Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

ఆ జంట టవర్లలాగే… 54 విల్లాల రిసార్ట్ కూల్చివేత షురూ… ఆ కథ ఇదీ…

September 18, 2022 by M S R

నొయిడాలో అక్రమంగా నిర్మించిన జంట టవర్లను పేలుడు పదార్థాలు పెట్టి మరీ పేల్చేశారు మొన్న… చూశాం కదా… నిజానికి దేశంలో కొన్ని లక్షల అక్రమ నిర్మాణాలు… ప్రభుత్వమే క్రమబద్ధీకరిస్తూ ఉంటుంది… ప్రభుత్వ అధికారులే లంచాలకు మరిగి అనుమతులు ఇస్తుంటారు… కానీ అప్పుడప్పుడూ కోర్టు కొరడా పట్టుకుంటుంది… అప్పుడిక ఏ వ్యవస్థా రక్షించలేదు… ఆ టవర్ల కూల్చివేతే దానికి సాక్ష్యం… అచ్చం అలాంటిదే… కాదు, అంతకుమించి ఓ కూల్చివేత ప్రారంభమైంది… అదీ మన తెలుగు ఐఏఎస్ కృష్ణతేజ సారథ్యంలో…

మన మెయిన్ స్ట్రీమ్ మీడియాకు ఇంకా సోయి లేదు… కానీ కేరళలో మీడియా టాంటాం చేసేస్తోంది… సోషల్ మీడియా నయం… కాస్త మెచ్చుకుంటోంది… అసలు కథేమిటో చెబుతోంది… కేరళలోని అలెప్పీ జిల్లాలో అది వెంబనాడ్ సరస్సు… కేపికో రిసార్ట్స్… ఆ నీటి మధ్యలో మూడెకరాల దీవిని, ఆ భూమిని అక్రమించేసి బ్రహ్మాండంగా కట్టబడిన రిసార్ట్స్… రాజకీయాలు, అధికార మద్దతున్న కార్పొరేట్ శక్తులు… మొత్తం 54 అత్యంత విలాసవంతమైన విల్లాలు… సామాన్యులకు నో ఎంట్రీ… ఒక రాత్రి అక్కడ గడపాలంటే రేటు 55 వేలు… ముత్తూట్ నుంచి కువైట్ దాకా పాకిన ప్రబల శక్తులు అవి…

అవసరమున్నవాళ్లను అడ్డంగా మేపి, మూడు ఎకరాలకు అనుమతులు తెచ్చుకుని, పదెకరాల్ని కాజేశారు… కాస్త సోయి తెలిసిన మత్స్యకారులు అడిగితే నోళ్లుమూశారు… ఐదుగురు కుర్రాళ్లు మాత్రం వెనక్కి తగ్గలేదు… దిగువ కోర్టుల నుంచీ ఫైట్ చేసుకుంటూ నిలబడ్డారు… వాళ్లకు ప్రకృతి ప్రేమికులు తోడయ్యారు… ఆ కేసు పూర్వాపరాల్లోకి పూర్తిగా, లోతుల్లోకి వెళ్లి, సీఆర్‌జెడ్ ఉల్లంఘనల గురించి చర్చించడం లేదు కానీ… సుప్రీం కోర్టు వాటిని కూల్చేయమంది… కానీ ఎవరు అమలు చేయాలి..? అది కదా అసలు ప్రశ్న…

Ads

kapico… (Photo Credits :: manorama)

ఎప్పటికప్పుడు ఏదో కుంటిసాకులు… నడుమ రెండేళ్లు కరోనా… కానీ ఇప్పుడు వచ్చిన మన మైలవరపు కృష్ణతేజ టెంపర్, గట్స్ తెలుసు కదా… బుల్ డోజర్లను నడిపించాడు… వారం క్రితం… ఆ రిసార్టు భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటున్నట్టు ప్రకటించాడు… అన్ని స్థాయిల్లో బెదిరింపులు, బుజ్జగింపులు… సుప్రీంకోర్టే చెప్పాక ఆగడం దేనికి..? ముందుకు వెళ్లడానికే కృష్ణతేజ నిర్ణయించుకున్నాడు… ఏం జరిగితే అది జరగనీ…

ఇప్పుడు ఆ విల్లాల కూల్చివేత ప్రారంభమైంది… అదీ ప్రభుత్వం ఖర్చు కాదు… ఆ కూల్చివేతకు అయ్యే ప్రతి పైసా ఖర్చును సదరు అక్రమార్కుల నుంచే వసూలు చేయనున్నారు… ఆ ఓనర్లే భరించాలి… కూలిన శిథిలాల్లో రాయీరప్పాబెడ్డా ఆ సరస్సులో పడ్డా సరే ఊరుకునేది లేదన్నాడు… వాటి తరలింపు ఖర్చు కూడా ఓనర్లదే… ఇన్నాళ్లూ కాలర్లు ఎగరేసిన శక్తులు ఇప్పుడు బిక్కచచ్చిపోయి, వ్యవస్థ ఎదుట సాగిలబడ్డారు… యూపీలో జేసీబీలు… జంటటవర్ల కూల్చివేతలు… ఇప్పుడు 200 కోట్ల విల్లాల కూల్చివేత… ఎప్పుడోఓసారి వ్యవస్థలు కళ్లురుముతాయి… పనిచేస్తుంటాయి… అన్నిసార్లూ కాలం అక్రమార్కుల పక్షమే కాదు..!!
kapico

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రేయ్ ఎవుర్రా మీరంతా… ఈ పాదపూజలు, నాగభజనలూ ఏమిటర్రా…
  • అదనపు అమ్మ స్తన్యం… ఎందరెందరో బిడ్డలపై ‘అమ్మతనం’…
  • చందమామపై ఓ విల్లా… ఎట్‌లీస్ట్ ఓ డబుల్ బెడ్‌రూం ఫ్లాట్…
  • కాళేశ్వరంపై కేసీయార్ క్యాం‘పెయిన్’… ఓ పే-ద్ద కౌంటర్ ప్రొడక్టివ్…
  • ఇక్కడ సుహాసిని- విజయశాంతి… అక్కడ జయప్రద – శ్రీదేవి…
  • బాలీవుడ్‌పై అండర్ వరల్డ్ తుపాకీ నీడ… ఓ దర్శకుడి స్టోరీ ఇది….
  • మనసున్న వార్త… ఓ ముసలాయనకు ప్రాణం పోసిన ఓ మనస్విని సేవ…
  • ఎఐసీసీ మంత్రి పదవిని ప్రామిస్ చేస్తే… రేవంత్ రెడ్డిని ఎందుకు అడగడం..!?
  • తెరపైకి మళ్లీ ‘దాసరి చిరంజీవి’… పెద్దన్న పాత్రలోకి రంగప్రవేశం..!!
  • సీఎం సాబ్… తమరు జర్నలిస్టుగా ఉన్న కాలం కాదు… జమానా బదల్ గయా..!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions