Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

రాముడు కృష్ణుడు అనగానే ఎన్టీయార్ గుర్తొచ్చినట్టు… క్రీస్తు అనగానే…!!

December 25, 2025 by M S R

.

Subramanyam Dogiparthi ….. రాముడు , కృష్ణుడు అనగానే NTR ఎలా గుర్తుకొస్తారో….. అలాగే యేసుక్రీస్తు అనగానే విజయచందర్ గుర్తుకొస్తారు … 1978 క్రిస్టమస్ సందర్భంలో రిలీజయిన ఈ కరుణామయుడు సినిమా ద్వారా అంతటి పేరు ప్రఖ్యాతులను విజయచందర్ సంపాదించుకున్నారు …

యేసుక్రీస్తు మీద వచ్చిన అన్ని సినిమాలలో కమనీయంగా తీయబడింది ఈ సినిమా … 14 భాషల్లోకి డబ్ చేయబడింది … విదేశాలలో ఇంగ్లీషు సబ్ టైటిల్సుతో ప్రదర్శించబడింది …

Ads

యేసుక్రీస్తు పాత్రను వేయాలని మొదలుపెట్టిన వారు చివరిదాకా బతకరు అనే భయం ఉన్న రోజుల్లో ధృఢ సంకల్పంతో విజయచందర్ ఈ సినిమాను ప్రారంభించారు . సినిమా కష్టాలన్నీ పడ్డారు . 1974 లో మొదలుపెడితే 1978 క్రిస్టమసుకు విడుదల చేయగలిగారు.. .

ఎలాంటి హడావుడి , హైప్ లేకుండా మొదలయిన ఈ సినిమా శంకరాభరణం సినిమాలాగా నోటి ప్రచారంతో బ్లాక్ బస్టరుగా నిలిచింది … ఈ సినిమాకు దర్శకుడు భీమ్ సింగ్ … ఆయన 1978 జనవరిలో సినిమా పూర్తి కాకముందే చనిపోయారు .. క్రిస్టఫర్ కోలో అనే మరో దర్శకుడు సినిమాను పూర్తి చేసారు …

ఈ సినిమా విజయానికి ఒక కారణం ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులకు అలవాటయిన హిందూ పౌరాణిక సినిమాల్లాగా తీయడం అని నేను భావిస్తాను … ముఖ్యంగా పాటలు , పద్యాల వంటి వచనాలు హిందూ పౌరాణికాల్లాగా అనిపిస్తాయి …

వీటన్నింటినీ మించి సినిమా చివరిలో యేసుక్రీస్తు శిలువ వేయబడే సీను అద్భుతంగా పండింది . సినిమా ఆఖరిలో ఉన్న ఈ శిలువ వేసే సీనుతో పూర్తయిన ఈ సినిమాను చూసి థియేటర్లో నుంచి బయటకు వచ్చే ప్రతి ప్రేక్షకుడి కళ్ళు చెమ్మగిల్లే ఉంటాయి . అంతలా ఆ సీనుతో ప్రేక్షకుడు మమైకం అయ్యేలా చిత్రీకరించారు .

సినిమా అఖండ విజయానికి గుండె కాయలాంటి ఈ సీనే కారణమని నేను నమ్ముతాను . కదిలింది కరుణ రధం పాట ఈరోజుకీ చాలా గొప్ప పాట . మోదుకురి జాన్సన్ వ్రాయగా బాల సుబ్రమణ్యం ఎంతో గొప్పగా పాడారు .

జోసెఫ్ పెర్నాండెజ్ , బి గోపాలం సంగీత దర్శకత్వాన్ని వహించారు . బాల సుబ్రమణ్యం , రామకృష్ణ , ఆనంద్ , సుశీలమ్మ , వాణీ జయరాం గాత్రాన్ని అందించారు . మోదుకురి జాన్సన్ డైలాగులను వ్రాసారు . సినిమా సక్సెస్ అయ్యే రాత ఉంటే అన్నీ ఇలాగే కలిసొస్తాయి . టైటిలే గొప్ప ఎంపిక . ఏ యేసుక్రీస్తు అనో పెట్టకుండా కరుణామయుడు అనే చక్కటి టైటిల్ని ఎంచుకున్నారు .

