Muchata

Find Latest News in Telugu from muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

నేనూ శ్రీవారి భక్తుడినే, నన్ను క్షమించండి… కార్తి సత్వర స్పందన…

September 24, 2024 by M S R

నిజానికి కార్తి తప్పేమీ మాట్లాడలేదు… తిరుమల లడ్డూ వివాదంపై స్పందించడానికే నిరాకరించాడు… అదీ లడ్డూ కావాలా నాయనా అని విలేఖరో, యాంకరో ఏదో తనను ఈ రచ్చలోకి లాగడానికి ట్రై చేసినప్పుడు…

ప్రమోషన్ మీట్లకు వచ్చినప్పుడు… సంబంధం లేని ఇష్యూల్లోకి లాగడానికి, గోకడానికి ఈమధ్య జర్నోలు ఆరాటపడుతున్న తీరు చూస్తూనే ఉన్నాం కదా… ప్రస్తుతం తిరుమల లడ్డూ మీద యావత్ దేశంలోనూ చర్చ సాగుతోంది… హీరో కార్తి నటించిన సత్యం సుందరం సినిమా రిలీజుకు సిద్ధంగా ఉంది…

ఆ సినిమా ప్రమోషన్ కోసం హైదరాబాద్ వచ్చాడు… తమిళ హీరోలకు తమ సినిమాలకు తెలుగు మార్కెట్ కూడా ప్రధానమే… కార్తి మూడునాలుగు సినిమాలు బాగానే ఆడాయి తెలుగులో కూడా… సో, ఈ స్థితిలో పవన్ కల్యాణ్ కార్తి వ్యాఖ్యల పట్ల అభ్యంతరాలు వ్యక్తం చేశాడు, అలా మాట్లాడవద్దని హెచ్చరించాడు…

Ads

నిజానికి కార్తి ఏమన్నాడో, ఏ కాంటెక్స్ట్‌లో ఎలా స్పందించాడో పవన్ కల్యాణ్‌కు సరైన సమాచారం లేనట్టుంది… ఐనా సరే, కార్తి తన కొత్త సినిమా రిలీజు వేళ అనవసరంగా వివాదంలోకి జారిపోవడం ఎందుకని అనుకుని, వెంటనే స్పందించాడు…

కార్తి

ట్వీట్ పెట్టాడు… ఉద్దేశపూరితం కాని తన వ్యాఖ్యలతో ఏవైనా అపార్థాలు తలెత్తితే దానికి క్షమాపణలు చెబుతున్నాను అన్నాడు స్ట్రెయిట్‌గా, ఏ వంకర కూత లేకుండా…! తాను కూడా వెంకటేశ్వరుడి భక్తుడినేననీ, సంప్రదాయాల్ని గౌరవించేవాడినని చెప్పాడు…

హిందూమతంపై ఎప్పుడూ చిల్లర వ్యాఖ్యలు చేసే ప్రకాశ్ రాజ్‌కూ… పంది కొవ్వు రేట్లు చెప్పి పిచ్చికూతలకు దిగిన పొన్నవోలుకు కూడా పవన్ కల్యాణ్ స్ట్రెయిట్‌గా హెచ్చరికలు జారీ చేశాడు… ప్రకాశ్ రాజ్ ఈ స్పందన ఊహించి ఉండడు బహుశా… ఇన్నేళ్లూ ఎలా మాట్లాడినా చెల్లుబాటైంది కదా… మా అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఖండించినట్టు గుర్తు తాజాగా…

పొన్నవోలును మదమెక్కి మాట్లాడకు అన్నాడు పవన్ కల్యాణ్… నిజానికి చంద్రబాబు నంగి మాటలతో ఇంత సీరియస్ రియాక్షన్ చూపించలేడు… ఏపీ బీజేపీ ముఖ్యనేతలకు ఇప్పటికీ నోళ్లు పెగల్లేదు… కానీ పవన్ కల్యాణ్ దూకుడుగా వెళ్తున్నాడు… ప్రాయశ్చిత దీక్ష, దుర్గ గుడి శుద్ధి తదితర అడుగులతో తన స్పీడ్ పెంచాడు… వైసీపీ కాదు గానీ, తటస్థ హిందువులపై ఈ ప్రభావం కనిపిస్తోంది… అభినందిస్తున్నారు…

సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు పెట్టాలనే డిమాండ్‌తోపాటు, మా ధర్మం జోలికి వస్తే ఊరుకోబోమని ధాటిగా మాట్లాడుతున్నాడు… బండి సంజయ్ ఆవహిస్తున్నట్టున్నాడు క్రమేపీ… అవునూ, తెలంగాణ పార్టీలు ఇదేదో ఏపీ వ్యవహారంలే, మనకెందుకు అని వదిలేశాయా..? చివరకు ప్రపంచంలోకెల్లా అరివీర భయంకర హిందువు కూడా జాడలేడు..!

(1) Karthi on X: “Dear @PawanKalyan sir, with deep respects to you, I apologize for any unintended misunderstanding caused. As a humble devotee of Lord Venkateswara, I always hold our traditions dear. Best regards.” / X

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • కేసీయార్ లేదా బాబు అయిఉంటే… ఈ ఈవెంట్ దద్దరిల్లిపోయేది…
  • భారత్ చేతిలో భార్గవాస్త్రం… విదేశీ డ్రోన్లకు పర్‌ఫెక్ట్ విరుగుడు మంత్రం…
  • టర్కీ, అజర్‌బైజాన్… శత్రువుకు మిత్రులు… కాళ్లబేరానికి వస్తున్నారు…
  • పాకిస్థాన్ భారీ సంఖ్యలో యుద్ధ విమానాలను కోల్పోయింది..!!
  • భారీగా బోరాన్ తరలింపు దేనికి..? ఆ అమెరికా విమానం ఏమిటి..?
  • ఆపరేషన్ సిందూర్…! కాల్పుల విరమణ అసలు కహానీ ఇదీ..!
  • ఎట్టెట్టా… ఎన్టీయార్ ఘాట్ వెళ్తే సమస్యలకు పరిష్కారాలు దొరుకుతాయా..?
  • ‘ఆ పాట’ మధురాలు… ఉన్నదే రెండు లైన్లు… సో సో ట్యూన్… ఐతేనేం..!!
  • … మరి ఇప్పుడు తెలుగు చచ్చిపోదా మాస్టారూ… మాట్లాడరు..!!
  • నూటికో కోటికో ఒక్కరు… అది మీరే మీరే మాస్టారూ… ధన్యజీవి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions