Subramanyam Dogiparthi…. పౌరాణిక జానపద సినిమా . భార్య హేమ పేరుతో కాంతారావు ప్రారంభించిన హేమా ఫిలింస్ ఆధ్వర్యంలో నిర్మించిన మొదటి సినిమా 1969 లో వచ్చిన ఈ సప్తస్వరాలు సినిమా . ఆరోజుల్లోనే ఆరు లక్షల రూపాయల నష్టం వచ్చిందట . కర్ణుడి చావుకు ఆరు కారణాలని అంటారు . అలాగే నష్టం ప్రాప్తమయితే అన్ని వైపుల నుండి నష్టకష్టాలు చుట్టుముట్టుతాయి .
ఈ సినిమా రిలీజప్పుడే చెన్నారెడ్డి గారి సారధ్యంలో ప్రత్యేక తెలంగాణ ఉద్యమం ప్రారంభమయింది . తెలంగాణా అంతా రాత్రి సెకండ్ షోలు రద్దు అయ్యాయి . ఆంధ్రాలో కాంతారావు తెలంగాణా వాడని ప్రచారం జరిగి ఆంధ్రా వాళ్ళు చూడలేదట . వీటికి తోడు బలహీనమైన కధ . వెరశి కాంతారావుకు ఘోరమైన నష్టాల కష్టాలు . ఇంక సినిమాకొస్తే :
ప్రముఖ దర్శకులు వేదాంతం రాఘవయ్య దర్శకత్వంలో నిర్మించబడిన ఈ సినిమాలో కాంతారావు , రాజశ్రీ , విజయలలిత , ధూళిపాళ , సత్యనారాయణ , బాలకృష్ణ , రాజబాబు , విజయనిర్మల , మీనాకుమారి , జ్యోతిలక్ష్మి , నాగయ్య ప్రభృతులు నటించారు .
విలన్ గా ముందు రాజనాలనే సంప్రదించారట . రాజనాలకు ముహూర్తాలు , నమ్మకాలు ఎక్కువ . సంప్రదించిన సమయం బాగాలేదు ; స్క్రిప్ట్ వినను అని పక్కన పడేసారట . అలా పడేయటం కాంతారావుకు నచ్చక , సత్యనారాయణను విలన్ గా పెట్టుకున్నారట .
టి వి రాజు సంగీత దర్శకత్వంలో కొన్ని పాటలు ఇప్పటికీ హిట్టే . అదే నీవంటివి అదే నేనింటిని , కృష్ణయ్యా గడసరి కృష్ణయ్యా పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . వెంపటి సత్యం నృత్య దర్శకత్వంలో విజయలలిత నృత్యాలు బాగుంటాయి .
మా నరసరావుపేటలో ఒక్కసారే చూసా . తర్వాత టి విలో ఒకసారి చూసా కాసేపు . యూట్యూబులో ఉంది . కాంతారావు అభిమానులు యూట్యూబులో చూడవచ్చు .
టైం బాగుండనప్పుడు : సిరిదా బోయిన బోవును కరి మింగిన వెలగపండు కరణిని సుమతీ . నాకు బాగా తెలుసు .
Share this Article
Ads