.
సరే, ఓ టీజరో, ఓ గ్లింప్సో చూసేసి… ఒక సినిమా పాట నాణ్యతను పూర్తిగా చెప్పలేం… కానీ మెతుకు వొత్తి చూస్తే అర్థమైపోతుంది కాస్త… ఆ పాట ఉడికిందో లేదో చెప్పడానికి…
కన్నప్ప సినిమాకు సంబంధించి గతంలోనూ కొన్ని హాశ్చర్యాలు చెప్పుకున్నాం.,. తాజాగా మోహన్‌బాబు వేష్తున్న మహాదేవ శాస్త్రి పాత్రను పరిచయం చేస్తూ ఓం నమఃశివాయ గ్లింప్స్ రిలీజ్ చేశారు… వోకే, ఆ పాత్రకు తగిన ఆహార్యం, లుక్కు బాగున్నాయి గానీ…
Ads
ఇంత భారీ ఖర్చు పెట్టి సినిమా తీస్తున్నారు… ఈ పాటకు ఏకంగా శంకర్ మహదేవన్‌ను తీసుకున్నారు… అయితే సుద్దాల అశోక్ తేజతో గాకుండా ఇంకెవరితోనైనా పాట రాయించాల్సింది అనిపించింది… ఎవరైనా కొత్తవాళ్లతో రాయించినా బాగుండేదేమో…
ఎందుకంటే..? ఆ నాలుగైదు చరణాలు వింటుంటే… ఆయన ఏం రాశాడో ఆయనకైనా అర్థమైందా అనిపించేలా ఉంది… ఈ సకల లోకాలకు నీవే శ్రీకారం అంటాడు ఓచోట… నిజానికి శివుడు లయకారుడు… తను ఎలా శ్రీకారం అవుతాడు… సింపుల్ లాజిక్..? త్రిమూర్తుల్లో పుట్టించేది బ్రహ్మ… లయం చేసేవాడు శివుడు…
శంకర్ మహదేవన్ అనగానే మనకు మహాప్రాణదీపం అని శంకరుడిని కీర్తించే బ్రెత్‌లెస్ పాట గుర్తొస్తుంది… సూపర్ అది… కానీ ఇందులో పలుచోట్ల ఆర్కెస్ట్రా మోత కారణంగానో జటధారి, జడధారి… స్వీకారం, శ్రీకారం వంటి పదాల దగ్గర ఉచ్చారణ సరిగ్గా లేదు… అఫ్‌కోర్స్, అక్కడ ఆ పాటలో ఈ పదాల నడుమ పెద్ద అర్థభేదమేమీ లేదు…
ద్విజస్థంభం అనే ప్రయోగం బాగుంది… అంటే బ్రాహ్మల్లో స్థంభంలాంటివాడని చెప్పడానికి… ధ్వజస్థంభం అని కూడా స్పురించేలా…! (కొంపదీసి ధ్వజస్థంభం అని రాస్తే శంకర్ మహదేవన్ అలా ద్విజస్థంభం అని పాడేశాడా..?) ఉగ్రశాస్త్రి, రుద్రశాస్త్రి వంటి సినిమాటిక్ పదాలు ఎలా ఉన్నా… ఓవరాల్‌గా పంచ్ బలంగా లేదనిపించింది…
భువి భాండమందు శివమే అన్నాడు సరే, దివి కాండమందు శివమే అంటాడు వెంటనే… దివి కాండం… ఇదేం ప్రయోగమో… నవ్వొచ్చింది… నిన్ను తాకి దూకిన నింగి గంగ స్వర తరగలందు శివమే అంటాడు… నింగి గంగ, తరగలు వరకు బాగానే ఉంది గానీ, నడుమ స్వరం ఎందుకు చేరింది… ఓ అపస్వరంలాగా… అక్కడ స్వరప్రస్తావన దేనికి..? హేమిటో…
ట్యూన్ బాగుంది… స్టీఫెన్ దేవస్సి స్వరకల్పన బాగానే ఉన్నట్టనిపిస్తోంది… ఎటొచ్చీ లిరిక్స్‌తోనే..! బేసిక్‌గా శివుడి మీద పాట రాయాలంటే ముందుగా శివతత్వం ఏమిటో తెలిసి ఉండాలి కదా కనీసం… ఐనా ఏముందిలే.? సినిమా పాటే కదా… చల్తా… చల్నేదే బాల్‌కిషన్…
Share this Article