.
కన్నప్ప చిత్రం ఆహా ఓహో అనే టాక్ స్టార్ట్ చేశారు మొదట్లో… ప్రభాస్ ఎంట్రీ ప్లస్ చివరి అరగంట విష్ణు నటన లేకపోతే ఈమాత్రం జనం థియేటర్లకు రాకపోయేవాళ్లు… అది రియాలిటీ…
ఎక్కడో చదివాను స్థూలంగా కన్నప్ప పేరిట 110 కోట్ల వరకూ నష్టాలు మూటగట్టుకోనుందని..! టాక్‌తో సంబంధం లేదు, తెలుగులో కాస్త నయం, మిగతా భాషల్లో అట్టర్ ఫ్లాప్… ఎందరు భారీ తారాగణం ఉంటేనేం..? అసలు అన్ని భాషల స్టార్లు ఉంటే అది భారీ పాన్ ఇండియా సినిమా అనే ప్రాథమిక కాన్సెప్టే తప్పు…
Ads
- అందరు తారల్ని అకామిడేట్ చేసి, వాళ్లకు తగిన ప్రాధాన్యం ఇవ్వడానికి కేజీఎఫ్, బాహుబలి మార్క్ భారీ సీన్లను తీసుకొచ్చారు… తెగల నడుమ మరీ కురుక్షేత్రం తరహా యుద్ధాలు… వెగటు దుస్తుల కథానాయికతో కాస్త శృతి మించిన రక్తి… వెరసి అది భక్తి సినిమా గాకుండా ఏదో రొటీన్ కమర్షియల్ వాసనల తెలుగు సినిమా అయిపోయింది…
సరే, దాని జోలికి ఎందుకులే గానీ… ఆఫ్టరాల్ 120 కోట్ల సినిమానే జనం ఇలా తిరస్కరించారూ అంటే… ఇక రాబోయే రామాయణం మాటేమిటి..? మొదట్లో 850 కోట్లే అన్నారు… ఇప్పుడు 4 వేల కోట్ల భారీ ఫిగర్ చెబుతున్నారు దాని నిర్మాణ వ్యయం… ఏమో… టాక్స్ ఎగవేతలు, బ్లాక్ టు వైట్ బాపతు యవ్వారాలు ఏమున్నాయో…
- ఆదిపురుష్, బాహుబలి ఎట్సెట్రా బాగోతాలు విన్నవే కదా… గ్రాఫిక్స్ పేరిట భారీ వ్యయాన్ని కావాలని చూపించడం..! మరీ ఆదిపురుష్ అయితే అన్ని కోణాల్లోనూ దారుణం, నాసిరకం… మన పురాణాలకు వక్ర బాష్యాల, పిచ్చి వేషాల అపచారం కూడా..! ప్రభాస్ సినిమా కెరీర్‌లో ఓ పెద్ద చేదు మరక…
పౌరాణిక వాసనలున్న సినిమాలతో జాగ్రత్త అవసరం… కల్కి చూశాం కదా… అంతటి తెలివైన దర్శకుడు కూడా తను ఏం తీశాడో తనకే అర్థం కాలేదు చివరకు ఫాఫం… భారీ ఖర్చు, భారీ తారాగణం… అసలు ఒక ఇండియన్ సినిమా కలెక్షన్ల రేంజ్ ఎంత..?
నిజానిజాల జోలికి మరీ వెళ్లనక్కర్లేదులే గానీ… రికార్డుల్లో రాసుకున్న మేరకు దంగల్ 2 వేల కోట్లు, బాహుబలి-2 1700 కోట్లు… మరి 4 వేల కోట్ల ఖర్చుకు ఎంత వసూళ్లు రావాలి..? సాధ్యమేనా..? ఈ చర్చ నడుస్తోంది ఇప్పుడు ఇండియన్ ఫిలిమ్ సర్కిళ్లలో… అసలు ఈ నిర్మాణ వ్యయాల లెక్కలు కరెక్టేనా..? ఏమైనా మర్మాలున్నాయా..? మరీ కన్నప్ప ఫెయిల్యూర్ ఈ చర్చలను మరింత పెంచింది…
- కేవలం గ్రాఫిక్స్‌తో సినిమాలు నడవవు… కేజీఎఫ్ బాపతు కంటెంటు భక్తి సినిమాలకు పనికిరాదు… కన్నప్ప నేర్పిన పాఠం ఇదే… ఇక్కడ ఓ చిన్న విషయం చెప్పి ముగిద్దాం… ధూర్జటి రాసిన కాళహస్తీశ్వరుడి కథ ఆధారంగా అప్పుడెప్పుడో 1954లో… 70 ఏళ్ల క్రితం… కన్నడ రాజకుమార్ బేడర కన్నప్ప తీశాడు, తనకు డెబ్యూ… పండరీబాయికి కూడా, మూవీ బంపర్ హిట్…
దాన్ని తమిళంలోకి వేడన్ కన్నప్ప పేరిట డబ్ చేశారు… దీన్నే తెలుగులో కాళహస్తి మహాత్యం పేరిట రీమేక్ చేశారు… రాజకుమార్ తన జీవితంలో చేసిన ఏకైక కన్నడేతర సినిమా… పద్మనాభం, రాజసులోచన, రుష్యేంద్రమణి తదితరులూ కనిపిస్తారు… ఎందుకు చెప్పుకోవడం అంటే..?
- ఫేస్‌బుక్‌లో ఆ సినిమా బిట్స్‌ను వోల్గా సంస్థ పోస్ట్ చేస్తోంది… ఎంత బాగున్నాయో… రాజకుమార్ ఎంత మంచి నటుడో, ఆ సీనిమాలోని సీన్లు భక్తిభావనల్ని ఎంత బ్రహ్మాండంగా ఆవిష్కరించాయో తెలుస్తుంది… కృష్ణంరాజు భక్త కన్నప్ప బిట్లు కూడా కనిపిస్తున్నాయి… ఇందులోనూ కొంత రొమాన్స్ ఉన్నా, స్థూలంగా భక్తిని ఎక్స్‌పోజ్ చేసేదే…
అవి చూస్తుంటే ఈ మంచు కన్నప్పను ఎంత నిర్లక్ష్యంతో చుట్టేశారో కదానే అసంతృప్తి… పౌరాణికాల్ని తీయాలంటే తెలుగువాళ్లే అనే మంచి పేరు ఎక్కడో ఎగిరిపోయింది… ఆదిపురుష్ మరీ నాసిరకం… సో, 4 వేల కోట్లు అనే ఫిగర్ అనగానే ఇవన్నీ గుర్తొచ్చాయి… భారతీయ సినిమాకు సంబంధించి అతి పెద్ద పందెం..!!
Share this Article