‘‘సార్, మన తెలంగాణలో దేవుడు పట్టిండు అంటాం కదా… ఒక్కసారి దేవుడు దేహం మీదకు వస్తే తను మస్తు శక్తిని ఆవాహన చేసుకుంటాడు… అప్పటిదాకా బిస్కెట్ కటుక్కుమని కొరకలేదని పళ్లు ఓ గొర్రె మెడనో పుటుక్కున కొరికేస్తయ్… అగ్నిగుండం మీద నడుస్తాడు…
ఎహె, ఇదంతా ఫేక్, బోగస్ అనేవాళ్లు ఉంటారు… మనం కళ్లారా చూసినవి బోలెడు… సేమ్, ఈ సినిమాలో కూడా చివరి అరగంట హీరోను భూతకోల పట్టుకుంటుంది… ఇక చూసుకోండి… మీరు నమ్మరు ఇప్పటికీ ఏ సినిమాలోనూ చూడలేదు… థియేటర్లో కేకలు… శిగాలు…
ఎండ్ కార్డ్ పడ్డాక కూడా ఇంకా ఏదో సీన్ వస్తుందని ప్రేక్షకులు లేవడం లేదు… ఔత్సాహిక ఇండస్ట్రీ వర్కర్ నేను… ఆ క్లైమాక్సుకి లాజిక్ ఉండదు… కానీ అందరిలాగే లేచి చప్పట్లు కొడుతూ, తెర మీద నుంచి కళ్ళను డైవర్ట్ చేయలేదు… Never, ఇప్పట్లో రిషబ్ శెట్టిని మర్వలేను… పార్కింగ్ కు వచ్చాక ఓసారి గట్టిగా అరిచి రిలాక్స్ అయిపోయాను… ఆ BGM చెవుల్లో గింగురు మంటూనే ఉంది…
Ads
నిజంగా good editing, good bgm, good camera, good direction, good action… ఎలా ఉండాలో చెప్పింది… సినిమాను అవి ఎలా లేపుతాయో ఈ సినిమా చూపించింది… మా టీమ్ తో నాలుగు సార్లు వెళ్ళాను… ఈ సినిమా ఒక పాఠం…” ఇదీ ఒక మిత్రుడి భావోద్వేగం… కూల్ గా ఉంటాడు… కానీ ఇప్పుడు ఊగిపోతున్నాడు…
ఎప్పుడో గతంలో హీరో తండ్రి బూత్ కోల (భూత కళ..?) యక్షగాన వేషం వేసేవాడు… అక్రమార్కులు అటవీ భూమి కాజేస్తారు… కొన్ని తరాల తర్వాత హీరో శివ… అడవంటే పానం, ఆటలంటే పానం… కంబాలా ఆట కోసం బురద పొలంలోకి దున్నపోతులతో దిగితే కొట్టేవాడు లేడు… లీల అని ఒక లవర్… మళ్లీ అడవి మీద డేగల పంజా… ఇక rishab చనిపోయినట్టే అనుకున్నాక… అప్పుడు ఇక అసలు క్లైమాక్స్… అదేమిటో ఇక్కడ చెప్పను… కానీ ఒక్కసారిగా సౌత్ హీరోల ముసలి మొహాలు, బిల్డపులు గుర్తొచ్చి నోరంతా చేదు… వాళ్లకు పాద పూజలు దేనికిరా…
ఓ మిత్రుడి మెసేజ్ …. సార్ RRR చేతుల్లో కన్నడ సినిమా సేఫ్… ఇంకా చూస్తూ ఉండండి… Rishab Shetty, rakshit Shetty, Raj B Shetty… ఒకప్పుడు కన్నడ సినిమా అంటే ఉత్త నాసిరకం… ఇప్పుడు దేశం అటువైపే చూస్తోంది… అబ్బుర పడుతోంది… పోన్నియిన్ సెల్వన్ తమిళ్ pride, కంతారా kannada Pride… ఒక్కసారి మన హీరోల్లో ఒక్కరు కంబాల ఆడితే చూడాలని ఉంది… అసలు ఈ శెట్టిలే కాదు, అనుష్క శెట్టి, రష్మిక మంధన, ఐశ్వర్యరాయ్ తదితరులంతా తుళు ప్రాంతీయులే… ఈ సినిమా కూడా తుళు ప్రైడ్…
Revolving machine guns, గ్రాఫిక్స్ కాదు… Rishab ఎదుట దసరా పూర్నీలు, దీపావళి తోక పటాకులు… అంటే సినిమాలో మైనస్ ఏమీ లేవా… ఉన్నాయ్… క్లైమాక్స్ అవన్నీ కడిగేస్తుంది… ఒక సినిమాను బలంగా మెచ్చుకోవడం రేర్… ఛాన్స్ వచ్చింది… అది ఆ నిర్మాతలకు కూడా అనిపించింది… హిందీ వెర్షన్ రిలీజ్ చేస్తున్నారు… తెలుగులో కూడా చేస్తే బాగుండేది… ఎవరికో ముందే రీమేక్ రైట్స్ అమ్ముకున్నట్టున్నారు…!! చెప్పలేదు కదూ… రిషబ్ హీరోగా తనే, director గా తనే ఇందులో.. అసలు తెలుగు సబ్ టైటిల్స్ కే ఇంత సీన్ ఉంటే… నిజంగా తెలుగులో మాటలు ఉండి ఉంటే…!! (Inputs from azahar sheik)
Share this Article