Muchata

Find Latest News in Telugu from Muchata.com, A leading news portal in Andhra Pradesh and Telangana

  • Home
  • Contact Us
  • Disclaimer
  • Privacy Policy

హీరో పాత్ర కూడా హీరోయే… గుంటూరోళ్లకు మాంచి కిక్కిచ్చే సినిమా…

August 3, 2024 by M S R

ఇది NTR- జయలలితలు నటించిన కధానాయకుడు సినిమా కాదు . బాలకృష్ణ నటించిన NTR కధానాయకుడు సినిమా కూడా కాదు . ప్రముఖ నిర్మాత దేవీ వర ప్రసాద్ నిర్మాతగా ప్రముఖ దర్శకులు డి యోగానంద్ దర్శకత్వంలో 1975 లో వచ్చిన కధానాయకుని కధ సినిమా . ప్రధాన పాత్రల్లో NTR , వాణిశ్రీలు నటించారు .

ఓ పల్లెటూర్లో రాము అనే అమాయకుడు , మంచివాడు ఉంటాడు . ఆ ఊరి మోతుబరి చెల్లెలు హీరోని ప్రేమిస్తుంది . ఆ మోతుబరితో గొడవపడి డబ్బులు సంపాదిస్తానికి పట్నానికి వచ్చి , అనూహ్యంగా పెద్ద సినిమా హీరో అవుతాడు . కొన్ని మలుపుల తర్వాత హీరోయిన్ని పెళ్లి చేసుకుంటాడు . టూకీగా ఇదీ కధ .

సినిమాలో హీరో పాత్ర సినిమా హీరో కావటం వలన NTR నటించిన సినిమా క్లిప్పింగులు తగిలించారు . ప్రేక్షకులకు భలే సరదాగా ఉంటుంది . భీష్మ , పాండవ వనవాసం , శ్రీకృష్ణావతారం , శ్రీకృష్ణ పాండవీయం , దాన వీర శూర కర్ణ , భలే తమ్ముడు వంటి హిట్ సినిమాల క్లిప్పింగులు జనం చేత చప్పట్లు కొట్టిస్తాయి , ఈలలు వేయిస్తాయి . By the way , ఇప్పుడు సినిమా హాళ్ళలో ఈలలే వినిపించటం లేదు . ఈలలు లేకపోతే ఎలా !?

Ads

ఈ సినిమాలో మా గుంటూరుకు సంబంధించిన ఓ విశేషం ఉంది . NTR పెద్ద హీరో అయ్యాక ఆయన అభిమాన సంఘాలన్నీ కలిసి గుంటూరులో పెద్ద సన్మానం ఏర్పాటు చేస్తారు . జిన్నా టవర్లోని సెంట్రల్ కేఫ్ బోర్డు కూడా చూపిస్తారు . By the way , ఒకప్పుడు సెంట్రల్ కేఫ్ వారివి మూడు హోటళ్లు ఉండేవి . ఇప్పుడు హోటళ్లు లేవు . ఓ లాడ్జి మాత్రమే ఉంది .

సినిమాలో మరో విశేషం ఏమిటంటే NTR ఇంట్లో ఆయన నటించిన ప్రధాన పాత్రల నిలువెత్తు ఫొటోలు , ఆయన కిరీటాలు , గదలు , కత్తులు , ఆభరణాలను తల్లి పాత్రలోని జి వరలక్ష్మి హీరోయిన్ వాణిశ్రీకి , ప్రేక్షకులకు చూపుతుంది . ప్రేక్షకులకు ఆనందం కలుగుతుంది .

NTR , వాణిశ్రీ , భారతి , సత్యనారాయణ , ప్రభాకరరెడ్డి , పండరీబాయి , జి వరలక్ష్మి , రాజబాబు , రమాప్రభ , అల్లు రామలింగయ్య , శ్రీవిద్య , మిక్కిలినేని , కాకరాల , ఛాయాదేవి ప్రభృతులు నటించారు . ప్రముఖ దర్శకుడు , నిర్మాత బి ఏ సుబ్బారావు సినిమాలో సినిమా డైరెక్టర్ పాత్రలో కాసేపు తళుక్కుమంటాడు .