చంద్రమొహన్ పాత్ర పాడే దేవుడు లేడని అనకుండా , కదిలే మువ్వల సందడిలో , పువ్వుల కన్నా పున్నమి వెన్నెల కన్నా పాటలు చాలా శ్రావ్యంగా ఉంటాయి . టైటిల్సు పడేటప్పుడు వచ్చే పాట పరలోకమందున్న మా తండ్రి అనే పాట ప్రేక్షకులను సినిమాలోకి లాక్కొనిపోతుంది .

భారీ హిందూ పౌరాణిక సినిమాల్లో ఎలా అయితే చాలా పాత్రలు ఉంటాయో అలాగే ఈ సినిమాలో కూడా చాలా పాత్రలు వస్తాయి . తెలుగు సినిమా రంగంలో నటీనటుల్లో చాలామంది ఈ సినిమాలో నటించారు . ఇంతమందిని విజయచందర్ ఎలా తీసుకుని రాగలిగాడు అనే సంశయం కూడా వస్తుంది .

జగ్గయ్య , ధూళిపాళ , చంద్రమోహన్ , గిరిబాబు , మిక్కిలినేని , త్యాగరాజు , పద్మనాభం , రాజనాల , సారధి , మాడా , కొమ్మినేని శేషగిరిరావు , ముక్కామల , రాజబాబు , మాదల రంగారావు , సురేఖ , వెన్నిరాడై నిర్మల , రాజసులోచన , హలం , కె విజయ , అనిత , సుమలత ప్రభృతులు నటించారు .

ఇంగ్లీషు సినిమా The King of Kings ఆధారంగా తీయబడింది . ఈ సినిమాకు ఉత్తమ తృతీయ చిత్రంగా కాంస్య నంది అవార్డుని పొందింది . ఉత్తమ స్క్రీన్ ప్లే రచయిత అవార్డు మోదుకురి జాన్సనుకు లభించింది . ఈ సినిమా ఎంత పాపులర్ అయిందంటే క్రిస్టమస్ నాడు ఏదో ఒక టివి చానల్లో తప్పకుండా వేస్తుంటారు . ఈ సినిమా తర్వాత విజయచందర్ దయామయుడులో సెయింట్ పాల్ గా నటించారు . DD నేషనల్ వారు నిర్మించిన హిందీ ధారావాహికలో యేసుక్రీస్తు పాత్రను మరలా పోషించారు .

నేను ఈ సినిమాను మా నరసరావుపేటలో ఈశ్వర్ మహల్లో చూసా . తర్వాత టివిలో చాలా సార్లే చూసా . యూట్యూబులో ఉంది . తప్పక చూడతగ్గ చిత్రం . కళకు మతం లేదు అని రుజువు చేసిన సినిమా . క్రైస్తవేతరులు కూడా చూసిన సినిమా . చూడనివారు తప్పక చూడండి .

12-10-2024 న నా ఫేస్ బుక్ ద్వారా పరిచయం చేసాను . ఈరోజు క్రిస్మస్ సందర్భంగా మరలా షేర్ చేస్తున్నాను …..

 

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • రాముడు కృష్ణుడు అనగానే ఎన్టీయార్ గుర్తొచ్చినట్టు… క్రీస్తు అనగానే…!!
  • బుక్ ఫెయిర్ సందర్భం చూసి మరీ వదిలినట్టుంది యండమూరి ఈ పోస్టు..!!
  • మెప్పించావు దర్శకా..! చాలా క్లిష్టమైన ప్రయోగాన్ని ఛేదించావుపో…!!
  • రోషన్… హీరో మెటీరియలే…! కానీ ఈ పాత్ర మోయలేనంత బరువు..!!
  • ‘మగ శివాజీ’ లీడ్ రోల్… దండోరా ఓ మంచి ప్రయత్నమే… కానీ..?!
  • ఈషా (Eesha) – ఈ దెయ్యం భయపెట్టలేదు… చిరాకెత్తించింది…
  • ఒకే ఒక డైలాగ్… బలమైన జంగిల్ రాజ్, మాఫియా రాజ్ కూలిపోయింది…
  • తక్కువ మంది అతిథులతో పెళ్లి… ఆశీస్సులు, పలకరింపులు, మర్యాదలు…
  • అసలే వాణిశ్రీ… పైగా చిరంజీవి… విజయశాంతీ ఉండనే ఉంది… ఇంకేం..?!
  • దృశ్యం-3… రాంబాబు మార్క్ ‘ట్విస్ట్’… అడుగు దూరంలో అసలు క్లైమాక్స్!!

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions