కామారెడ్డి నుంచి కేసీయార్ పోటీచేస్తున్నాడు… అదేమిటి..? గజ్వెల్‌లో పరిస్థితి ఎటమటంగా ఉందా..? లేక ఈ రెండు స్థానాల పోటీలో ఇంకేదైనా మర్మముందా..? సరే, దాన్ని కాసేపు వదిలేద్దాం… కేసీయార్ పోటీచేస్తున్నాడు కాబట్టి విజయశాంతిని బరిలో దింపుతారని కొందరు, లేదు, ధర్మపురి అర్వింద్‌ను పోటీలో పెడతారు అని మరికొందరు ఊహాగానాలు రాస్తున్నారు…
ఎహె, కిషన్‌రెడ్డిని అక్కడ పోటీలో ఉంచరు, తను కేసీయార్ మీద పోటీచేయడం అనేది కల్ల… మరెవరున్నారు అక్కడ..? పదిమందీ మెచ్చే ఓ కేరక్టర్ ఉంది… ఆల్‌రెడీ కామారెడ్డి బీజేపీ తెరమీద చాన్నాళ్లుగా కనిపిస్తోంది… ఇంకా తెలంగాణ అభ్యర్థుల జాబితాను ఢిల్లీలో ప్రకటించలేదు… బహుశా ఈయన పేరు మాత్రమే ఈ సేటుకు సంబంధించి ఉండొచ్చు, ఏమో బీఆర్ఎస్‌తో రహస్య దోస్తీ కారణంగా ఆయన్ని అభ్యర్థిగా ప్రకటించకపోయినా ఆశ్చర్యపడే పనిలేదు… కేసీయార్ పట్ల ప్రేమతో ఈయన్ని తప్పించినా పెద్ద సర్‌ప్రయిజ్ లేదు… ప్రజెంట్ బీజేపీ వేరు కదా…
ఆయన పేరు కాటిపల్లి వెంకట రమణారెడ్డి… రియల్ లీడర్… ఆయన రాజకీయ ప్రస్థానం చూస్తే అభినందించాలని ఉంది… వైఎస్‌కు ఇష్టుడు, అభిమానిగా ఉండేవాడు… గతంలో జిల్లా పరిషత్ చైర్మన్… ఇదుగో ఈయనే…
Ads
ఇప్పటికే నియోజకవర్గంలో దాదాపు 60 కోట్ల రూపాయల్ని ఖర్చు చేశాడు… ఎన్నికల ప్రచారం కోసం కాదు… రియల్ సర్వీస్ మోటో… అఫ్‌కోర్స్, రాజకీయాల్లో ఉన్నవాడే… కానీ ఎందరు రాజకీయ నాయకులు తమ జేబుల నుంచి సొసైటీ కోసం ఖర్చు చేస్తున్నారు..? రూపాయి కూడా తీయరు… ఎన్నికలొస్తేనే తప్పనిసరై ఖర్చుపెడతారు… వందల కోట్లు సంపాదించినా సరే, చేయి విదిల్చరు, ఎవరికీ ఏ సాయమూ చేయరు… కానీ ఈయన డిఫరెంటు… అనేక గ్రామాల్లో… కాదు, కామారెడ్డి నియోజకవర్గంలోని దాదాపు ప్రతి ఊరికీ సాయం చేశాడు…
కమ్యూనిటీ హాళ్లు, గుళ్లు, ఫంక్షన్ హాళ్లు… ఎవరికీ నగదు ఇవ్వడు, దుర్వినియోగం కావద్దని… మొత్తం పనులు తనే చేయిస్తాడు… ఇక్కడ మరొకటి గుర్తు చేసుకోవాలి… కేసీయార్ కామారెడ్డి నుంచి పోటీ చేయాలని ఎప్పుడో అనుకున్నాడు… వెంటనే రాష్ట్రంలోని పెద్ద గుళ్ల ఖజానాల నుంచి కామారెడ్డి గుళ్లకు నిధుల సర్దుబాటు చేయాలని ఆదేశాలు ఇచ్చారు… ఈ యవ్వారంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ ఆదేశాలు రద్దు చేశారట… కానీ సదరు బీజేపీ లీడర్ ఏనాటి నుంచో గుళ్లను డెవలప్ చేస్తున్నాడు… తన సొంత ఖర్చుతో…
తను గెలిచినా ఓడినా లైట్ తీసుకుంటాడు… తండ్రి పేరిట ఓ ట్రస్ట్ ఏర్పాటు చేశాడు… ఇన్ని పనులు చేస్తున్నాడు కదా, తన వల్ల లబ్ధి పొందిన వాళ్లకు కండువాలు కప్పి, పార్టీ కలర్ పూయలేదు ఎక్కడా… ఈరోజుకూ వోట్లడగడు… పార్టీ మేనిఫెస్టో ఎలా ఉంటుందనేది పక్కన పెడితే, తను వ్యక్తిగతంగా ఓ మేనిఫెస్టో ప్రకటించాడు… ఏయే ఊళ్లలో ఏమేం పనులు చేస్తాననేది ఆ మేనిఫెస్టో సారాంశం… ఆయన ఎలాంటోడే తెలుసు కాబట్టి ఈ మేనిఫెస్టోకు క్రెడిబులిటీ ఉంది…
పార్టీ ఏం చేసినా ఏం చేయకపోయినా తను మాత్రం 150 కోట్ల ఆ పనులు చేస్తానంటున్నాడు… గ్రేట్… ఆ పనుల్లో కూడా ఉచిత హాస్పిటల్స్, మోడల్ స్కూళ్ల వంటివి ఉన్నాయి… గుడ్… నీలాంటి నేతలు రాజకీయాల్లో ఉండాలి భయ్యా… కీపిటప్… అక్కడ కేసీయార్ గెలిచినా సరే, తను ఖాళీ చేసి మళ్లీ ఎవరిని నిలబెట్టినా సరే, జనానికి మాత్రం నువ్వే యాదికి ఉంటవ్…!!
Share this Article