కె వి మహదేవన్ సంగీత దర్శకత్వంలో పాటలు సినిమాలో చాలా శ్రావ్యంగా ఉంటాయి . బయట పెద్దగా హిట్ కాలేదు . వేమన్న చెప్పింది వేదమురా అది కాదన్నవాడు గాడిదరా , చెప్పనా ఒక చిన్న మాట , శ్రీమతి గారూ ఆగండి , ఓ టైటు పేంటు అబ్బాయీ , మగసిరి చూపి మనసును దోచిన మొనగాడా , దేవుడు లోకంలో కొందరు దేవుళ్ళను సృష్టించాడు , చెయ్యండిరా భజన చెయ్యండిరా , ఓ చిలిపి కళ్ళ బావా నీ షోకు చూపరావా పాటలు శ్రావ్యంగా ఉంటాయి .

కొసరాజు , ఆత్రేయ , దాశరధి , సి నారాయణరెడ్డి పాటల్ని వ్రాయగా సుశీలమ్మ , బాలసుబ్రహ్మణ్యం , వాణీ జయరాం , యల్ ఆర్ ఈశ్వరి పాటల్ని పాడారు . ఘంటసాల పాడిన ఓ రెండు పాటలు ఉన్నాయి . మోదుకూరి జాన్సన్ డైలాగ్స్ వ్రాసారు . అప్పలాచార్య హాస్య సన్నివేశాలకు డైలాగ్స్ వ్రాసారు .

సినిమా యూట్యూబులో ఉంది . NTR మార్క్ సినిమా . An entertaining , feel good movie . NTR అభిమానులకు నచ్చుతుంది . గుంటూరు ప్రస్తావన ఉంది కాబట్టి మన గుంటూరు వాళ్ళు చూడకపోతే ఎలా ! చూసేయండి . #తెలుగుసినిమాలసింహావలోకనం #తెలుగుసినిమాలు……… [ By దోగిపర్తి సుబ్రహ్మణ్యం ]

Share this Article



Advertisement

Search On Site

Latest Articles

  • దుశ్శల..! మహాభారతంలో నిర్లక్ష్యానికి, వివక్షకు గురైన ఓ కీలకపాత్ర..!!
  • రష్యా- ఉక్రెయిన్ యుద్ధ విరమణ త్వరలో..! ఏం జరుగుతున్నదంటే..?!
  • మానసవీణా మధుగీతం… నిజంగా ఆపాత మధురం… ఈ స్వర మాధుర్యం…
  • నితిశ్ తరువాత బీహార్‌కు కాబోయే ముఖ్యమంత్రి…! ఇంతకీ ఎవరీయన..!?
  • పగలైతే దొరవేరా… ఓ పదీపదిహేను లలిత పదాలతో… ఆకాశమంత అనురాగం…
  • మైథిలి ఠాకూర్..! ఈ స్వరం భాస్వరమై మండింది కదా… అప్పుడే ట్రోలింగు..!!
  • చంద్రబాబు గారండోయ్… క్షమించండి మా అజ్ఞానానికి… శపించకండి ప్లీజ్…
  • ‘ఫ్యూచర్ సిటీ’ వైపు బాటలు చూపే గ్లోబల్ సమ్మిట్… రైజింగ్ తెలంగాణ..!!
  • పవర్‌ఫుల్ చట్టం IFA-2025 … అక్రమ వలసదారులు పరుగో పరుగు…
  • ఓ సాత్విక పెద్ద భార్య… ఓ గయ్యాళి చిన్న భార్య… ఓ జీవన జ్యోతి…

Archives

Copyright © 2025 · Muchata.com · Technology Management by CultNerds IT Solutions