్టడంలో పెద్దగా సహాయపడదు….

ప్రధానంగా దర్శకుడు చాలా రిలాక్స్డ్ కథన శైలి కారణంగా సుదీర్ఘ రన్‌టైమ్ ఉన్నప్పటికీ, ఈ చిత్రం అవసరమైన భావోద్వేగ, నాటకీయతను కోల్పోయింది…

పదునైన, లోతైన, మార్మిక డైలాగులను రాయించుకోలేదు… అదొక మైనస్… వాయులింగం అనే కొత్త పాయింట్ మొదట్లో ఆసక్తి రేపినా మరీ భారీ యుద్ధాలు అతి అనిపిస్తాయి…

ప్రీతి ముకుందన్ అందం, న్యూజీలాండ్ లొకేషన్స్, ప్రభాస్ పోర్షన్, క్లైమాక్స్… ఇవే సినిమా బలాలు… ఇక చెప్పడానికి ఏమీ లేదు…

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • ప్రభాస్ పాత్ర, క్లైమాక్స్… కన్నప్పను బలంగా నిలబెట్టాయి…
  • సినిమా పాత్రల్లో రాడికల్… నిజజీవితంలో బోలెడన్ని మూఢనమ్మకాలు…
  • రష్యాలో విష్ణుమూర్తి విగ్రహం… అది తెలియజెప్పే కొత్త చరిత్ర… తెలియని కథ…
  • అభిమానం వెర్రితలలు..! గాయని చిత్ర భుజానికి గాయం..!
  • టీచింగ్ వృత్తి కాదు… విలువల జాతి నిర్మాణం… ఈ చిన్న కథ విన్నారా..?!
  • ఇండస్ట్రీ అంతే… టాలెంట్ టన్నుల్లో ఉన్నా సరే టైమ్ కలిసిరావాలి…
  • మరణాల్ని మేం ముందుగానే రికార్డ్ చేస్తాం… డెడ్లీ డెడ్‘లైన్స్’ మరి…
  • అంబుబాచీ మేళా… కామాఖ్య గుడి తలుపులు తెరుచుకున్నయ్…
  • నీడనూ నమ్మలేనితనం… క్షణక్షణమూ అభయం కాదు, ఆ భయమే..!!
  • రోదసి ప్రయాణికుడు శుభాంశు శుక్లా సరే… మరి ఈ ప్రశాంత్ నాయర్..?!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions